IPL 2022 SRH vs LSG Memes: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ కొన్ని కీలక జట్లకు ఏమాత్రం కలిసి రావడం లేదు. ముఖ్యంగా 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు, 4 సార్లు ఛాంపియన్, డిఫెండింగ్ చాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), అంచనాలు లేకుండా బరిలోకి దిగి సంచలనాలు నమోదు చేసే సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్లకు వరుస ఓటములు స్వాగతం పలుకుతున్నాయి. ముంబై, సన్‌రైజర్స్ ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓటమి చవిచూడగా.. సీఎస్కే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. హ్యాట్రిక్ ఓటములతో సీజన్‌ను కొనసాగిస్తోంది రవీంద్ర జడేజా సారథ్యంలోని సీఎస్కే టీమ్.
నిన్న జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 157 పరుగులకే పరిమితం అయింది. వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమిపాలైన సన్‌రైజర్స్‌పై నెటిజన్లు మీమ్స్ (SRH vs LSG Memes) వదులుతున్నారు. లక్నోతో మ్యాచ్‌లోనూ ఓడిన సన్‌రైజర్స్ టీమ్‌ను ఫన్నీ ట్రోల్స్‌తో ఓ ఆట ఆడుకుంటున్నారు.
ఈ సీజన్‌లో వార్నర్ గైడెన్స్ మనకు మిస్సయింది అని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. గత సీజన్‌లో తనను పక్కన పెట్టడంతో, ఏకంగా సన్‌రైజర్స్ నుంచి బయటకు వచ్చేశాడు డేవిడ్ వార్నర్. దాంతో వార్నర్ లేకపోతే ఇది అని ఫన్నీ మీమ్స్ వదులుతున్నారు.
నేను మ్యాచ్‌లో ఉంటే స్విగ్గీ ఫాస్టెస్ట్ మనకు కాకుండా ఇంకెవరికి తగ్గుతుందంటూ సన్‌రైజర్స్ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌పై ఫన్నీ మీమ్ వచ్చింది. నిన్నటి మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ డెలివరీ 152.4 కి.మీ వేగంతో సంధించాడు ఉమ్రాన్ మాలిక్. మిగతా నాలుగు ఫాస్టెస్ట్ డిలివరీలు కూడా అతడి పేరిటే ఉన్నాయి.
ఏంటీ డాడీ నన్ను అలా చూస్తున్నావు. నేను హోం వర్క్ మొత్తం పూర్తి చేసి ఏపీఎల్ 2022 చూస్తున్నా తెలుసా అని కృనాల్ పాండ్యా తదేకంగా చూస్తున్న ఫొటో షేర్ చేశారు నెటిజన్లు.
సన్‌రైజర్స్, ముంబై, చెన్నై వరుస మ్యాచ్‌లలో ఓటమిపాలయ్యాయి. దీంతో ఈ సీజన్‌లో ఖాతా తెరిచేది ఎప్పుడు అని మూడు టీమ్స్ కెప్టెన్లు సమావేశం అయ్యారట.
మళ్లీ ఇంటికి వచ్చెయ్.. నువ్వు మాకు మళ్లీ కావాలంటూ లక్నో సూపర్ జెయింట్ స్టార్ పేసర్ అవేశ్ ఖాన్ గురించి పోస్టులు వస్తున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్‌పై సైతం ట్రోల్స్ వస్తున్నాయి. ప్రతి ఏడాదిలాగే ఈసారి మ్యాచ్‌లకు రావడం టీమ్‌ను ఎంకరేజ్ చేయడం, వారు నిరాశపరిస్తే బాధగా ఇంటికి వెళ్లి నిద్రపోవడం, మళ్లీ రావడం నిరాశగా వెళ్లడమేగా అని ట్వీట్లు చేస్తున్నారు.
డొమెస్టిక్ క్రికెట్‌లో ప్రత్యర్థులుగా ఉండే పాండ్యా, దీపక్ హుడా.. ఐపీఎల్ లో సోదరుల్లా కలిసిపోయి ఆడుతున్నారని ట్రోల్ చేశారు.
ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తేలిపోయి, కేవలం ఐపీఎల్‌లో సత్తా చాటే కేఎల్ రాహుల్ అని టీమిండియా ఓపెనర్‌పై ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
IPL 2022, IPL 2022 Live, Sunrisers Hyderabad, IPL, SRH vs LSG Memes