IPL 2022 Delhi Capitals Player Tests Positive: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)లో కరోనా కలకలం రేపుతోంది. ఇదివరకే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓ ఫిజిజయోకు కరోనా సోకగా.. తాజాగా జట్టులో కరోనా పాజిటివ్ (Covid-19 Hits IPL 2022) కేసు నమోదైంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓ ఆటగాడికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, జట్టు మొత్తాన్ని క్వారంటైన్‌లో ఉంచారు. ఏ ఆటగాడికి కరోనా సోకిందనే వివరాలను ఫ్రాంచైజీ గోప్యంగా ఉంచింది.
పుణె ప్రయాణం వాయిదా..
ఓ ఆటగాడికి కరోనా సోకడంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్, సిబ్బంది పుణె ప్రయాణం వాయిదా వేసుకున్నారు. ఓ ఆటగాడికి పాజిటివ్ రాగా, జట్టు మొత్తం క్వారంటైన్‌కు వెళ్లింది. ఆర్‌టీ పీసీఆర్ టెస్టులు నిర్వహించి తదుపరి ఫలితాన్ని వెల్లడించాల్సి ఉంటుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్లేయర్ కరోనా బారిన పడటంతో మిగతా ఆటగాళ్లు మ్యాచ్‌కు సిద్ధంటా ఉంటారా లేదా అనే విషయంపై సందేహాలు నెలకొన్నాయి. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌తో ఆడనుండగా కరోనా కేసు నమోదైంది.
పాయింట్ల పట్టికలో 8వ స్థానం..
రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తమ చివరి మ్యాచ్‌లో ఆర్సీబీతో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ తాజా సీజన్‌లో 5 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 2 విజయాలతో 8వ స్థానానికి పరిమితమైంది.
గత సీజన్లోనూ కరోనా కల్లోలం..
కరోనా వ్యాప్తి తగ్గడంతో ఐపీఎల్ 15వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. లీగ్ దశలో దాదాపుగా సగం వరకు మ్యాచ్‌లు ఏ కరోనా భయం లేకుండా జరిగాయి. గత ఏడాది బయో బబుల్ 14వ సీజన్లోనూ బయో బబుల్‌లో కొందరు ఆటగాళ్లు కొవిడ్ బారిన పడ్డారు. గత్యంతర లేని పరిస్థితుల్లో ఐపీఎల్ 2021ను మధ్యలోనే ఆపివేశారు. ఆపై దుబాయ్, యూఏఈ, అబుదాబి వేదికలుగా మిగతా సీజన్ మ్యాచ్‌లను బీసీసీఐ నిర్వహించింది. ఐపీఎల్ 2022 మొదలయ్యే నాటికి కరోనా వ్యాప్తి భారత్‌లో దాదాపుగా తగ్గిపోయింది. కానీ అనూహ్యంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. క్రితం రోజుతో పోల్చితే రోజువారీ పాజిటివ్ కేసులు అమాంతం 90 శాతం పెరగడంతో దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ మొదలవుతుందా అనే అనుమానులు వ్యక్తమవుతున్నాయి.