ఐపీఎల్‌లో నేడు మరో ఇంట్రస్టింగ్ మ్యాచ్ జరగనుంది. ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ , కోహ్లీ సేన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. యూఏఈలో ఈ రెండు జట్లూ ఇప్పటికే ఒక్కో మ్యాచ్ ఆడాయి. ముంబై ఇండియన్స్‌పై విజయంతో చెన్నై ఆత్మవిశ్వాసంతో ఉండగా, కోల్‌కతా చేతిలో ఘోర పరాజయం పాలైన బెంగళూరు ఒత్తిడిలో ఉంది. చెన్నై ఈ మ్యాచ్‌లో గెలిస్తే మళ్లీ టేబుల్ టాప్‌కు వెళ్లనుంది.


Watch Video:  ధోనీ నా కెప్టెన్‌! మరి సీఎస్‌కేతో మ్యాచులో కోహ్లీసేన వ్యూహాలేంటి?


చెన్నై మరింత బలంగా..
చెన్నై జట్టు ఇప్పటికే సమతూకంగా కనిపిస్తుంది. ముంబై లాంటి బలమైన జట్టు మీద పవర్‌ప్లేలో 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినా.. 158 పరుగులు చేయగలిగిందంటే.. జట్టు బ్యాటింగ్ ఆర్డర్ లోతెంతో అర్థం చేసుకోవచ్చు. రుతురాజ్ గైక్వాడ్ తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. తనకు టాప్ ఆర్డర్‌లో ఒక్కరు సహకారం అందించినా.. చెన్నై భారీ స్కోరు చేయడం ఖాయం. ఫాఫ్ డుఫ్లెసిస్, సురేష్ రైనా, అంబటి రాయుడు, మొయిన్ అలీ, ధోని, రవీంద్ర జడేజా.. ఇలా టీం నిండా హిట్టర్లే ఉన్నారు. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌లకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉంది.


బౌలింగ్‌లో కూడా చెన్నై బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేస్తూనే ఉన్నారు. మధ్య ఓవర్లలో మొయిన్ అలీ, రవీంద్ర జడేజా ప్రభావం చూపిస్తున్నారు. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, శామ్ కరన్‌లు మొదటి, చివరి ఓవర్లలో ఆ బాధ్యత తీసుకుంటున్నారు. ఈ మ్యాచ్‌కు కరన్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే గత మ్యాచ్‌లో బ్రేవో బంతితో, బ్యాట్‌తో రాణించడంతో ఈ మ్యాచ్‌లో ఎవరు ఆడనున్నారనేది ఆసక్తికరంగా మారింది.


Also Read:  కోహ్లీసేనే కాదు.. కివీస్‌, ఇంగ్లాండ్‌ కూడా మా శత్రువులే: రమీజ్‌ రాజా


బెంగళూరు జాగ్రత్త పడాల్సిందే..
దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, మ్యాక్స్‌వెల్.. పేపర్ మీద చూడటానికి పేర్లు భయంకరంగా ఉన్నా.. అది ఆటలోకి ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం లేదు. దేవ్‌దత్ పడిక్కల్ మినహా మిగతా ముగ్గురూ విఫలం కావడం జట్టుపై గత మ్యాచ్‌లో తీవ్రప్రభావం చూపింది. తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్ గత మ్యాచ్‌లో వన్‌డౌన్‌లోనే బ్యాటింగ్‌కు వచ్చినా.. క్రీజులో నిలబడ్డాడు తప్ప పరుగులు చేయలేకపోయాడు.


ఇక బౌలింగ్‌లో హర్షల్ పటేల్, కైల్ జేమీసన్, చాహల్, సిరాజ్ ఉన్నారు. హర్షల్ పటేల్ వికెట్లు తీస్తున్నా.. పరుగులు ఆపలేకపోతున్నాడు. ఈ రెండు జట్ల మధ్య గతంలో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ వేసిన ఒకే ఓవర్లో రవీంద్ర జడేజా 37 పరుగులు చేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.


Also Read: రిషభ్‌ పంత్‌.. ఆధునిక క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్‌! సందేహం లేదన్న మంజ్రేకర్‌


తుదిజట్లు(అంచనా)
చెన్నై సూపర్ కింగ్స్: ఫాఫ్ డుఫ్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో/శామ్ కరన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హజిల్‌వుడ్


రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, వనిందు హసరంగ, సచిన్ బేబీ, కైల్ జేమీసన్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, యజ్వేంద్ర చాహల్


Also Read: అఫ్గాన్‌ క్రికెట్‌పై పిడుగు! ఐసీసీ జట్టును బహిష్కరించే ప్రమాదం!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి