KL Rahul Becomes 5th Indian To Complete 50 Fifties In T20 Cricket: పంజాబ్ కింగ్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) కు మారి కెప్టెన్‌గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డు నమోదు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన రాహుల్.. పొట్టి ఫార్మాట్లో ఇది 50వది కావడం విశేషం. ఈ రికార్డు నమోదు చేసిన 5వ భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, కాగా అత్యంత వేగంగా ఈ ఫీట్ చేసిన ఆటగాడిగా నిలిచాడు కేఎల్ రాహుల్.


టాప్‌లో విరాట్ కోహ్లీ.. 
గతంలో భారత్ నుంచి విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేష్ రైనాలు టీ20 క్రికెట్‌లో 50 అర్ధ శతకాలు సాధించారు. ఈ జాబితాలో ఆర్సీబీ మాజీ కెప్టెన్ కోహ్లీ 76 హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. కానీ వీరందరి కంటే కేఎల్ రాహుల్ అతి వేగంగా ఈ ఫీట్ నమోదు చేశాడు. టీ20 ఆటగాళ్లలో అత్యుత్తమ ఆటగాళ్లలో రాహుల్ ఒకడు. వికెట్ కీపర్‌గా, ఓపెనర్‌గా జట్టుకు సేవలు అందిస్తున్న రాహుల్‌.. ఈ సీజన్‌లోనే టాప్ 4 చేరుకునే అవకాశాలున్నాయి. ఈ స్థానంలో ఉన్న సురేష్ రైనాను ప్రస్తుత ఐపీఎల్ 2022 సీజన్‌లో ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. 







టీమిండియా నుంచి టాప్ 5 ప్లేయర్స్..
1) విరాట్ కోహ్లీ (Virat Kohli) - 328 మ్యాచ్‌లు, 76 హాఫ్ సెంచరీలు
2) రోహిత్ శర్మ (Rohit Sharma) - 372 మ్యాచ్‌లు, 69 హాఫ్ సెంచరీలు
3) శిఖర్ ధావన్ (Shikhar Dhawan) - 305 మ్యాచ్‌లు, 63 హాఫ్ సెంచరీలు
4) సురేష్ రైనా (Suresh Raina) - 336 మ్యాచ్‌లు, 53 హాఫ్ సెంచరీలు
5) కేఎల్ రాహుల్ (KL Rahul) - 175 మ్యాచ్‌లు, 50 హాఫ్ సెంచరీలు


గత సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు ఆడిన కేఎల్ రాహుల్ ఈ ఏడాది రూ.17 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 2022 అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు కేఎల్ రాహుల్. ప్రస్తుత ఫామ్ కొనసాగిస్తే ఈ జాబితాలో రాహుల్ ఒకటి, లేదా రెండో స్థానానికి చేరుకునే ఛాన్స్ ఉంది.


Also Read: IPL 2022 SRH vs LSG Memes: లక్నో చేతిలోనూ ఓటమి, సన్‌రైజర్స్‌పై పేలుతున్న ఫన్నీ మీమ్స్ చూశారా


Also Read: IPL 2022 SRH vs LSG: అదే సన్‌రైజర్స్ కొంప ముంచింది - వరుసగా రెండో ఓటమిపై కేన్ మామ ఏమన్నాడంటే