Rohit Sharma Retirement | టెస్టు కెప్టెన్ గా వారిలో ఒకరి ఛాన్స్‌

స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ షాక్ కు గురి చేసాడు. ఇప్పటికే టీ20 క్రికెట్ నుంచి కూడా  తప్పుకున్నాడు. ఇక ఇప్పుడు టెస్టు క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు ముందు రోహిత్ ఈ నిర్ణయం తీసుకోవడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇక రోహిత్ తర్వాత టెస్ట్ జట్టుకి ఎవరు నాయకత్వం వహిస్తారన్న చర్చ మొదలయింది. ఎన్నో పేర్లు తెరమీదకి వస్తున్నాయి. కానీ ఛాన్స్ మాత్రం ఒక్కరికే ఉంది. గత సిరీస్‌ల ఓటమి తర్వాత టెస్టుల విషయంలో భారత్‌పై చాలా ఒత్తిడి ఉంది. అందుకే ఈ బాధ్యతలు చేపట్టే వాళ్లు ఆ ఒత్తిడిని తట్టుకొని జట్టును నడిపించాల్సి ఉంటుంది. టెస్ట్ కెప్టెన్ అంటే ప్రస్తుతం గుర్తొస్తున్నపేరు జస్ప్రీత్ బుమ్రా. ఆ ఛాన్స్ ఉన్న ఆటగాళ్లలో మొదటి స్థానంలో ఉండేది కూడా జస్ప్రీత్ బుమ్రా. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తన నాయకత్వంతో అందరినీ ఆకట్టుకున్నాడు. అందుకే బుమ్రా కెప్టెన్సీ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. ఇక ఈ రేస్ లో వినిపిస్తున్న మరో పేరు శుభ్‌మన్‌ గిల్‌. చాలా తక్కువ సమయంలోనే భారత వన్డే జట్టులో వైస్ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు.ఆ కోణంలో చూసుకుంటే రాబోయే కొంతకాలంలో గిల్‌ను కొత్త కెప్టెన్‌గా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. కేఎల్ రాహుల్ కూడా కెప్టెన్ అయి ఛాన్స్ ఉంది. ఐపీఎల్ తోపాటు రాహుల్ 2021 - 22 లో సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ కి క్యాప్టియన్ గా వ్యవహరించాడు. మొదటి మ్యాచ్ గెలిచాడు కూడా. టెస్టులో శ్రేయస్ అయ్యర్ , రిషబ్ పంత్ కి కూడా మంచి రికార్డ్స్ ఉన్నాయి. వీళ్లకి ఉండే దూకుడు భారత టెస్ట్ జట్టుకు విజయవంతమైన కెప్టెన్‌గా మారడానికి సహాయపడుతుంది. చూడాలి మరి టీం ఇండియా సెలెక్టర్లు ఎవర్ని ఎంపిక చేసుకుంటారో.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola