KKR Vs RCB Live Updates: పది ఓవర్లలోనే ఖేల్ ఖతం.. తొమ్మిది వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం

IPL 2021, Match 31, KKR Vs RCB: కోల్‌కతా, బెంగళూరుల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

ABP Desam Last Updated: 20 Sep 2021 10:23 PM
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: పది ఓవర్లలో కోల్‌కతా స్కోరు 94-1, తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం

చాహల్ వేసిన ఈ ఓవర్లో వెంకటేష్ అయ్యర్ 12 పరుగులు సాధించాడు. దీంతో కోల్‌కతా 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
ఆండ్రీ రసెల్ 0(0)
వెంకటేష్ అయ్యర్ 41(27)

శుభ్‌మన్ గిల్ అవుట్

అర్థసెంచరీ ముంగిట్ గిల్‌ను చాహల్ అవుట్ చేశాడు.
శుభ్‌మన్ గిల్ (సి) సిరాజ్ (బి) చాహల్ (48: 34 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: తొమ్మిదో ఓవర్‌ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 82-0, లక్ష్యం 93 పరుగులు

హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ 7 పరుగులు సాధించారు. తొమ్మిదో ఓవర్‌ ముగిసే సరికి కోల్‌కతా స్కోరు 82-0గా ఉంది. విజయానికి 66 బంతుల్లో 11 పరుగులు కావాలి.
శుభ్‌మన్ గిల్ 48(33)
వెంకటేష్ అయ్యర్ 29(22)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: ఎనిమిదో ఓవర్‌ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 75-0, లక్ష్యం 93 పరుగులు

హసరంగ మళ్లీ బౌలింగ్‌కు వచ్చాడు. ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ 13 పరుగులు సాధించారు. ఎనిమిదో ఓవర్‌ ముగిసే సరికి కోల్‌కతా స్కోరు 75-0గా ఉంది. విజయానికి 72 బంతుల్లో 18 పరుగులు కావాలి.
శుభ్‌మన్ గిల్ 42(29)
వెంకటేష్ అయ్యర్ 28(20)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: ఏడో ఓవర్‌ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 62-0, లక్ష్యం 93 పరుగులు

పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్ బౌలింగ్‌కు వచ్చాడు. ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ 6 పరుగులు సాధించారు. ఏడో ఓవర్‌ ముగిసే సరికి కోల్‌కతా స్కోరు 62-0గా ఉంది. విజయానికి 78 బంతుల్లో 31 పరుగులు కావాలి.
శుభ్‌మన్ గిల్ 33(24)
వెంకటేష్ అయ్యర్ 24(19)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: ఆరో ఓవర్‌ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 56-0, లక్ష్యం 93 పరుగులు

విరాట్ కోహ్లీ చాహల్ చేతికి బంతిని అందించాడు. ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ 11 పరుగులు సాధించారు. ఆరో ఓవర్‌ ముగిసే సరికి కోల్‌కతా స్కోరు 56-0గా ఉంది. విజయానికి 84 బంతుల్లో 37 పరుగులు కావాలి.
శుభ్‌మన్ గిల్ 30(21)
వెంకటేష్ అయ్యర్ 22(16)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: ఐదో ఓవర్‌ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 45-0, లక్ష్యం 93 పరుగులు

కైల్ జేమీసన్ మళ్లీ బౌలింగ్‌కు వచ్చాడు. ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ ఏకంగా 16 పరుగులు సాధించారు. ఐదో ఓవర్‌ ముగిసే సరికి కోల్‌కతా స్కోరు 45-0గా ఉంది. విజయానికి 90 బంతుల్లో 48 పరుగులు కావాలి
శుభ్‌మన్ గిల్ 19(15)
వెంకటేష్ అయ్యర్ 22(16)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: నాలుగో ఓవర్‌ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 29-0, లక్ష్యం 93 పరుగులు

శ్రీలంక బౌలర్ హసరంగ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. నాలుగో ఓవర్‌ ముగిసే సరికి కోల్‌కతా స్కోరు 29-0గా ఉంది. విజయానికి 96 బంతుల్లో 64 పరుగులు కావాలి
శుభ్‌మన్ గిల్ 10(9)
వెంకటేష్ అయ్యర్ 16(15)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: మూడో ఓవర్‌ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 22-0, లక్ష్యం 93 పరుగులు

మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. మూడో ఓవర్‌ ముగిసే సరికి కోల్‌కతా స్కోరు 22-0గా ఉంది. విజయానికి 102 బంతుల్లో 71 పరుగులు కావాలి
శుభ్‌మన్ గిల్ 8(7)
వెంకటేష్ అయ్యర్ 11(11)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రెండో ఓవర్‌ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 20-0, లక్ష్యం 93 పరుగులు

కైల్ జేమీసన్ వేసిన ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ 10 పరుగులు చేశారు. రెండో ఓవర్‌ ముగిసే సరికి కోల్‌కతా స్కోరు 20-0గా ఉంది. విజయానికి 108 బంతుల్లో 73 పరుగులు కావాలి
శుభ్‌మన్ గిల్ 8(7)
వెంకటేష్ అయ్యర్ 9(5)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: మొదటి ఓవర్‌లో కోల్‌కతా స్కోరు 10-0, లక్ష్యం 93 పరుగులు

మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ 10 పరుగులు చేశారు. మొదటి ఓవర్‌ ముగిసే సరికి కోల్‌కతా స్కోరు 10-0గా ఉంది. విజయానికి 114 బంతుల్లో 83 పరుగులు కావాలి
శుభ్‌మన్ గిల్ 1(2)
వెంకటేష్ అయ్యర్ 8(4)

కోల్‌కతా ఇన్నింగ్స్ ప్రారంభం

శుభ్‌మన్ గిల్, కొత్త ఆటగాడు వెంకటేష్ అయ్యర్‌లు కోల్‌కతా తరఫున ఓపెనర్లుగా వచ్చారు. బెంగళూరు బౌలర్ మహ్మద్ సిరాజ్ బంతితో సిద్ధం అయ్యాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 19 ఓవర్లలో 92 పరుగులకు బెంగళూరు ఆలౌట్

ఆండ్రీ రసెల్ వేసిన ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మన్ మూడు పరుగులు చేసి ఆఖరి వికెట్‌ను కోల్పోయారు. దీంతో 19 ఓవర్లలో బెంగళూరు స్కోరు 92 పరుగులకు బెంగళూరు ఆలౌట్.


యజ్వేంద్ర చాహల్ 2(6)
ఆండ్రీ రసెల్ 3-0-9-3

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 18 ఓవర్లకు బెంగళూరు స్కోరు 89-9

ప్రసీద్ కృష్ణ తన చివరి ఓవర్ బౌల్ చేశాడు. ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మన్ ఆరు పరుగులు చేశారు. 18 ఓవర్లకు బెంగళూరు స్కోరు 89-9గా ఉంది.


సిరాజ్ 7(6)
యజ్వేంద్ర చాహల్ 1(4)
ప్రసీద్ కృష్ణ 4-0-24-1

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 17 ఓవర్లకు బెంగళూరు స్కోరు 83-9

లోకి ఫెర్గూసన్ తన చివరి ఓవర్ బౌల్ చేశాడు. ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మన్ నాలుగు పరుగులు చేశారు. 17 ఓవర్లకు బెంగళూరు స్కోరు 83-9గా ఉంది.


సిరాజ్ 2(1)
యజ్వేంద్ర చాహల్ 0(2)
లోకి ఫెర్గూసన్ 4-0-24-2

హర్షల్ పటేల్ అవుట్

లోకి ఫెర్గూసన్ హర్షల్ పటేల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
హర్షల్ పటేల్ (బి) లోకి ఫెర్గూసన్ (12: 10 బంతుల్లో, రెండు ఫోర్లు)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 16 ఓవర్లకు బెంగళూరు స్కోరు 79-8

వరుణ్ చక్రవర్తి తన చివరి ఓవర్ బౌల్ చేశాడు. ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మన్ నాలుగు పరుగులు చేశారు. 16 ఓవర్లకు బెంగళూరు స్కోరు 79-8గా ఉంది.


సిరాజ్ 2(1)
హర్షల్ పటేల్ 8(7)
వరుణ్ చక్రవర్తి 4-0-13-3

కైల్ జేమీసన్ అవుట్

దురదృష్టవశాత్తూ కైల్ జేమీసన్ రనౌటయ్యాడు. 15.3 ఓవర్లకు బెంగళూరు స్కోరు 76-8గా ఉంది.


సచిన్ బేబీ (రనౌట్, వరుణ్ చక్రవర్తి) 4(12 బంతుల్లో)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 15 ఓవర్లకు బెంగళూరు స్కోరు 75-7

సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మన్ ఏడు పరుగులు చేశారు. 15 ఓవర్లకు బెంగళూరు స్కోరు 75-7గా ఉంది.


కైల్ జేమీసన్ 3(10)
హర్షల్ పటేల్ 7(4)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 14 ఓవర్లకు బెంగళూరు స్కోరు 68-7

వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మన్ రెండు పరుగులు చేశారు. 14 ఓవర్లకు బెంగళూరు స్కోరు 68-7గా ఉంది. సచిన్ బేబీ అవుటయ్యాడు.


కైల్ జేమీసన్ 2(6)
హర్షల్ పటేల్ 2(2)

సచిన్ బేబీ అవుట్

వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి సచిన్ బేబీ అవుటయ్యాడు. ఇది వరుణ్‌కు మూడో వికెట్. ఆర్సీబీ స్కోరు 13.4 ఓవర్లకు 66-7గా ఉంది.


సచిన్ బేబీ (సి) నితీష్ రాణా (బి) వరుణ్ చక్రవర్తి 7(17 బంతుల్లో)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 13 ఓవర్లకు బెంగళూరు స్కోరు 66-6

సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మన్ మూడు పరుగులు చేశారు. 13 ఓవర్లకు బెంగళూరు స్కోరు 66-6గా ఉంది. 


కైల్ జేమీసన్ 2(6)
సచిన్ బేబీ 7(13)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 12 ఓవర్లకు బెంగళూరు స్కోరు 63-6

వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మన్ మూడు పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయారు. 12 ఓవర్లకు బెంగళూరు స్కోరు 63-6గా ఉంది. 


కైల్ జేమీసన్ 0(1)
సచిన్ బేబీ 6(12)

హసరంగ అవుట్

మ్యాక్స్‌వెల్ అవుటైన తర్వాతి బంతికే వనిందు హసరంగ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇది వరుణ్‌కు హ్యాట్రిక్ బాల్.


వనిందు హసరంగ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ చక్రవర్తి 0(1)

మ్యాక్స్‌వెల్ అవుట్

వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి మాక్స్‌వెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బెంగళూరు స్కోరు 11.4 ఓవర్లలో 63-5గా ఉంది.


గ్లెన్ మ్యాక్స్‌వెల్ (బి) వరుణ్ చక్రవర్తి (10:17 బంతుల్లో)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 11 ఓవర్లకు బెంగళూరు స్కోరు 60-4

లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మన్ ఆరు పరుగులు సాధించారు. 11 ఓవర్లకు బెంగళూరు స్కోరు 60-4గా ఉంది. 


గ్లెన్ మ్యాక్స్‌వెల్ 9(15)
సచిన్ బేబీ 4(10)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 10 ఓవర్లకు బెంగళూరు స్కోరు 54-4

ప్రసీద్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మన్ రెండు పరుగులు సాధించారు. 10 ఓవర్లకు బెంగళూరు స్కోరు 54-4గా ఉంది. 


గ్లెన్ మ్యాక్స్‌వెల్ 7(12)
సచిన్ బేబీ 1(6)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: తొమ్మిది ఓవర్లకు బెంగళూరు స్కోరు 52-4

ఆండ్రీ రసెల్ వేసిన ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయారు. తొమ్మిది ఓవర్లకు బెంగళూరు స్కోరు 52-4గా ఉంది. శ్రీకర్ భరత్, విధ్వంసక బ్యాట్స్‌మన్ డివిలియర్స్‌లను రసెల్ ఈ ఓవర్లో పెవిలియన్‌కు పంపాడు.


గ్లెన్ మ్యాక్స్‌వెల్ 6(10)
సచిన్ బేబీ 0(2)

డివిలియర్స్ అవుట్

విధ్వంసక ఆటగాడు డివిలియర్స్‌ను మొదటి బంతికే అవుట్ చేసి రసెల్ కోల్‌కతా శిబిరంలో ఆనందాన్ని నింపాడు.


ఏబీ డివిలియర్స్ (బి) రసెల్ 0(1) 

శ్రీకర్ భరత్ అవుట్

విండీస్ ఆల్‌రౌండర్ రసెల్... శ్రీకర్ భరత్‌ను అవుట్ చేసి కోల్‌కతాకు మూడో వికెట్ అందించాడు. వెంటనే కోల్‌కతా స్ట్రాటజిక్ టైం అవుట్ కూడా తీసుకుంది.
శ్రీకర్ భరత్ (సి) శుభ్‌మన్ గిల్ (బి) ఆండ్రీ రసెల్ (16: 19 బంతుల్లో, ఒక ఫోర్)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: ఎనిమిది ఓవర్లకు బెంగళూరు స్కోరు 51-2

సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మన్ నాలుగు పరుగులు సాధించారు. ఎనిమిది ఓవర్లకు బెంగళూరు స్కోరు 51-2గా ఉంది.


శ్రీకర్ భరత్ 16(18)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 5(8)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: ఏడు ఓవర్లకు బెంగళూరు స్కోరు 47-2

విండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ బౌలింగ్‌కు వచ్చాడు. ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మన్ ఆరు పరుగులు సాధించారు. ఏడు ఓవర్లకు బెంగళూరు స్కోరు 47-2గా ఉంది.


శ్రీకర్ భరత్ 15(17)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2(3)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: దేవ్‌దత్ పడిక్కల్ అవుట్.. ఆరు ఓవర్లకు బెంగళూరు స్కోరు 41-2

లోకి ఫెర్గూసన్ ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మన్ ఆరు పరుగులు సాధించారు. ఆరు ఓవర్లకు బెంగళూరు స్కోరు 41-2గా ఉంది. ఓవర్ ఆఖరి బంతికి దేవ్‌దత్ పడిక్కల్ వికెట్‌ పడింది.


శ్రీకర్ భరత్ 12(15)
దేవ్‌దత్ పడిక్కల్ (సి) దినేష్ కార్తీక్ (బి) లోకి ఫెర్గూసన్ (22: 20 బంతుల్లో, మూడు ఫోర్లు)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: ఐదు ఓవర్లలో బెంగళూరు స్కోరు 35-1

డేంజరస్ స్పిన్నర్ సునీల్ నరైన్ తన మొదటి ఓవర్ వేశాడు. ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మన్ 7 పరుగులు సాధించారు. ఐదు ఓవర్లకు బెంగళూరు స్కోరు 35-1గా ఉంది.


శ్రీకర్ భరత్ 10(12)
దేవ్‌దత్ పడిక్కల్ 17(16)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: నాలుగు ఓవర్లలో బెంగళూరు స్కోరు 28-1

ప్రసీద్ కృష్ణ తన రెండో ఓవర్‌ను వేయడానికి వచ్చాడు. ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మన్ 8 పరుగులు సాధించారు. నాలుగు ఓవర్లలో బెంగళూరు స్కోరు 28-1గా ఉంది. ప్రసీద్ ఈ ఓవర్లో వరుసగా రెండు నోబాల్స్ వేశాడు.


శ్రీకర్ భరత్ 5(10)
దేవ్‌దత్ పడిక్కల్ 15(12)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: మూడు ఓవర్లకు బెంగళూరు స్కోరు 20-1

అప్పుడే బౌలింగ్ మార్పు. వరుణ్ చక్రవర్తి స్థానంలో లోకి ఫెర్గూసన్‌ను మోర్గాన్ దించాడు. ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మన్ 8 పరుగులు సాధించారు. మూడు ఓవర్లలో బెంగళూరు స్కోరు 20-1గా ఉంది.


శ్రీకర్ భరత్ 4(5)
దేవ్‌దత్ పడిక్కల్ 10(9)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రెండు ఓవర్లకు బెంగళూరు స్కోరు 12-1

పేస్ బౌలర్ ప్రసీద్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మన్ 8 పరుగులు సాధించారు. డేంజరస్ కోహ్లీని అవుట్ చేసి ప్రసీద్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మొదటి బ్రేక్ అందించాడు. రెండు ఓవర్లలో బెంగళూరు స్కోరు 12-1గా ఉంది.


శ్రీకర్ భరత్ 2(2)
దేవ్‌దత్ పడిక్కల్ 4(6)

కోహ్లీ అవుట్

పేస్ బౌలర్ ప్రసీద్ కృష్ణ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మొదటి బ్రేక్ అందించాడు. విరాట్ కోహ్లీని ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు. కోహ్లీ రివ్యూకి వెళ్లినా ఉపయోగం లేకపోయింది.


విరాట్ కోహ్లీ (ఎల్బీడబ్ల్యూ) (బి) ప్రసీద్ కృష్ణ 5(3 బంతుల్లో, ఒక ఫోర్)

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: మొదటి ఓవర్‌లో బెంగళూరు స్కోరు 4-0

వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మన్ నాలుగు పరుగులు సాధించారు. మొదటి ఓవర్ ముగిసేసరికి బెంగళూరు స్కోరు 4-0గా ఉంది.


విరాట్ కోహ్లి 1(2)
దేవ్‌దత్ పడిక్కల్ 3(4)

ఆట మొదలైంది

ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్ ఓపెనింగ్‌కు వచ్చారు. ఇయాన్ మోర్గాన్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌ను స్నిన్నర్ వరుణ్ చక్రవర్తికి అందించాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్ తుదిజట్టు

శుభ్‌మన్ గిల్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), ఆండ్రీ రసెల్, దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), లోకి ఫెర్గూసన్, వెంకటేష్ అయ్యర్, ప్రసీద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు

విరాట్ కోహ్లి(కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, శ్రీకర్ భరత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్(వికెట్ కీపర్), సచిన్ బేబీ, వనిందు హసరంగ, కైల్ జేమీసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చాహల్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు

రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

బ్లూ జెర్సీలతో బరిలోకి దిగనున్న ఆర్సీబీ

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ ఫ్రంట్ లైన్ వారియర్లకు సంఘీభావం తెలుపుతూ ఆర్సీబీ నేడు బ్లూ జెర్సీలతో బరిలోకి దిగనుంది.


 





Background

ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లి సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరే హాట్ ఫేవరెట్‌గా కనపడుతుంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక కోల్‌కతా ఏడు మ్యాచ్‌ల్లో ఏకంగా ఐదు ఓటములను ఎదుర్కొని ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే కోల్‌కతాకు ప్లేఆఫ్ అవకాశాలు కష్టం అవుతుంది.


కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్ గెలవాలంటే ఆండ్రీ రసెల్ కచ్చితంగా ఫాంలోకి రావాల్సిందే. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠిలు బ్యాట్‌తో రాణించాల్సిన అవసరం కూడా ఉంది. కోల్‌కతా కీలక బౌలర్ ప్యాట్ కమిన్స్ ఈ ఐపీఎల్‌కు దూరం కావడంతో అతని స్థానంలో న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌతీ జట్టులోకి వచ్చాడు.


ఆర్సీబీ పటిష్టంగా ఉంది. విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, దేవ్‌దత్ పడిక్కల్‌తో బ్యాటింగ్ ఆర్డర్ దుర్భేద్యంగా కనిపిస్తుంది. అయితే డెత్ ఓవర్లలో బౌలింగ్ విషయంలో బెంగళూరు బౌలర్లు కైల్ జేమీసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్‌లు దృష్టి పెట్టాలి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.