బేసన్ లడ్డూని హాట్ డ్రింకులా తాగితే ఎలా ఉంటుంది? అదెలా అనుకుంటున్నారా? చెఫ్ సరాంశ్ మీకు లిక్విడ్ లడ్డూని ఎలా చేసుకోవాలో చెబుతున్నారు. మీరు ఇంతవరకు లడ్డూని ద్రవ రూపంలో ఉండడం చూసుండరు. దాన్ని కనిపెట్టింది సరాంశ నాన్నమ్మ. ఆమె రెసిపీని అందరితో పంచుకున్నాడాయన. ఈ లిక్విడ్ లడ్డూ కేవలం రుచి కోసమే అనుకోకండి, వర్షం పడుతున్న వేళ వేడివేడిగా తాగితే ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉంటుందని అంటున్నాడు ఈ చెఫ్. చల్లని వాతావరణంలో శరీరానికి వెచ్చదనాన్ని అందింస్తుందని , జలుబుగా ఉన్నప్పుడు ఉపశమనంగా కలిగిస్తుందని చెబుతున్నాడు. ముఖ్యంగా పిల్లలకు చాలా బాగా నచ్చుతుందట. మరి ఇంకేం ఆయన ఇన్ స్టాలో వీడియోను ఇక్కడ పోస్టు చేశాం. దాన్ని చూసి మీరు కూడా లిక్విడ్ లడ్డూని సులువుగా చేసుకోవచ్చు. 


చెఫ్ చెప్పిన ప్రకారం లిక్విడ్ లడ్డూ తయారీ ఇలా...
1. కళాయిలో రెండు స్పూనుల నెయ్యి వేసుకోవాలి. 
2. అది కరిగాక నాలుగు స్పూనుల శెనగపిండి వేసి బాగా కలపాలి. పదినిమిషాల పాటూ చిన్న మంట మీద ఉంచి కలపాలి.
3.రెండు గ్లాసుల నీటిని వీడియోలో చూపించినట్టు మూడు సార్లు కొంచెం కొంచెంగా చేర్చాలి. 
4. శెనగపిండి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. 
5. మిశ్రమంగా కాస్త చిక్కగా మారినప్పుడు అర స్పూను పసుపు, అరస్పూను మిరియాల పొడి, యాలకుల పొడి చిటికెడు, బెల్లం పొడి మూడు టీస్పూనులు వేసి బాగా మిక్స్ చేయాలి. 
6.చిన్న మంట మీద రెండు నిమిషాల పాటూ ఉంచాలి. కలపడం మాత్రం ఆపకూడదు. 
7. స్టవ్ కట్టేసి దాన్ని గ్లాసులోకి తీసుకుని పైన బాదం, పిస్తా పొడిని చల్లుకుని తినాలి. కాస్త వేడిగా ఉన్నప్పుడు తింటే మంచిది. టేస్టీగా కూడా ఉంటుంది. 


సరాంశ్ నేపథ్యం...
సరాంశ్.. ఢిల్లీకి చెందిన ప్రముఖ చెఫ్. ప్రముఖ ఫుడ్ కాంపిటీషన్ల విజేత. ముంబైలో ఈయనకు పెద్ద రెస్టారెంట్ కూడా ఉంది. పలు ఫుడ్ రియాల్టీషోలకు జడ్జిగా కూడా వ్యవహరించారు. మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా కార్యక్రమానికి కూడా ఈయన న్యాయనిర్ణేతగా చేశారు. పాతికేళ్లకే మనదేశంలో ప్రముఖ చెఫ్ లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇన్ స్టా, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖాతాలలో ఆయనకు లక్షల మంది ఫాలోవర్లున్నారు. 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి


Also read: జపాన్ వారి సోబా నూడిల్స్ ట్రై చేశారా... ఎంత రుచో, అంత ఆరోగ్యం కూడా


Also read: పుట్టగొడుగులు శాకాహారమా? మాంసాహారమా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?


Also read: లగ్జరీ ద్రాక్ష.. ఒక్క పండు తినాలంటే రూ.35,000 ఖర్చుపెట్టాలి