IPL 2022 rcb vs rr preview royal challengers bangalore vs rajasthan royals head to head records : ఐపీఎల్‌ 2022లో 39వ మ్యాచులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Banglore), రాజస్థాన్‌ రాయల్స్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌) తలపడుతున్నాయి. పుణె ఇందుకు వేదిక. ఈ సీజన్లో వారిద్దరూ తలపడుతున్న రెండో మ్యాచ్‌ ఇది. రెండు జట్ల పరిస్థితి ఒకేలా ఉంది. మరి వీరిలో ఎవరిది పైచేయి? తుది జట్లలో ఎవరుంటారు? గెలిచేదెవరు?


ఒకేలా రెండు!


కొంచెం నెమ్మదిగా స్టార్ట్‌ చేయడం, మధ్యలో రికవర్‌ అవ్వడం, ఆఖర్లో టెన్షన్‌ పడటం బెంగళూరు, రాజస్థాన్‌కు (RCB vs RR) ఎప్పట్నుంచో అలవాటు. గతంలో పోలిస్తే ఇప్పుడు మాత్రం కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. ఏడు మ్యాచులాడి 5 గెలిచిన సంజు సేన 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. 8 మ్యాచుల్లో 5 గెలిచిన డుప్లెసిస్‌ బృందం నెట్‌ రన్‌రేట్‌ కాస్త తక్కువగా ఉండటంతో ఐదో స్థానంలో నిలిచింది. అంటే నేటి మ్యాచులో ఎవరు గెలిచినా 12 పాయింట్లతో ఒకటి లేదా రెండుకు వెళ్లిపోతారు.


RCBదే కాస్త పైచేయి!


ఈ సీజన్లో కొన్ని రోజుల ముందే 'రాయల్స్‌' పోరు జరిగింది. ఈ మ్యాచులో బెంగళూరు విజయం అందుకుంది. జోస్‌ బట్లర్‌ (70), పడిక్కల్‌ (37), హెట్‌మెయిర్‌ (42*) బ్యాటింగ్‌తో మొదట రాజస్థాన్‌ 169 పరుగులు చేసింది. 19.1 ఓవర్లలోనే డుప్లెసిస్‌ బృందం ఈ లక్ష్యాన్ని ఛేదించింది. ఇందుకు  ఒకే ఒక్క కారణం షాబాజ్‌ అహ్మద్‌ (45; 26 బంతుల్లో), దినేశ్‌ కార్తీక్‌ (44*; 23 బంతుల్లో) సూపర్‌ బ్యాటింగే. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 25 సార్లు తలపడగా 13-10తో బెంగళూరుదే పైచేయి.


బట్లర్‌ ఏం చేస్తాడో?


వరుస శతకాలతో దుమ్మురేపుతున్న జోస్‌ బట్లర్‌ ఈ మ్యాచులో అత్యంత కీలకం. అతడికి దేవదత్‌ పడిక్కల్‌ చక్కగా సహకారం అందిస్తున్నాడు. సంజు శాంసన్‌, హెట్‌మైయిర్‌ ఫామ్‌లో ఉండటం రాజస్థాన్‌కు కలిసొచ్చే అంశం. మిడిలార్డర్లో ఒకరిద్దరు సక్సెస్‌ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌, ప్రసిద్ధ్‌, యూజీ, అశ్విన్‌కు పేరు పెట్టాల్సిన పన్లేదు. మరోవైపు బెంగళూరులో ఎవరూ నిలకడగా ఆడటం లేదు. షాబాజ్‌, డీకే మాత్రమే ప్రతి మ్యాచులో రాణిస్తున్నారు. మాక్సీ, డుప్లెసిస్‌ జోరు పెంచాలి. కోహ్లీ ఏం చేస్తాడో చూడాలి. బెంగళూరు గత మ్యాచులో తక్కువకే ఆలౌటైంది.


RCB vs RR Playing XI


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: డుప్లెసిస్‌, అనుజ్‌ రావత్‌/రజత్‌ పాటిదార్‌, విరాట్‌ కోహ్లీ, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, షాబాజ్‌ అహ్మద్‌, సుయాశ్‌ ప్రభుదేశాయ్‌, దినేశ్‌ కార్తీక్‌, వనిందు హసరంగ, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌


రాజస్థాన్‌ రాయల్స్‌: జోస్‌ బట్లర్‌, దేవదత్‌ పడిక్కల్‌, సంజు శాంసన్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, కరుణ్‌ నాయర్‌, రియాన్‌ పరాగ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఒబెడ మెక్‌కాయి, ట్రెంట్‌ బౌల్ట్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్‌