ఐపీఎల్‌లో ఈరోజు సాయంత్రం ఏడున్నరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. షార్జాలో ఈ మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో పంజాబ్ ఏడో స్థానంలోనూ, హైదరాబాద్‌లోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో కూడా ఓడిపోతే హైదరాబాద్ అధికారికంగా ఇంటిబాట పట్టినట్లే. ఇక టోర్నీలో ముందుకెళ్లే అవకాశాలు మెరుగుపరుచుకోవాలంటే పంజాబ్ కూడా గెలిచి తీరాల్సిందే.


రెండు జట్లకీ కీలకమే..


పంజాబ్ తన గత చివరి రెండు మ్యాచ్‌లూ ఓడిపోగా, సన్‌రైజర్స్ మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. గత మ్యాచ్‌ల్లో రాజస్తాన్‌పై 12 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన దశలో కూడా ఓడిపోవడం పంజాబ్ ఆత్మవిశ్వాసాన్ని కచ్చితంగా దెబ్బ తీసేదే. సన్‌‌రైజర్స్ కూడా ఢిల్లీ చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో ప్రెజర్‌లో పడింది.


పంజాబ్‌లో ఓపెనర్లు తప్ప ఎవరూ సరిగా ఆడటం లేదు. గత మ్యాచ్‌లో దూరమైన గేల్ ఈ మ్యాచ్‌లో వస్తాడేమో చూడాలి. పంజాబ్ గెలవాలంటే కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, గేల్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించడంతో పాటు, మహమ్మద్ షమీ, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిల్ రషీద్ బంతుల్లో పదును చూపించాల్సిందే.


Also Read: యువీ.. గౌతీ తోడుగా ధోనీసేన అద్భుతం చేయగా! టీ20 ప్రపంచకప్‌ గెలిచి 13 ఏళ్లు


ఇక సన్‌రైజర్స్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. గత మ్యాచ్‌లో వార్నర్, విలియమ్సన్ సహా టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయింది. బెంచ్ ‌మీదున్న ఇంగ్లండ్ ఓపెనర్ రాయ్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం దొరుకుతుందేమో చూడాలి. సన్‌రైజర్స్ మిడిలార్డర్ టచ్‌లో లేదు కాబట్టి.. టాప్ ఆర్డర్‌లో డేవిడ్ వార్నర్, సాహా, కేన్ విలియమ్సన్ రాణించాల్సిందే. బౌలర్లలో భువనేశ్వర్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, రషీద్ ఖాన్ ఎలాగో మెరుపులు మెరిపిస్తున్నారు. 


ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు జరగ్గా 12 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ గెలవగా, పంజాబ్ కేవలం ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిచి హైదరాబాద్‌ను ఇంటికి పంపుతుందా.. లేక హైదరాబాద్ గెలిచి పంజాబ్‌ను మరింత కష్టాల్లోకి నెడుతుందా.. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.


తుదిజట్లు(అంచనా)
సన్‌రైజర్స్ హైదరాబాద్: కేఎల్ రాహుల్(కెప్టెన్, వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, ఆదిల్ రషీద్, హర్‌ప్రీత్ బ్రార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ పోరెల్


పంజాబ్ కింగ్స్: డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), కేదార్ జాదవ్, జేసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్


Also Read: అర్థం లేకుండా కోహ్లీ ఆట.. చెన్నైపై ఓడితే కెప్టెన్సీ నుంచి తీసేయనున్న ఆర్‌సీబీ!


Also Read: నటరాజన్‌ స్థానంలో మరొకరిని తీసుకున్న సన్‌రైజర్స్‌.. ఎవరో తెలుసా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి