సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మార్పులు జరిగాయి. టి.నటరాజన్ స్థానంలో మరొకరితో ఆ ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకొంది. జమ్ము కశ్మీర్‌కు చెందిన మీడియం పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను స్వల్పకాల కొవిడ్-19 ప్రత్యామ్నాయంగా ఎంచుకుంది.
మాలిక్ ఇప్పటి వరకు జమ్ము కశ్మీర్ తరఫున ఒకే ఒక్క టీ20, లిస్ట్-ఏ మ్యాచ్ ఆడాడు. మొత్తం నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అతడు చాలాకాలంగా సన్‌రైజర్స్‌కు నెట్‌బౌలర్‌గా పనిచేస్తున్నాడు.
Also Read: నేడు బెంగళూరుతో చెన్నై ఢీ.. హాట్ ఫేవరెట్ ఎవరంటే?
ఐపీఎల్ నిబంధన 6.1 (c) ప్రకారం ప్రధాన జట్టు సభ్యుడు తిరిగి బయో బుడగలోకి అడుగుపెట్టేంత వరకు మరొకరితో స్వల్పకాల ఒప్పందం చేసుకోవచ్చు. అంటే నటరాజన్ కోలుకొని తిరిగొచ్చేంత వరకే మాలిక్ జట్టులో ఉంటాడు.
Also Read: యువీ.. గౌతీ తోడుగా ధోనీసేన అద్భుతం చేయగా! టీ20 ప్రపంచకప్ గెలిచి 13 ఏళ్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ బుధవారం దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. అయితే మ్యాచుకు ముందు హైదరాబాద్ కీలక బౌలర్ నటరాజన్ కరోనా బారిన పడ్డాడు. దుబాయ్‌కు చేరుకొని, బయో బుడగలో ఉన్నాకా అతడికి కొవిడ్ రావడంతో అందరూ కంగారు పడ్డారు. వెంటనే నటరాజన్‌తో పాటు అతనితో సన్నిహితంగా మెలిగిన ఆరుగురిని ఐసోలేషన్‌కు పంపారు.
Also Read: కోల్‌కతా ‘తగ్గేదేలే’.. ఏడు వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసిన నైట్‌రైడర్స్!
మిగతా వారందరికీ ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించగా.. వారందరికీ నెగిటివ్ రావడంతో మ్యాచ్‌ను యథాతథంగా నిర్వహించారు. సన్‌రైజర్స్ ప్లేయర్ విజయ్ శంకర్, టీం మేనేజర్ విజయ్ కుమార్, ఫిజియోథెరపిస్ట్ శ్యాం సుందర్ జే, డాక్టర్ అంజనా వణ్ణన్, లాజిస్టిక్స్ మేనేజర్ తుషార్ ఖేడ్కర్, నెట్ బౌలర్ పెరియసామి గణేషన్‌లు నటరాజన్‌తో కాంటాక్ట్‌లో ఉండటంతో వారిని కూడా ఐసోలేషన్‌లో ఉంచారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి