SRH vs PBKS Live Updates: 20 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 120-7, ఐదు పరుగులతో పంజాబ్ గెలుపు
IPL 2021, Sunrisers Hyderabad vs Punjab Kings: పంజాబ్ సన్‌రైజర్స్‌పై ఐదు పరుగుల తేడాతో ఓడించింది.
నాథన్ ఎల్లిస్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 20 ఓవర్లలో హైదరాబాద్ ఏడు వికెట్లు నష్టపోయి 120 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో పంజాబ్ ఐదు పరుగులతో విజయం సాధించింది.
భువనేశ్వర్ 3(4)
జేసన్ హోల్డర్ 47(29)
నాథన్ ఎల్లిస్ 4-0-32-0
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 109-7గా ఉంది. లక్ష్యం 6 బంతుల్లో 17 పరుగులు.
భువనేశ్వర్ 3(3)
జేసన్ హోల్డర్ 38(24)
అర్ష్‌దీప్ సింగ్ 4-0-22-1
అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రషీద్ తనకే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
రషీద్ ఖాన్ (సి అండ్ బి) అర్ష్‌దీప్ సింగ్ (3: 4 బంతుల్లో)
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 105-6గా ఉంది. లక్ష్యం 12 బంతుల్లో 21 పరుగులు.
రషీద్ ఖాన్ 3(3)
జేసన్ హోల్డర్ 37(22)
మహ్మద్ షమీ 4-1-14-2
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 96-6గా ఉంది. లక్ష్యం 18 బంతుల్లో 30 పరుగులు.
రషీద్ ఖాన్ 1(1)
జేసన్ హోల్డర్ 30(18)
అర్ష్‌దీప్ సింగ్ 3-0-18-0
జేసన్ హోల్డర్‌తో సమన్వయ లోపం కారణంగా సాహా రనౌట్ అయ్యాడు.
సాహా రనౌట్(అర్ష్‌దీప్ సింగ్/రవి బిష్ణోయ్) (31: 37 బంతుల్లో, 1 ఫోర్)
నాథన్ ఎల్లిస్ వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో హోల్డర్ రెండు సిక్సర్లు కొట్టాడు. 16 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 91-5గా ఉంది. లక్ష్యం 24 బంతుల్లో 35 పరుగులు.
వృద్ధిమాన్ సాహా 30(36)
జేసన్ హోల్డర్ 27(4)
నాథన్ ఎల్లిస్ 3-0-22-0
రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 75-5గా ఉంది. లక్ష్యం 30 బంతుల్లో 51 పరుగులు.
వృద్ధిమాన్ సాహా 29(35)
జేసన్ హోల్డర్ 12(9)
రవి బిష్ణోయ్ 4-0-24-3
హర్‌ప్రీత్ బ్రార్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 64-5గా ఉంది. లక్ష్యం 36 బంతుల్లో 62 పరుగులు.
వృద్ధిమాన్ సాహా 28(34)
జేసన్ హోల్డర్ 2(4)
హర్‌ప్రీత్ బ్రార్ 4-0-25-0
రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. కేదార్ జాదవ్, సమద్ అవుటయ్యారు. 13 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 60-5గా ఉంది. లక్ష్యం 42 బంతుల్లో 66 పరుగులు.
వృద్ధిమాన్ సాహా 26(32)
జేసన్ హోల్డర్ 0(0)
రవి బిష్ణోయ్ 3-0-13-2
కేదార్ జాదవ్‌ను అవుట్ చేసి బిష్ణోయ్ పంజాబ్‌కు నాలుగో వికెట్ అందించాడు.
కేదార్ జాదవ్ (బి) రవి బిష్ణోయ్ (12: 12 బంతుల్లో)
హర్‌ప్రీత్ బ్రార్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 56-3గా ఉంది. లక్ష్యం 48 బంతుల్లో 70 పరుగులు.
వృద్ధిమాన్ సాహా 25(30)
కేదార్ జాదవ్ 12(10)
హర్‌ప్రీత్ బ్రార్ 3-0-21-0
రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 47-3గా ఉంది. లక్ష్యం 54 బంతుల్లో 79 పరుగులు.
వృద్ధిమాన్ సాహా 21(27)
కేదార్ జాదవ్ 7(7)
రవి బిష్ణోయ్ 2-0-11-1
నాథన్ ఎల్లిస్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 43-3గా ఉంది. లక్ష్యం 60 బంతుల్లో 83 పరుగులు.
వృద్ధిమాన్ సాహా 20(23)
కేదార్ జాదవ్ 5(5)
నాథన్ ఎల్లిస్ 2-0-6-0
హర్ ప్రీత్ బ్రార్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. 9 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 39-3గా ఉంది. లక్ష్యం 66 బంతుల్లో 87 పరుగులు.
వృద్ధిమాన్ సాహా 18(19)
కేదార్ జాదవ్ 3(3)
హర్ ప్రీత్ బ్రార్ 2-0-12-0
రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. మనీష్ పాండే అవుటయ్యాడు. 8 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 32-3గా ఉంది. లక్ష్యం 72 బంతుల్లో 94 పరుగులు.
వృద్ధిమాన్ సాహా 14(16)
రవి బిష్ణోయ్ 1-0-5-0
మనీష్ పాండే (బి) రవి బిష్ణోయ్ (13: 23 బంతుల్లో, ఒక ఫోర్)
హర్‌ప్రీత్ బ్రార్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 25-2గా ఉంది. లక్ష్యం 78 బంతుల్లో 101 పరుగులు.
మనీష్ పాండే 8(19)
వృద్ధిమాన్ సాహా 12(14)
హర్‌ప్రీత్ బ్రార్ 1-0-5-0
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 20-2గా ఉంది. లక్ష్యం 84 బంతుల్లో 106 పరుగులు.
మనీష్ పాండే 6(14)
వృద్ధిమాన్ సాహా 11(13)
అర్ష్‌దీప్ సింగ్ 2-0-13-0
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. ఐదో ఓవర్ ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 15-2గా ఉంది. లక్ష్యం 90 బంతుల్లో 111 పరుగులు.
మనీష్ పాండే 4(11)
వృద్ధిమాన్ సాహా 8(11)
మహ్మద్ షమీ 3-1-5-2
నాథన్ ఎల్లిస్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. నాలుగో ఓవర్ ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 13-2గా ఉంది. లక్ష్యం 96 బంతుల్లో 113 పరుగులు.
మనీష్ పాండే 1(7)
వృద్ధిమాన్ సాహా 8(8)
నాథన్ ఎల్లిస్ 1-0-2-0
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు కూడా రాలేదు. విలియమ్సన్ అవుటయ్యాడు. మూడో ఓవర్ ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 10-2గా ఉంది. లక్ష్యం 102 బంతుల్లో 116 పరుగులు.
మనీష్ పాండే 0(4)
వృద్ధిమాన్ సాహా 7(5)
మహ్మద్ షమీ 2-1-2-2
కెప్టెన్, కీలక బ్యాట్స్‌మన్ విలియమ్సన్‌ను బౌల్డ్ చేసి షమీ పంజాబ్‌కు మరో వికెట్‌ను అందించాడు.
కేన్ విలియమ్సన్ (బి) మహ్మద్ షమీ (1: 6 బంతుల్లో)
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. రెండో ఓవర్ ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 10-1గా ఉంది. లక్ష్యం 108 బంతుల్లో 116 పరుగులు.
కేన్ విలియమ్సన్ 1(4)
వృద్ధిమాన్ సాహా 7(5)
అర్ష్‌దీప్ సింగ్ 1-0-8-0
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 2-1గా ఉంది. లక్ష్యం 114 బంతుల్లో 124 పరుగులు.
కేన్ విలియమ్సన్ 0(3)
వృద్ధిమాన్ సాహా 0(0)
మహ్మద్ షమీ 1-0-2-1
సన్‌రైజర్స్‌కు పెద్ద షాక్. డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ మూడో బంతికే అవుటయ్యాడు.
డేవిడ్ వార్నర్ (సి) కేఎల్ రాహుల్ (బి) మహ్మద్ షమీ (2: 3 బంతుల్లో)
భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 20 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 125-7గా ఉంది.
షమి 0(0)
హర్ ప్రీత్ బ్రార్ 18(18)
భువనేశ్వర్ 4-0-34-1
జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 111-6గా ఉంది.
నాథన్ ఎల్లిస్ 6(9)
హర్ ప్రీత్ బ్రార్ 12(15)
జేసన్ హోల్డర్ 4-0-19-3
భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 104-6గా ఉంది.
నాథన్ ఎల్లిస్ 4(7)
హర్ ప్రీత్ బ్రార్ 8(11)
భువనేశ్వర్ 3-0-21-0
రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 100-6గా ఉంది.
నాథన్ ఎల్లిస్ 2(3)
హర్ ప్రీత్ బ్రార్ 6(9)
రషీద్ ఖాన్ 4-0-17-1
జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. దీపక్ హుడా అవుటయ్యాడు. 16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 97-6గా ఉంది.
నాథన్ ఎల్లిస్ 1(2)
హర్ ప్రీత్ బ్రార్ 4(4)
జేసన్ హోల్డర్ 3-0-12-3
హోల్డర్ ఓవర్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ సుచిత్ అద్భుతమైన క్యాచ్‌తో హుడాను వెనక్కి పంపాడు.
దీపక్ హుడా (సి) సుచిత్ (బి) జేసన్ హోల్డర్ (13: 10 బంతుల్లో, ఒక ఫోర్)
అబ్దుల్ సమద్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. మార్క్రమ్ అవుటయ్యాడు 15 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 93-5గా ఉంది.
దీపక్ హుడా 13(9)
హర్ ప్రీత్ బ్రార్ 1(1)
అబ్దుల్ సమద్ 1-0-9-1
అబ్దుల్ సమద్ బౌలింగ్‌లో మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ అవుటయ్యాడు.
మార్క్రమ్ (సి) మనీష్ పాండే (బి) అబ్దుల్ సమద్ (27: 32 బంతుల్లో, 2 ఫోర్లు)
ఖలీల్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 84-4గా ఉంది.
దీపక్ హుడా 6(6)
ఎయిడెన్ మార్క్రం 26(30)
ఖలీల్ అహ్మద్ 3-0-22-0
రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 74-4గా ఉంది.
దీపక్ హుడా 4(4)
ఎయిడెన్ మార్క్రం 19(26)
రషీద్ ఖాన్ 3-0-14-1
సందీప్ శర్మ వేసిన ఈ ఓవర్లో పది పరుగులు వచ్చాయి. దీంతోపాటు నికోలస్ పూరన్ కూడా అవుటయ్యాడు. 12 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 68-4గా ఉంది.
దీపక్ హుడా 1(1)
ఎయిడెన్ మార్క్రం 17(23)
సందీప్ శర్మ 4-0-20-1
సందీప్ శర్మ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పూరన్ అవుటయ్యాడు.
నికోలస్ పూరన్ (సి అండ్ బి) నికోలస్ పూరన్ (8: 4 బంతుల్లో, ఒక సిక్సర్)
రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతోపాటు క్రిస్ గేల్ కూడా అవుటయ్యాడు. 11 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 58-3గా ఉంది.
నికోలస్ పూరన్ 1(1)
ఎయిడెన్ మార్క్రం 15(21)
రషీద్ ఖాన్ 2-0-9-1
రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్రిస్ గేల్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు.
క్రిస్ గేల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్ ఖాన్ 14(16 బంతుల్లో, ఒక ఫోర్)
ఖలీల్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 55-2గా ఉంది.
క్రిస్ గేల్ 13(14)
ఎయిడెన్ మార్క్రం 14(19)
ఖలీల్ అహ్మద్ 2-0-13-0
రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. 9 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 45-2గా ఉంది.
క్రిస్ గేల్ 6(10)
ఎయిడెన్ మార్క్రం 12(17)
రషీద్ ఖాన్ 1-0-6-0
జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 39-2గా ఉంది.
క్రిస్ గేల్ 5(9)
ఎయిడెన్ మార్క్రం 7(12)
జేసన్ హోల్డర్ 2-0-8-2
ఖలీల్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 32-2గా ఉంది.
క్రిస్ గేల్ 1(6)
ఎయిడెన్ మార్క్రం 4(9)
ఖలీల్ అహ్మద్ 1-0-3-0
సందీప్ శర్మ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 29-2గా ఉంది.
క్రిస్ గేల్ 1(4)
ఎయిడెన్ మార్క్రం 1(5)
సందీప్ శర్మ 3-0-10-0
జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చాయి. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఇద్దరినీ ఒకే ఓవర్లో అవుట్ చేసి రైజర్స్‌కు అదిరిపోయే స్టార్ట్ అందించాడు. ఐదు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 27-2గా ఉంది.
క్రిస్ గేల్ 1(2)
ఎయిడెన్ మార్క్రం 0(1)
జేసన్ హోల్డర్ 1-0-1-2
జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి మయాంక్ అగర్వాల్ వెనుదిరిగాడు. ఈ ఓవర్లో ఇది రెండో వికెట్.
మయాంక్ అగర్వాల్ (సి) కేన్ విలియమ్సన్ (బి) హోల్డర్ 5(6 బంతుల్లో)
జేసన్ హోల్డర్ వచ్చీ రాగానే మొదటి బంతికే కేఎల్ రాహుల్‌ను అవుట్ చేశాడు.
కేఎల్ రాహుల్ (సి) సుచిత్(సబ్) (బి) హోల్డర్ (21: 21 బంతుల్లో, మూడు ఫోర్లు)
భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 26-0గా ఉంది.
కేఎల్ రాహుల్ 21(20)
మయాంక్ అగర్వాల్ 5(4)
భువనేశ్వర్ 2-0-17-0
సందీప్ శర్మ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 19-0గా ఉంది.
కేఎల్ రాహుల్ 14(14)
మయాంక్ అగర్వాల్ 5(4)
సందీప్ శర్మ 2-0-9-0
రెండో ఓవర్ బాధ్యతను భువనేశ్వర్ అందుకున్నాడు. ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 13-0గా ఉంది.
కేఎల్ రాహుల్ 9(9)
మయాంక్ అగర్వాల్ 3(3)
భువనేశ్వర్ 1-0-10-0
సన్‌రైజర్స్ తరఫున మొదటి ఓవర్‌ను సందీప్ శర్మ వేశాడు. ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి పంజాబ్ స్కోరు 3-0గా ఉంది.
కేఎల్ రాహుల్ 2(4)
మయాంక్ అగర్వాల్ 1(2)
సందీప్ శర్మ 1-0-3-0
కేఎల్ రాహుల్(కెప్టెన్, వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, హర్‌ప్రీత్ బ్రార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్
డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), కేదార్ జాదవ్, జేసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్
సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
Background
ఐపీఎల్‌లో నేడు రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. షార్జాలో ఈ మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో పంజాబ్ ఏడో స్థానంలోనూ, హైదరాబాద్‌లోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో కూడా ఓడిపోతే హైదరాబాద్ అధికారికంగా ఇంటిబాట పట్టినట్లే.
పంజాబ్ తన గత చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ, సన్‌రైజర్స్ మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. గత మ్యాచ్‌ల్లో రాజస్తాన్‌పై 12 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన దశలో కూడా ఓడిపోవడం పంజాబ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేదే. సన్‌రైజర్స్ కూడా ఢిల్లీ చేతిలో ఓడిపోయి ఒత్తిడిలో ఉంది.
పంజాబ్‌లో ఓపెనర్లు తప్ప ఎవరూ రాణించడం లేదు. పంజాబ్ గెలవాలంటే కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, గేల్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించడంతో పాటు, మహమ్మద్ షమీ, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిల్ రషీద్ బౌలింగ్ గట్టిగా వేయాల్సిందే.
సన్‌రైజర్స్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. గత మ్యాచ్‌లో వార్నర్, విలియమ్సన్ సహా టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయింది. బెంచ్ మీదున్న ఇంగ్లండ్ ఓపెనర్ రాయ్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం దొరుకుతుందేమో చూడాలి. సన్‌రైజర్స్ మిడిలార్డర్ టచ్‌లో లేదు కాబట్టి.. టాప్ ఆర్డర్‌లో డేవిడ్ వార్నర్, సాహా, కేన్ విలియమ్సన్ రాణించాల్సిందే. బౌలర్లలో భువనేశ్వర్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, రషీద్ ఖాన్ ఎలాగో మెరుపులు మెరిపిస్తున్నారు. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు జరగ్గా 12 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ గెలవగా, పంజాబ్ కేవలం ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -