Vedaant Madhavan Wins GOLD Medal In 800m at Danish Open 2022: కోలీవుడ్ హీరో ఆర్ మాధ‌వ‌న్ పుత్రోత్సాహంలో మునిగితేలుతున్నాడు. తమ పిల్లలు చిన్నది సాధించినా తల్లిదండ్రులు గర్వపడతారు. మరెన్నో సాధించాలని ఆకాంక్షిస్తారు. అలాంటిది దేశం తరఫున బరిలోకి దిగి స్వర్ణాన్ని సాధించిన కుమారుడి విజయం పట్ల మాధవన్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. తన కుమారుడు వేదాంత్ మాధవన్ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని స్వర్ణం సాధించి మెడల్ అందుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు నటుడు మాధవన్.


మొన్న రజతం.. నేడు స్వర్ణం..
కోపెన్ హాగ‌న్ లో జ‌రిగిన‌ డానిష్ ఓపెన్ 2022 ((Danish Open 2022)) పోటీల్లో మాధవన్ తనయుడు వేదాంత్ మాధవన్ సత్తా చాటుతున్నాడు. స్విమ్మింగ్ విభాగంలో 1500 మీ ఫ్రీ స్టైల్ ఈవెంట్ లో వేదాంత్ మాధవన్ ఇటీవల రజతం అందుకుని తన తండ్రి మాధవన్‌తో పాటు దేశం గర్వించేలా చేశాడు. ఆదివారం రాత్రి జరిగిన మరో ఈవెంట్లో వేదాంత్ మాధవన్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. డానిష్ ఓపెన్ 800 మీటర్ల స్విమ్మింగ్ విభాగంలో వేదాంత్ విజయం సాధించి స్వర్ణం నెగ్గాడు. వేదాంత్ మాధవన్ 8:17:28 టైమింగ్‌తో బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా.. అలెగ్జాండర్ 8:17:38 టైమింగ్‌తో రజతం, ఫ్రెడరిక్ లింథోల్మ్ 8:19:92 టైమింగ్‌లో 800 మీటర్ల స్విమ్మింగ్ ఈవెంట్‌ పూర్తి చేశి కాంస్య పతకాలను సాధించారు.






అందరికీ ధన్యవాదాలు తెలిపిన మాధవన్.. 
తన కుమారుడు వేదాంత్ ఇటీవల ఇదే పోటీల్లో రజతం సాధించిన సమయంలోనూ నటుడు మాధవన్ పుత్రోత్సాహంతో వీడియో షేర్ చేశారు. డానిష్ ఓపెన్‌లో వేదాంత్ 1500 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించిన తరువాత.. అందులో భాగస్వాములైన అందరికీ మాధవన్ ధన్యవాదాలు తెలిపాడు.



తాజాగా స్వర్ణం సాధించిన అనంతరం సైతం సాధారణ పోస్ట్ చేశాడు మాధవన్. మీ అందరి ఆశీర్వాదం, మద్దతుతో గోల్డ్ మెడల్ సాధించాడు. 800 మీటర్ల స్విమ్మింగ్ విభాగంలో వేదాంత్ స్వర్ణం సాధించాడని తెలిపిన మాధవన్.. కోచ్ ప్రదీప్, స్విమ్మింగ్ ఫెడరేషన్‌కు, అన్సా గ్రూప్‌నకు ధన్యవాదాలు తెలుపుతూ కుమారుడు వేదాంత్ స్వర్ణ పతకాన్ని అందుకున్న వీడియోను షేర్ చేశాడు మాదవన్. 


Also Read: GT Vs CSK, Match Highlights: మిల్లర్, రషీద్, ఓ నోబాల్ - చెన్నైపై గుజరాత్ థ్రిల్లింగ్ విన్!


Also Read: IPL 2022, PBKS vs SRH: మనల్ని ఎవరు ఆపేది - రైజర్స్‌కు వరుసగా నాలుగో విజయం - ఈసారి తొక్కింది పంజాబ్‌ని!