MS Dhoni Last Over Six vs KKR | కోల్ కతాపై 2వికెట్ల తేడాతో సీఎస్కే విక్టరీ

 లైఫ్ ఈజ్ ఏ ఫుల్ సర్కిల్ అంటారు కదా. సీఎస్కే అండ్ ధోనీ విషయంలో ఎవ్రీ డే ఈజ్ ఏ ఫుల్ సర్కిల్ అనాలేమో. ఎందుకంటే ఈ సీజన్ అండ్ లాస్ట్ సీజన్ లో సీఎస్కే ఫెయిల్ అయినా సరే..చెన్నై మ్యాచ్ గెలిచిందంటే మాత్రం తప్పని సరిగా జరిగే ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. అది కచ్చితంగా కెప్టెన్ MS ధోనీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మ్యాచ్ లో ఓ మెరుపు స్టంపింగ్ చేస్తాడు. నిన్న కోల్ కతా మ్యాచ్ లోనూ చేశాడు. నూర్ అహ్మద్ బౌలింగ్ లో కళ్లు మూసి ముందుకు వెళ్లిపోయిన నరైన్ ను మెరుపు వేగంతో స్టంప్ చేశాడు ధోనీ. వాస్తవానికి ధోని బాల్ పిక్ చేయటానికి చాలా టైమ్ పట్టినా..నరైన్ తిరిగి బ్యాట్ క్రీజులో పెట్టే లోపు స్టంప్స్ బద్ధలు కొట్టాడు మాపీ. రెండోది లాస్ట్ ఓవర్ సిక్స్. ప్రజరంతా మీదేసుకుని లాస్ట్ ఓవర్ వరకూ మ్యాచ్ ను లాక్కెళ్లి అక్కడ తన దైన శైలిలో సిక్సర్లు కొడుతూ అయితే గెలిపిస్తాడు లేదంటే అవుటై వెళ్లిపోతాడు ధోనీ. రెండింటిలో ఏదో ఒకటి పక్కా. కానీ ఇటీవల కాలంలో ఓఢిపోవటమే ఎక్కువ తెలిసినట్లు ఆడుతున్న ధోనీ రాత్రి మాత్రం గెలిపించేశాడు. లాస్ట్ ఓవర్ లో చెన్నై గెలవాలంటే 9పరుగులు చేయాలన్నప్పుడు తనొక్కడే బ్యాటర్ గా ఉన్నా ధోనీ ఏం కంగారు పడకుండా కూల్ గా రస్సెల్ ఫుల్ టాస్ బాల్ ను సిక్సర్ బాదేసి చెన్నై కి 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు ధోనీ. మూడోది ఎల్లో సీ. నిన్న మ్యాచ్ జరిగింది ఈడెన్ గార్డెన్స్ కోల్ కతా లో కానీ చూస్తే మొత్తం ఎల్లో సీ. పసుపు సముద్రమే కనపడింది ఎటువైపు చూసినా. ధోనీని చూడటం కోసం ఫ్యాన్స్ భారీగా తరలివస్తారు బెంగాల్ లో మ్యాచ్ ఉన్నప్పుడల్లా. అలా నిన్న ఎల్లోసీ ఈడెన్ ను ముంచెత్తింది. నాలుగోది ఇంత మంది జనాలను చూశాక కామెంటేటర్ జనరల్ గా అడిగే రిటైర్మెంట్ ప్రశ్న. కానీ ఈసారి కామేంటేటర్ ఫ్యాన్స్ గురించి ధోనినే రిటైర్మెంట్ గురించి మాట్లాడాడు. తన అభిమానులంతా తనకు ఇదే లాస్ట్ మ్యాచ్ అనుకుని వస్తున్నారని వాళ్లను ప్రేమను పొందంట చాలా గొప్పగా ఫీలవుతానని..అయితే ఏడాదిలో క్రికెట్ ఆడుతోంది రెండు నెలలే కాబట్టి వచ్చే ఏడాది ఆడగలనో లేదో ఇప్పుడే చెప్పలేనని ఓ 7-8 నెలలు గడిచిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు మాహీ. ఇది ఎప్పుడూ చెప్పేదే. అందుకే అంటున్నాగా ధోనీ సీఎస్కే మ్యాచ్ అంటే..మెరుగు స్టంపింగ్..లాస్ట్ ఓవర్ సిక్స్...ఎల్లో సముద్రం..రిటైర్మెంట్ క్వశ్చన్..లైఫ్ రిపీట్స్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola