CSK vs RCB, IPL 2022 LIVE: డీకే భయపెట్టినా..! విజయం చెన్నైదే.. 200 మ్యాచును సెలబ్రేట్ చేసుకున్న సీఎస్‌కే
IPL 2022, CSK vs RCB: ఐపీఎల్ 2022లో 22వ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Superkings), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడుతున్నాయి. మరి వీరిలో ఏ జట్టుది ఆధిపత్యం?
డ్వేన్ బ్రావో 12 పరుగులు ఇచ్చాడు. సిరాజ్ (14), హేజిల్‌వుడ్ (7) అజేయంగా నిలిచారు. సీఎస్‌కే 23 తేడాతో మ్యాచ్ గెలిచింది.
జోర్డాన్ 7 పరుగులు ఇచ్చాడు. ఆఖరి బంతికి సిరాజ్ (6) బౌండరీ బాదాడు. హేజిల్ వుడ్ (4) అతడికి తోడుగా ఉన్నాడు.
బ్రావో 5 పరుగులిచ్చి వికెట్ తీశాడు. రెండో బంతికి డీకే (34)ను ఔట్ చేశాడు. సిరాజ్ (1), హేజిల్‌వుడ్ (2) ఆడుతున్నారు.
ముకేశ్ 23 పరుగులు ఇచ్చాడు. డీకే (34) వరుసగా 6,6,4 కొట్టేశాడు. సిరాజ్ (0) అతడికి తోడుగా ఉన్నాడు.
జడ్డూ ఈ ఓవర్లో 6 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. హసరంగ, ఆకాశ్ దీప్‌ను పెవిలియన్ పంపించాడు. సిరాజ్ (౦), డీకే (13) క్రీజులో ఉన్నారు.
తీక్షణ 9 పరుగులు ఇచ్చి షాబాజ్ (41)ను ఔట్ చేశాడు. డీకే (13) ఒక సిక్స్ కొట్టాడు. హసరంగ (1) క్రీజులోకి వచ్చాడు.
తీక్షణ 6 పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. రెండో బంతికి ప్రభుదేశాయ్ (34)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. డీకే (5), షాబాజ్ (28) నిలకడగా ఆడుతున్నారు.
డ్వేన్ బ్రావో 10 పరుగులు ఇచ్చాడు. ప్రభుదేశాయ్ (34), షాబాజ్ (27) ఆచితూచి ఆడారు.
జడేజా 14 పరుగులు ఇచ్చాడు. ప్రభుదేశాయ్ (32) వరుసగా బౌండరీ, సిక్సర్ కొట్టాడు. షాబాజ్ (21) అతడికి అండగా ఉన్నాడు.
జోర్డాన్ 13 పరుగులు ఇచ్చాడు. ప్రభుదేశాయ్ (21) రెండు బౌండరీలు కొట్టాడు. షాబాజ్ (18) నిలకడగా ఆడుతున్నాడు.
మరోసారి జడ్డూ 11 పరుగులు ఇచ్చాడు. ప్రభుదేశాయ్ (11), షాబాజ్ (15) కలిసి 3 బౌండరీలు కొట్టారు.
జడేజా 8 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఐదో బంతికి మాక్స్‌వెల్ (26)ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. సూర్యాశ్ (0), షాబాజ్ (3) క్రీజులో ఉన్నారు.
తీక్షణ 15 పరుగులు ఇచ్చాడు. మాక్సీ (21) రెండు సిక్సర్లు కొట్టాడు. ఆఖరి బంతికి అనుజ్ రావత్ (12) ఔటయ్యాడు.
ముకేశ్ 7 పరుగులిచ్చి విరాట్ కోహ్లీ (1)ను ఔట్ చేశాడు. మాక్స్‌వెల్ (6) ఒక బౌండరీ కొట్టాడు. అనూజ్ (12) ఆచితూచి ఆడుతున్నాడు.
మొయిన్ అలీ 6 పరుగులు ఇచ్చాడు. రెండో బంతిని రావత్ (11) బౌండరీకి పంపించాడు. కోహ్లీ (1) ఆచితూచి ఆడుతున్నాడు.
తీక్షణ 3 పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. ఐదో బంతికి డుప్లెసిస్ (8)ని ఔట్ చేశాడు. కోహ్లీ (0) క్రీజులోకి వచ్చాడు. అనుజ్ (6) మరో ఎండ్‌లో ఉన్నాడు.
ముకేశ్ 10 పరుగులు ఇచ్చాడు. డుప్లెసిస్ (7), అనుజ్ రావత్ (4) ట్రిపుల్స్ తీశారు.
మొయిన్ అలీ 1 పరుగే ఇచ్చాడు. అనుజ్ రావత్ (0), డుప్లెసిస్ (1) నిలకడగా ఆడుతున్నారు.
హేజిల్ వుడ్ 14 పరుగులు ఇచ్చాడు. శివమ్ దూబె (94) రెండు సిక్సర్లు కొట్టాడు. ఎంఎస్ ధోనీ (0) అవతలి ఎండ్‌లో ఉన్నాడు.
హసరంగ 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఉతప్ప (88), దూబె (80) చెరో సిక్స్ కొట్టారు. ఐదో బంతికి ఉతప్ప, ఆరో బంతికి జడ్డూ (౦) ఔటయ్యారు.
ఆకాశ్ 24 పరుగులు ఇచ్చాడు. శివమ్ దూబె (73) వరుసగా 6, 4, 6 కొట్టాడు. ఉతప్ప (82) సెంచరీకి చేరువలో ఉన్నాడు.
సిరాజ్ 18 పరుగులు ఇచ్చాడు. రాబిన్ ఉతప్ప (81) రెండు సిక్సర్లు, ఒక బౌండరీ బాదేశాడు. శివమ్ దూబె (54) నిలకడగా ఆడుతున్నాడు.
హేజిల్‌వుడ్ 12 పరుగులు ఇచ్చాడు. రాబిన్ ఉతప్ప (65) ఒక సూపర్ సిక్స్ కొట్టాడు. దూబె (53) నిలకడగా ఆడాడు.
ఆకాశ్‌దీప్ 15 పరుగులు ఇచ్చాడు. ఉతప్ప (57) ఒక బౌండరీ, ఒక సిక్సర్, శివమ్ దూబె (50) ఒక బౌండరీ కొట్టాడు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలు అందుకున్నారు.
హసరంగ 13 పరుగులు ఇచ్చాడు. శివమ్ దూబె (46) రెండు బౌండరీలు బాదేశాడు. ఉతప్ప (46) దూకుడు పెంచాడు.
మాక్సీ 19 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్లో ఉతప్ప (45) మూడు సిక్సర్లు బాదేశాడు. దూబె (39) నిలకడగా ఆడాడు.
షాబాజ్ అహ్మద్ 13 పరుగులు ఇచ్చాడు. శివమ్ దూబె (38) ఐదో బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఉతప్ప (27) ఆచితూచి ఆడుతున్నాడు.
హసరంగ వచ్చాడు. 13 పరుగులు ఇచ్చాడు. శివమ్ దూబె (28) ఒక బౌండరీ, ఒక సిక్సర్ కొట్టాడు. ఉతప్ప (24) నిలకడగా ఆడుతున్నాడు.
షాబాజ్ అహ్మద్ 5 పరుగులు ఇచ్చాడు. శివమ్ దూబె (16), రాబిన్ ఉతప్ప (23) ఆచితూచి ఆడుతున్నారు.
మాక్స్‌వెల్ 8 పరుగులు ఇచ్చాడు. నాలుగో బంతిని శివమ్ దూబె (13) భారీ సిక్సర్‌గా మలిచాడు. ఉతప్ప (21) నిలకడగా ఆడుతున్నాడు.
ఆకాశ్‌దీప్ 10 పరుగులు ఇచ్చాడు. రాబిన్ ఉతప్ప (20), శివమ్ దూబె (6) చెరో బౌండరీ కొట్టారు.
గ్లెన్ మాక్స్‌వెల్ 2 పరుగులు ఇచ్చాడు. మూడో బంతిని మొయిన్ అలీ (3) ఆడాడు. క్విక్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. కానీ ప్రభుదేశాయ్ బంతిని డైవ్ చేసి అందుకొని వెంటనే డీకే విసిరాడు. దాంతో అతడు రనౌట్ అయ్యాడు. శివమ్ దూబె (1), ఉతప్ప (15) ఆచితూచి ఆడుతున్నారు.
ఆకాశ్‌దీప్ 10 పరుగులు ఇచ్చాడు. ఐదో బంతిని రాబిన్ ఉతప్ప (14) స్ట్రెయిట్‌గా సిక్సర్ కొట్టాడు. మొయిన్ అలీ (3) నిలకడగా ఆడుతున్నాడు.
సిరాజ్ 6 పరుగులు ఇచ్చాడు. ఆఖరి బంతిని రాబిన్ ఉతప్ప (7) బౌండరీకి పంపించాడు. మొయిన్ అలీ (1) ఆచితూచి ఆడుతున్నాడు.
హేజిల్‌వుడ్ 4 పరుగులిచ్చి వికెట్ తీశాడు. తొలి బంతికి బౌండరీ కొట్టిన రుతురాజ్ (17) నాలుగో బంతికి ఎల్బీ అయ్యాడు. మొయిన్ అలీ (0) క్రీజులోకి వచ్చాడు. ఉతప్ప (2) నిలకడగా ఆడుతున్నాడు.
సిరాజ్ 7 పరుగులు ఇచ్చాడు. రెండో బంతిని రుతురాజ్ (13) బౌండరీ బాదాడు. ఉతప్ప (2) అతడికి తోడుగా ఉన్నాడు.
హేజిల్ వుడ్ మరో ఎండ్ నుంచి బౌలింగ్ మొదలు పెట్టాడు. 2 పరుగులు ఇచ్చాడు. ఉతప్ప (2), రుతురాజ్ (6) నిలకడగా ఆడారు.
మహ్మద్ సిరాజ్ బౌలింగ్ ఆరంభించాడు. 6 పరుగులు ఇచ్చాడు. నాలుగో బంతిని రుతురాజ్ గైక్వాడ్ (5) బౌండరీకి పంపించాడు. రాబిన్ ఉతప్ప (1) మరో ఎండ్‌లో ఉన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచింది. వెంట,నే ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. సీఎస్‌కేను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
Background
ఐపీఎల్ 2022లో 22వ మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Superkings), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడుతున్నాయి. డీవై పాటిల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఒకవైపు చెన్నై వరుసగా నాలుగు మ్యాచులు ఓడి ఆత్మవిశ్వాసం కోల్పోయింది. మరోవైపు వరుస విజయాలతో బెంగళూరు దుమ్మురేపుతోంది. మరి వీరిలో ఏ జట్టుది ఆధిపత్యం? తుది జట్టులో ఎవరుంటారు? గెలిచేదెవరు?
డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెట్టిన చెన్నై సూపర్‌కింగ్స్ (CSK)కు ఈ సారి తిరుగులేదనుకున్నారు. కానీ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓడి ఆత్మవిశ్వాసం కోల్పోయింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) పూర్తిగా విఫలమవుతున్నాడు. మధ్య ఓవర్లలో పరుగులు ఎక్కువగా చేయడం లేదు. ఒకరిద్దరు ఆటగాళ్లు ఔటైతే ఒత్తిడికి లోనవుతున్నారు. బౌలింగ్ లోనూ అంతే! దీపక్ చాహర్ (Deepak Chahar) లోటు బాగా తెలుస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్ ఓడిపోయిన ఆర్‌సీబీ (RCB) ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచులు గెలిచి హ్యాట్రిక్ అందుకుంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో దుమ్ము రేపుతోంది. ఆటగాళ్లు కసిగా ఆడుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగులో చెన్నై, బెంగళూరు (CSK vs RCB) మ్యాచులంటే అభిమానులకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే ఎంఎస్ ధోనీ (MD Dhoni), విరాట్ కోహ్లీ (Virat Kohli) ఎదురెదురుగా తలపడేవారు. ఈ రెండు జట్లలో సీఎస్‌కేదే పైచేయి. ఇప్పటి వరకు చెన్నై, బెంగళూరు 28 సార్లు తలపడితే 18సార్లు ధోనీసేనే గెలిచింది. కేవలం 9 సార్లు మాత్రమే బెంగళూరును విజయం వరించింది. చివరగా ఆడిన ఐదు మ్యాచుల్లోనూ చెన్నై 3-2తో ఆధిక్యంలో ఉంది. మానసికంగా సీఎస్‌కేదే ఆధిపత్యం అయినా ఈ సారి జోష్ మాత్రం బెంగళూరులో ఉంది.
CSK vs RCB Probable XI
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్, అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లే, వనిందు హసరంగ, సిద్ధార్థ్ కౌల్, మహ్మద్ సిరాజ్, అకాశ్ దీప్
- - - - - - - - - Advertisement - - - - - - - - -