IPL 2025 Suspended | ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా | ABP Desam
భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025 సీజన్ ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధికారులు ఏఎన్ఐతో చెప్పారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ..దేశ భద్రతే ప్రథమ ప్రాధ్యానంగా..దేశ,విదేశీ ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ కీలక నిర్ణయాన్ని బీసీసీఐ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. నిన్న ధర్మశాల లో బ్లాక్ అవుట్ పాటించటంతో ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ అర్థాంతరంగా రద్దైంది. ధర్మశాల విమానాశ్రయం కూడా మూసివేయటంతో ఆటగాళ్లను ప్రత్యేక రైలు ద్వారా న్యూఢిల్లీకి తరలిస్తున్నారు. ఇప్పటికే ఆఖరి దశకు చేరుకున్న ఐపీఎల్ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఐసీసీ క్యాలెండర్ ను దృష్టిలో పెట్టుకుని తిరిగి ఆగిన దగ్గర నుంచి నిర్వహిస్తారు. గతంలో కోవిడ్ సమయంలోనూ ఇలానే సగం మ్యాచ్ లు ఓసారి..సగం మ్యాచ్ లు మరోసారి నిర్వహించారు. వారం రోజుల తర్వాత ఎప్పుడు నిర్వహించాలనేది నిర్ణయిస్తామని బీసీసీఐ తెలిపింది.