ముంబైలోని వాంఖడే స్టేడియం మరో అద్భుతమైన మ్యాచ్‌కు వేదికైంది. పంజాబ్ కింగ్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికరమైన సన్నివేశాలు కనిపించాయి. ఈ మ్యాచ్‌లో చెన్నైను రెండోసారి ఓడించిన పంజాబ్‌ కింగ్స్‌ ఆరోస్థానానికి ఎగబాకింది. 


శిఖర్‌ ధావన్ అజేయమైన రికార్డ్‌ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను సీఎస్‌కే నుంచి లాక్కున్నాడు. 88 పరుగులు చేసి ఐపీఎల్‌లో ఆరువేలు, చెన్నైపై వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. బౌలింగ్‌లో కూడా పంజాబ్‌ సూపర్ కింగ్స్ అద్భుతంగా రాణించింది. ఓవైపు అంబటి రాయుడు మెరుపు వేగంతో పరుగులు సాధిస్తున్నప్పటికీ పంజాబ్‌ కింగ్స్‌ ఎక్కడా బెదరలేదు. అవతలి ఎండ్‌లో వికెట్లు తీస్తూ చెన్నైకు మ్యాచ్‌ను దూరం చేశారు. 


మొదట రాబిన్ ఉతప్పను  సందీప్‌ శర్మ అవుట్‌ చేసి ఓ దెబ్బ కొడితే... ఈ సీజన్‌లో పంజాబ్ అత్యుత్తమ బౌలర్ అయిన అర్ష్‌దీప్‌ సింగ్‌... ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్‌ను రెండో వికెట్‌గా అవుట్‌ చేసి పెద్ద దెబ్బ తీశాడు. సాంట్నర్ ఆఫ్‌స్టంప్‌ను పూర్తిగా కవర్ చేసి లెగ్‌వైపు షాట్‌ కొట్టబోయాడు. అర్ష్‌దీప్ తెలివైన డెలివరీతో సాంట్నర్‌ను బోల్తా కొట్టించాడు. లెగ్‌ స్టంప్‌ ఎగరగొట్టి బౌల్డ్ చేశాడు.






సాంట్నర్‌ను అవుట్ చేసిన ఆనందంలో అర్ష్‌దీప్‌ చేసిన డాన్స్‌ ఉప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌ చల్ చేస్తోంది. వికెట్‌ తీసిన తర్వాత హార్ష్‌ రైడింగ్ చేస్తున్నట్టు డ్యాన్స్‌ చేశాడు. ఈ ప్రత్యేకమైన వేడుక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అభిమానులను కూడా ఆకట్టుకుంది.


అర్ష్‌దీప్‌ సింగ్ చేసిన డ్యాన్స్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి