IPL 2022: DC vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇదివరకే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓ ఫిజియోకు కరోనా సోకగా.. ఆపై మిచెల్ మార్ష్ అనే ఆటగాడికి కోవిడ్19 సోకినట్లు నిర్ధారించారు. మరో ముగ్గురు సభ్యులకు సైతం కరోనా పాజిటివ్ అని ఆర్‌టీపీసీఆర్ టెస్టులో తేలింది. ఓ ఆటగాడికి కరోనా సోకడంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్, సిబ్బంది పుణె ప్రయాణం వాయిదా వేసుకోవడం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ వేదికను పుణె నుంచి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియానికి (DC vs PBKS match venue changed from pune to Mumbai brabourne stadium) మార్చారు. ఢిల్లీ జట్టులో కరోనా కేసులు రావడంతో ప్రయాణం చేయడం కంటే ముంబైలో ఉన్నవారిని అక్కడే ఉంచి మ్యాచ్ నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఐపీఎల్ 15 సీజన్ షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ ఏప్రిల్ 20న జరగనుంది.
పుణె ప్రయాణం వాయిదా.. నేడు వేదిక మార్పు
ఓ ఆటగాడికి కరోనా సోకడంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్, సిబ్బంది పుణె ప్రయాణం వాయిదా వేసుకున్నారు. ఓ ఆటగాడికి పాజిటివ్ రాగా, జట్టు మొత్తం క్వారంటైన్‌కు వెళ్లింది. ఆర్‌టీ పీసీఆర్ టెస్టులు నిర్వహించి తదుపరి ఫలితాన్ని వెల్లడించాల్సి ఉంటుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్లేయర్ కరోనా బారిన పడటంతో మిగతా ఆటగాళ్లు మ్యాచ్‌కు సిద్ధంటా ఉంటారా లేదా అనే విషయంపై సందేహాలు నెలకొన్నాయి. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌తో ఆడనుండగా కరోనా కేసు నమోదైంది.
ఢిల్లీ క్యాపిటల్స్ లో కరోనా సోకింది వీరికే..
1. పాట్రిక్ ఫర్హాత్ - ఫిజియోథెరపిస్ట్ (ఏప్రిల్ 15న కరోనా పాజిటివ్)
2. చేతన్ కుమార్ - స్పోర్ట్స్ మసాజ్ థెరపిస్ట్ (ఏప్రిల్ 16న కరోనా పాజిటివ్)
3. మిచెల్ మార్ష్ - ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ (ఏప్రిల్ 18న కరోనా పాజిటివ్)
4. అభిజిత్ సాల్వి – టీమ్ డైరెక్టర్ (ఏప్రిల్ 18న కరోనా పాజిటివ్)
5. ఆకాష్ మనె – సోషల్ మీడియా కంటెంట్ టీమ్ మెంబర్ (ఏప్రిల్ 18న కరోనా పాజిటివ్)
పాయింట్ల పట్టికలో 8వ స్థానం..
రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తమ చివరి మ్యాచ్‌లో ఆర్సీబీతో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ తాజా సీజన్‌లో 5 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 2 విజయాలతో 8వ స్థానానికి పరిమితమైంది.
Also Read: RR vs KKR, Match Highlights: బట్లర్ సెంచరీ, చాహల్ హ్యాట్రిక్ - థ్రిల్లర్‌లో రాజస్తాన్ విక్టరీ!