చెన్నై సూపర్‌కింగ్స్‌ అభిమానులకు శుభవార్త! వచ్చే ఏడాది రీటెన్షన్‌ కార్డు ఉంటే మొదట ఎంఎస్‌ ధోనీనే ఎంచుకుంటామని సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ తెలిపింది. రాబోయే సీజన్‌కు ఆటగాళ్లను అట్టిపెట్టుకొనే అవకాశం ఉంటుందని ధీమా వ్యక్తం చేసింది. అయితే ఎంతమందికి అవకాశం ఇస్తారో తెలియదని పేర్కొంది.


Also Read: టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఇదే.. ఈ ఐపీఎల్‌లో ఎంతమంది హిట్ అయ్యారో తెలుసా?


'వచ్చే సీజన్లో రీటెన్షన్‌ కచ్చితంగా ఉంటుంది. ఎంత మందిని రీటెయిన్‌ చేసుకొనేందుకు అవకాశం ఇస్తారో మాత్రం తెలియదు. నిజాయితీగా చెప్పే మాట ఒక్కటే. మాకు ఎంఎస్‌ ధోనీయే ముఖ్యం. మొదటి కార్డు అతడి కోసమే ఉపయోగిస్తాం. ముందు మా నౌకకు కావాల్సింది కెప్టెనే. వచ్చే ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటానని ధోనీ మాటిచ్చాడు' అని సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌లో ఒకరు చెప్పారు.


Also Read: ధోనీసేనకు అభినందనలు చెప్పినట్టే చెప్పి.. పంచ్ వేసిన గౌతమ్‌ గంభీర్‌


ఐపీఎల్‌ 2021 విజేతగా చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. జట్టులో కొన్ని ఇబ్బందులున్నా ధోనీ వాటిని అధిగమించి చెన్నైకి నాలుగో ట్రోఫీ అందించాడు. వ్యక్తిగతంగా మరిన్ని పరుగులు చేయనప్పటికీ నాయకుడిగా మాత్రం తనకు తిరుగులేదని చాటిచెప్పాడు. కాగా అతడు వచ్చే ఏడాది ఆడతాడో లేదోనన్న సందేహం చాలా మందిలో ఉంది. అయితే మహీ వచ్చే సీజన్‌ ఆడతాడని సీఎస్‌కే బృందం చెబుతోంది. ట్రోఫీ గెలిచాక ధోనీ సైతం ఇదే విషయం చెప్పాడు.


Also Read: ఈ సీజన్ లో అసలైన విజేత కోల్ కతా... ఐపీఎల్ సెకండ్ పార్ట్ లో ఆ జట్టు గొప్పగా ఆడింది... సీఎస్కే కెప్టెన్ ధోనీ కామెంట్స్


Also Read: ఎందుకు 'డాడీస్‌ ఆర్మీ'నే గెలుస్తుంది? ఏంటీ వీళ్ల గొప్ప? ధోనీ ఒక్కడుంటే చాలా?


చెన్నై సూపర్‌కింగ్స్‌ భవిష్యత్తు రోడ్‌మ్యాప్‌ గురించి మహీ మాట్లాడాడు, 'నేను ముందే చెప్పాను. మొత్తం బీసీసీఐపై ఆధారపడి ఉంటుంది. రెండు కొత్త జట్లు రాబోతున్నాయి కాబట్టి చెన్నైకి ఏది మంచిదో మేం నిర్ణయించుకోవాలి. నేను టాప్‌-3 లేదా టాప్‌-4లో ఉండటం ముఖ్యం కాదు. ఫ్రాంచైజీకి ఇబ్బంది లేకుండా పటిష్ఠమైన కోర్‌గ్రూప్‌ను ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. కనీసం పదేళ్లు మెరుగ్గా ఆడగలిగేవారు కోర్‌ గ్రూప్‌లో ఉంటారు' అని ధోనీ వెల్లడించాడు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి