RCB vs SRH Live Updates:సన్‌రైజర్స్‌దే విజయం: 20 ఓవర్లకు బెంగళూరు 137-6
షార్జా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. వరుసగా ఆఖరి రెండు మ్యాచులు గెలిచి టాప్-2లో నిలవాలని ఆర్‌సీబీ పట్టుదలగా ఉంది. ఈ పోరులో విజయం కోసం ప్రయత్నిస్తోంది.
భువీ అద్భుతం చేశాడు. 13 పరుగులను కాపాడాడు. కేవలం ఎనిమిది పరుగులే ఇచ్చాడు. ఏబీడీ (19) ఒక సిక్సర్ బాదాడు. గార్టన్ (3) అజేయంగా నిలిచాడు. హైదరాబాద్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.
హోల్డర్ కేవలం ఐదు పరుగులు ఇచ్చి షాబాజ్ (14)ను ఔట్ చేశాడు. ఏబీడీ (12), గార్టన్ (1) క్రీజులో ఉన్నారు. ఆర్‌సీబీకి 6 బంతుల్లో 13 పరుగులు అవసరం.
మాలిక్ 11 పరుగులు ఇచ్చాడు. షాబాజ్ (10) రెండు బౌండరీలు బాది ఒత్తిడి తగ్గించాడు. ఏబీడీ (12) అతడికి అండగా నిలిచాడు. ఆ జట్టుకు 18 పరుగులు అవసరం.
రషీద్ వికెట్ తీసి తొమ్మిదే పరుగులు ఇచ్చాడు. పడిక్కల్ (41) ఔటయ్యాడు. ఏబీ (11) ఆఖరి బంతిని బౌండరీకి పంపించాడు.
సిద్ధార్థ్ 6 పరుగులు ఇచ్చాడు. బెంగళూరుపై ఒత్తిడి పెరుగుతోంది. ఏబీడీ (5), పడిక్కల్ (38) ఆచితూచి ఆడుతున్నారు. బౌండరీలు రావడం లేదు.
ఈ ఓవర్లో రషీద్ కేవలం ఆరు పరుగులు ఇచ్చాడు. అద్భుతంగా ఆడుతున్న మాక్స్‌వెల్ ( 40 ; 25b 3x4 2x6) సమన్వయ లోపంతో రనౌట్ అయ్యాడు. ఏబీ (1), పడిక్కల్ (36) నిలకడగా ఆడుతున్నారు.
భవీ మళ్లీ రంగంలోకి దిగాడు. కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. హైదరాబాద్ వికెట్ కోసం ఎదురు చూస్తోంది. మాక్సీ (41), పడిక్కల్ (31) నిలకడగా ఆడుతున్నారు.
హోల్డర్ తొమ్మిది పరుగులు ఇచ్చాడు. మాక్సీ (36) ఓ బౌండరీ బాదాడు. పడిక్కల్ (29) మాక్సీకే స్ట్రైక్ ఇస్తున్నాడు.
సిద్ధార్థ్ కౌల్ ఆరు పరుగులు ఇచ్చాడు. రెండో బంతిని మాక్సీ (30) బౌండరీకి పంపించాడు. పడిక్కల్ (27) వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు.
మాలిక్ నాలుగు పరుగులు ఇచ్చాడు. మాక్సీ (25), పడిక్కల్ (26) ఆచితూచి ఆడారు.
రషీద్‌కు మాక్సీ చుక్కలు చూపిస్తున్నాడు. ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. మాక్సీ (23) ఒక సిక్సర్, ఒక బౌండరీ బాదాడు. పడిక్కల్ (24) సెకండ్ ఫెడల్ ఆడుతున్నాడు.
ఉమ్రాన్ మాలిక్ ఐదు పరుగులు ఇచ్చాడు. మాక్సీ (9), పడిక్కల్ (23) నిలకడగా ఆడుతున్నారు.
రషీద్ బౌలింగ్‌కు వచ్చాడు. తొమ్మిది పరుగులు ఇచ్చాడు. మూడో బంతిని మాక్సీ (7) మాక్సిమమ్ బాదేశాడు. పడిక్కల్ (20) మరో ఎండ్‌లో ఉన్నాడు.
ఉమ్రాన్ మాలిక్‌కు తొలి వికెట్ దక్కింది. 6.5వ బంతికి భరత్ (12)ను ఔట్ చేశాడు. కేవలం ఒక పరుగే ఇచ్చాడు. మాక్సీ (౦) క్రీజులోకి వచ్చాడు. పడిక్కల్ (18) ఆచితూచి ఆడుతున్నాడు.
సిద్ధార్థ్ కౌల్ 12 పరుగులు ఇచ్చాడు. ఆఖరి రెండు బంతుల్ని భరత్ (12) వరుసగా సిక్సర్, బౌండరీగా మలిచాడు. పడిక్కల్ (17) నిలకడగా ఆడుతున్నాడు.
హోల్డర్ 7 పరుగులు ఇచ్చాడు. నాలుగో బంతిని పడిక్కల్ (16) బౌండరీకి పంపించాడు. శ్రీకర్ భరత్ (1) క్రీజులోకి వచ్చాడు.
సిద్ధార్థ్ కౌల్ సూపర్ బౌలింగ్ చేశాడు. పరుగులు ఇవ్వకుండా వికెట్ తీశాడు. రెండో బంతికి డాన్ క్రిస్టియన్ (1) ఔటయ్యాడు. పడిక్కల్ (11) నిలకడగా ఆడుతున్నాడు.
భువీ 5 పరుగులు ఇచ్చాడు. పడిక్కల్ (11), క్రిస్టియన్ (1) నిలకడగా ఆడారు.
జేసన్ హోల్డర్ ఏడు పరుగులు ఇచ్చాడు. హైదరాబాద్ రివ్యూను వృథా చేసుకుంది. పడిక్కల్ (7) బౌండరీ బాదాడు. డాన్ క్రిస్టియన్ (0) క్రీజులో ఉన్నాడు.
భువనేశ్వర్ అద్భుతం చేశాడు. తొలి ఓవర్లో ఆరు పరుగులిచ్చి వికెట్ తీశాడు. తొలి బంతిని ట్రేడ్‌మార్క్ కవర్‌డ్రైవ్‌తో బౌండరీ బాదిన విరాట్ కోహ్లీ (5) ఆఖరి బంతికి ఎల్బీ అయ్యాడు. పడిక్కల్ (1) నిలకడగా ఆడాడు.
హర్షల్ పటేల్‌కు మరో వికెట్ లభించింది. ఆఖరి బంతికి హోల్డర్ (16)ను ఔట్ చేశాడు. ఈ ఓవర్లో ఐదు పరుగులే వచ్చాయి. రషీద్ ఖాన్ (7) అజేయంగా నిలిచాడు.
సిరాజ్ ఆరు పరుగులు ఇచ్చాడు. రషీద్ (6), హోల్డర్ (13) ఆచితూచి ఆడారు.
హర్షల్ మళ్లీ వికెట్ తీశాడు. రెండో బంతికి సాహా (10)ని ఔట్ చేశాడు. అంతకు ముందు అతడో బౌండరీ కొట్టాడు. ఐదో బంతిని హోల్డర్ (12) బౌండరీకి తరలించాడు. రషీద్ (1) క్రీజులోకి వచ్చాడు.
క్రిస్టియన్ ఏడు పరుగులు ఇచ్చాడు. హోల్డర్ (7) బౌండరీ బాదాడు. సాహా (6) ఆచితూచి ఆడాడు.
చాహల్ వికెట్ తీసి ఆరు పరుగులు ఇచ్చాడు. వృద్ధిమాన్ సాహా (4), జేసన్ హోల్డర్ (2) నిలకడగా ఆడారు.
చాహల్ వేసిన 15.1 బంతికి అబ్దుల్ సమద్ (1) ఔటయ్యాడు. ఎల్బీగా వెనుదిరిగాడు.
క్రిస్టియన్ ఈ ఓవర్లో రెండు వికెట్లు తీసి రెండు పరుగులు ఇచ్చాడు. తొలి బంతికి ప్రియమ్ గార్గ్, ఆఖరి బంతికి జేసన్ రాయ్ (43) ని పెవిలియన్ పంపించాడు. అబ్దుల్ సమద్ (1) క్రీజులో ఉన్నాడు.
డాన్ క్రిస్టియన్ వేసిన 14.1వ బంతికి భారీ షాట ఆడబోయి ప్రియమ్ గార్గ్ (15) ఔటయ్యాడు. ఏబీడీకి క్యాచ్ ఇచ్చాడు.
చాహల్ తొమ్మిది పరుగులు ఇచ్చాడు. తొలి బంతిని ప్రియమ్ గార్గ్ (15) సూపర్ సిక్స్ కొట్టాడు. జేసన్ రాయ్ (43) ఔట్ ప్రమాదం తప్పించుకున్నాడు.
క్రిస్టియన్ 5 పరుగులు ఇచ్చాడు. ప్రియమ్ (7) నిలకడగా ఆడుతున్నాడు. జేసన్ రాయ్ (42) అర్ధశతకం వైపు సాగుతున్నాడు.
హర్షల్ పటేల్ తన సత్తా చూపిస్తూనే ఉన్నాడు. పది పరుగులు ఇచ్చి కీలకమైన కేన్‌ను ఔట్ చేశాడు. ఆఖరి బంతిన రాయ్ (41) బౌండరీకి పంపించాడు. ప్రియమ్ గార్గ్ (3) బ్యాటింగ్‌కు వచ్చాడు.
హర్షల్ పటేల్ వేసిన 11.3వ బంతికి కేన్ విలియమ్సన్ (31; 29 balls 4x4) ఔటయ్యాడు.
షాబాజ్ ఐదు పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్లో బౌండరీలేమీ రాలేదు. విలియమ్సన్ (29), జేసన్ రాయ్ (36) నిలకడగా ఆడారు.
చాహల్ తొమ్మిది పరుగులు ఇచ్చాడు. విలియమ్సన్ (27) ఆచితూచి ఆడాడు. తొలి బంతిని రాయ్ (33) బౌండరీకి పంపించాడు.
అహ్మద్ ఆరు పరుగులు ఇచ్చాడు. రాయ్ (24) ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. విలియమ్సన్ (27) నిలకడగా ఆడుతున్నాడు. టైమ్‌ఔట్ ప్రకటించారు.
అహ్మద్ ఆరు పరుగులు ఇచ్చాడు. రాయ్ (24) ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. విలియమ్సన్ (27) నిలకడగా ఆడుతున్నాడు. టైమ్‌ఔట్ ప్రకటించారు.
చాహల్ మూడు పరుగులు ఇచ్చాడు. విలియమ్సన్ (23), జేసన్ రాయ్ (22) ఆచితూచి ఆడారు.
హర్షల్ వైవిధ్యంగా బౌలింగ్ చేశాడు. ఎనిమిది పరుగులు ఇచ్చాడు. రాయ్ (22) చక్కని బౌండరీ కొట్టాడు. కేన్(20) నిలకడగా ఆడుతున్నాడు.
షాబాజ్ బౌలింగ్‌కు వచ్చాడు. ఏడు పరుగులు ఇచ్చాడు. నాలుగో బంతిని రాయ్ (15) బౌండరీకి తరలించాడు. కేన్ (19) అతడికి తోడుగా ఉన్నాడు.
గార్టన్ 17 పరుగులు ఇచ్చాడు. రెండు వైడ్లు వేశాడు. జేసన్ రాయ్ (9) ఒక బౌండరీ బాదితే కేన్ విలియమ్సన్ (18) రెండు బౌండరీలు కొట్టాడు.
షాబాజ్ అహ్మద్‌ను బౌలింగ్‌కు దించారు. కేవలం 3 పరుగులే వచ్చాయి. రాయ్ (3), విలియమ్సన్ (9) నిలకడగా ఆడారు.
సిరాజ్ 9 పరుగులు ఇచ్చాడు. విలియమ్సన్ (8) రెండు చక్కని బౌండరీ బాదాడు. నాలుగో బంతిని ఆడిన కవర్‌డ్రై అద్భుతంగా అనిపించింది. రాయ్ (1) మరో ఎండ్‌లో ఉన్నాడు.
గార్టన్ ఈ ఓవర్లో 10 పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. అభిషేక్ తొలి రెండు బంతులను వరుసగా 4,6గా మలిచాడు. ఆ తర్వాత భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. విలియమ్సన్ క్రీజులోకి వచ్చాడు. రాయ్ (1) ఆచితూచి ఆడుతున్నాడు.
