ఐపీఎల్‌లో నేడు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టుకు క్వాలిఫయర్ 2 ఆడే అవకాశం ఉంటుంది. లీగ్ లీడర్ ఢిల్లీపై చివరి బంతికి విజయం సాధించి.. రాయల్ చాలెంజర్స్ ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.


ఇక కోల్‌కతా కూడా తన చివరి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ఏకంగా 86 పరుగులతో విజయం సాధించింది. ఈ రెండు జట్లూ విజయాలతో ఉండటంతో ఈ మ్యాచ్ కూడా థ్రిల్లింగ్‌గా సాగే అవకాశం ఉంది. డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి రెండు జట్లూ కచ్చితంగా తమ బెస్ట్ ఇస్తాయి.


ఆర్‌సీబీ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అయితే గత కొన్ని మ్యాచ్‌లుగా కోహ్లీ, పడిక్కల్ విఫలం అవుతున్నారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుత ఫాం జట్టుకు పెద్ద ప్లస్. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మ్యాక్స్‌వెల్ 498 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో హర్షల్ పటేల్, చాహల్ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. బ్యాట్‌తో మెరుస్తున్న మ్యాక్స్‌వెల్ అప్పుడప్పుడు బంతితో కూడా వికెట్లు తీస్తూ జట్టుకు ఉపయోగపడుతున్నాడు.


కోల్‌కతా నైట్‌రైడర్స్ యూఏఈలో సూపర్ ఫాంలో ఉంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఏకంగా ఐదు విజయాలు సాధించారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠి బీభత్సమైన ఫాంలో ఉన్నారు. నితీష్ రాణా కూడా అడపాదడపా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నారు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, దినేష్ కార్తీక్‌ల ఫాం జట్టును ఇబ్బంది పెడుతుంది. బౌలర్లలో శివం మావి, లోకి ఫెర్గూసర్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి వికెట్లు తీస్తూ అదరగొడుతున్నారు.


ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు జరగ్గా.. 15 మ్యాచ్‌ల్లో బెంగళూరు, 13 మ్యాచ్‌ల్లో కోల్‌కతా గెలిచాయి. మరి ఈ మ్యాచ్‌లో గెలిచి ఎవరు ఎవర్ని ఇంటికి పంపిస్తారో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే!


Also Read: డేవిడ్‌ వార్నర్‌ అంశంలో గుసగుసలెందుకు? ఏదో జరుగుతోందని సంజయ్‌ మంజ్రేకర్‌ అనుమానం!


కోల్‌కతా నైట్‌రైడర్స్ తుదిజట్టు (అంచనా)
శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లోకి ఫెర్గూసన్, శివం మావి, వరుణ్ చక్రవర్తి


రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు(అంచనా)
విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), డాన్ క్రిస్టియన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, జార్జ్ గార్టన్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చాహల్


Also Read: ఆఖరి బంతికి సిక్స్‌..! ఆ కిక్కులో ఆర్‌సీబీ చేసుకున్న సంబరాలు చూడండి


Also Read: మెస్సీ.. ఏడోసారి గెలుస్తాడా? రొనాల్డోతో పోటీపడుతున్న అర్జెంటీనా దిగ్గజం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి