IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) వరుసగా రెండో ఓటమి ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 12 పరుగులతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 157 పరుగులకే పరిమితం అయింది. దీంతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలోనే కొనసాగుతోంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ ఓటములు మూటకట్టుకుంది.
170 పరుగుల ఛేజింగ్‌లో రాహుల్ త్రిపాఠి, ఎయిడిన్ మార్‌క్రమ్ మద్య 47 పరుగుల భాగస్వామ్యం విజయంపై సన్‌రైజర్స్‌లో ఆశలు రేపింది. ఆపై నికోలస్ పూరన్ 24 బంతుల్లో 34 పరుగులు చేసి టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా కీలక సమయంలో వికెట్ సమర్పించుకున్నాడు. విజయానికి చివరి 3 ఓవర్లలో సన్‌రైజర్స్ విజయానికి 33 రన్స్ కావాలి. కానీ లక్నో బౌలర్లు అవేశ్ ఖాన్ 2 వికెట్లు, చివరి ఓవర్లో జేసన్ హోల్డర్ 3 వికెట్లతో రాణించడంతో సన్‌రైజర్స్ రెండో ఓటమి పాలైంది. గెలవాల్సిన మ్యాచ్ సన్‌రైజర్స్ చేజేతులా వదులుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లక్నోపై ఓటమిపై కేన్ విలియమ్సన్.. (Kane Williamson reaction after SRH losing to Lucknow)
‘బాల్ బ్యాట్ మీదకు సరిగానే వచ్చింది. కానీ మేం చివర్లో తడబాటుకు లోనయ్యాం. సరైన భాగస్వామ్యాలు నిర్మించడంలో విఫలమవుతున్నాం. దాని వల్ల తక్కువ పరుగుల తేడాతో మ్యాచ్‌లు కోల్పోతున్నాం. అయితే సరైన విధంగా భాగస్వామ్యాలు నెలకొల్పుతూ ప్లాన్ ప్రకారం ఆడితే విజయం తమదేనని’ లక్నో సూపర్ జెయింట్స్‌పై ఓటమి అనంతరం స్టార్ స్పోర్ట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ వివరాలు షేర్ చేసుకున్నాడు.
అదే సన్‌రైజర్స్ కొంప ముంచింది..
27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లక్నో జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. నాలుగో వికెట్‌కు కెప్టెన్ కేఎల్ రాహుల్, ఆల్ రౌండర్ దీపక్ హుడా నెలకొల్పిన 82 పరుగుల భారీ భాగస్వామ్యం రెండు ఇన్నింగ్స్‌ల మధ్య ప్రధాన వ్యత్యాసమని విలియమ్సన్ చెప్పాడు. పవర్ ప్లే లో మా బౌలర్లు రాణించారు. అయితే రాహుల్, హుడా భాగస్వామ్యాన్ని త్వరగా విడగొట్టకపోవడంతో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది.
అదే మాకు పాజిటివ్..
పవర్ ప్లే లో బౌలర్లు రాణిస్తున్నారు. డెత్ ఓవర్లలో భువనేశ్వర్ కుమార్ ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. నటరాజన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టం ప్లస్ పాయింట్. బౌలింగ్‌లో మేం పటిష్టంగానే ఉన్నా, బ్యాటింగ్‌లో భాగస్వామ్యాలపై ఫోకస్ చేయాలని విలియమ్సన్ భావిస్తున్నాడు. సానుకూలాంశాలతో తరువాతి మ్యాచ్‌లలో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తామన్నాడు.
Also Read: SRH Vs LSG: రైజర్స్ రాత మారలేదు - లక్నో చేతిలో 12 పరుగులతో ఓటమి - ఆఖర్లో బొక్కబోర్లా!