గార్టన్ వేసిన 1.5వ బంతికి అభిషేక్ (13) ఔటయ్యాడు. భారీ షాట్ ఆడే క్రమంలో మాక్సీకి క్యాచ్ ఇచ్చాడు.
హైదరాబాద్ బ్యాటింగ్ ఆరంభించింది. అభిషేక్ శర్మ (౧) ఓపెనింగ్‌కు దిగాడు. జేసన్ రాయ్ (1) అతడికి తోడుగా వచ్చాడు. తొలి ఓవర్లో సిరాజ్ కేవలం రెండు పరుగులే ఇచ్చాడు.
టాస్ గెలిచిన ఆర్‌సీబీ సారథి విరాట్ కోహ్లీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఛేదనకు మొగ్గు చూపుతున్నామని అన్నాడు. జట్టులో మార్పులేమీ చేయలేదని వెల్లడించాడు. రెండు మ్యాచులకు ముందే క్వాలిఫై కావడంతో ఒత్తిడి లేకుండా ఆడుతామని తెలిపాడు.
Background
ఐపీఎల్‌లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. షేక్ జయేద్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసులో ఉన్న జట్ల అవకాశాలను ఈ మ్యాచ్ ప్రభావితం చేయదు కానీ.. బెంగళూరు భారీ తేడాతో గెలిస్తే మాత్రం.. టాప్-2కి వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పుడు క్వాలిఫయర్-1లో ఆడే అవకాశం బెంగళూరుకు దక్కుతుంది. సన్‌రైజర్స్ గెలిచినా.. ఓడినా పోయేదేమీ లేదు.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ తుదిజట్టులో మార్పులు చేయలేదు. అది పాజిటివ్ రిజల్ట్‌నే అందించింది. కాబట్టి ఈ మ్యాచ్‌లో కూడా జట్టును మార్చకపోవచ్చు. ప్లేఆఫ్స్‌కు ముందు కీలక ఆటగాళ్లకు విశ్రాంతిని ఇవ్వాలనుకుంటే కొందరు కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో సరైన ప్రదర్శన చేయని డాన్ క్రిస్టియన్ బెంచ్‌కు పరిమితం అయ్యే అవకాశం ఉంది. మ్యాక్స్‌వెల్ అద్భుతమైన ఫాంలో ఉండగా.. డివిలియర్స్ మాత్రం భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. బౌలర్లలో హర్షల్ పటేల్, చాహల్, సిరాజ్ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.
ఇక సన్‌రైజర్స్ విషయానికి వస్తే.. వాళ్లకి ఈ సీజన్‌లో ఇంతవరకు ఏమీ కలిసిరాలేదు. మొత్తం 12 మ్యాచ్‌ల్లో కేవలం రెండు మాత్రమే గెలిచింది. ఏకంగా 10 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. జేసన్ హోల్డర్ మినహా ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా ఫాంలో లేడు. బౌలర్లలో భువనేశ్వర్, ఉమ్రాన్, సందీప్ శర్మ, రషీద్ మంచిగా బౌలింగ్ చేస్తున్నా.. బ్యాట్స్‌మెన్ సహకారం లేకపోవడంతో అదంతా బూడిదలో పోసిన పన్నీరవుతోంది.
ఈ రెండు జట్ల ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు జరగ్గా సన్‌రైజర్స్ 10 మ్యాచ్‌లు గెలిచింది. బెంగళూరు 8 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. ఈ రెండు జట్లూ తలపడిన గత ఆరు మ్యాచ్‌ల్లో చెరో మూడు గెలిచాయి. 2016 ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరును రైజర్స్ ఓడించి ఐపీఎల్ ట్రోఫీ సాధించిన సంగతి తెలిసిందే.. ఈ మ్యాచ్‌లో బెంగళూరు గెలిచి రెండో స్థానం వైపు వెళ్తుందో.. రైజర్స్ విజయం సాధించి చాలెంజర్స్ అవకాశాలను దెబ్బ తీస్తుందో చూద్దాం..!
- - - - - - - - - Advertisement - - - - - - - - -