Virat Kohli Record: విరాట్ కోహ్లీని ఊరిస్తోన్న రికార్డు... 63 పరుగులు చేస్తే... హెడింగ్లి టెస్టులో సాధ్యమయ్యేనా?

ప్రస్తుతం కోహ్లీ టెస్టు, వన్డే, టీ20 మొత్తం కలిపి 437 మ్యాచ్‌లు ఆడి 22, 937 పరుగులు సాధించాడు.

Continues below advertisement

భారత క్రికెట్ జట్టు సారథి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీని ఓ వ్యక్తిగత రికార్డు ఊరిస్తోంది. 63 పరుగులు చేస్తే చాలు కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో 23 వేల పరుగుల మైలు రాయిని అందుకుంటాడు. మరి హెడింగ్లి టెస్టులో కోహ్లీ 63 పరుగులు చేసి ఈ రికార్డును అందుకుంటాడో లేదో చూడాలి.

Continues below advertisement

 Also Read: In Pics: చీర కట్టులో మెరిసిన పీవీ సింధు... ఫొటోలు షేర్ చేసిన సింధు... ఫిదా అయిన సమంత

ప్రస్తుతం కోహ్లీ టెస్టు, వన్డే, టీ20 మొత్తం కలిపి 437 మ్యాచ్‌లు ఆడి 22, 937 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ శతకం సాధించి సుమారు రెండు సంవత్సరాలు అవుతుంది. 2019 నవంబరులో ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ శతకం సాధించాడు. ఈ మ్యాచ్ తర్వాత కోహ్లీ ఇప్పటి వరకు 49 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ, ఒక్క శతకం కూడా సాధించలేకపోయాడు. శతకమే కాదు కోహ్లీ పరుగులు సాధించడంలోనూ కాస్త వెనుకంజలో పడ్డాడు. ప్రస్తుతం కోహ్లీ తన కెరీర్లోనే వరస్ట్ ఫేజ్‌ను ఎదుర్కొంటున్నాడు.      

 Also Read: Arshi Khan Engagement: క్రికెటర్‌తో నిశ్చితార్థం రద్దు చేసుకున్న నటి... కాబోయేవాడు భారతీయుడై ఉంటాడు

అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ కంటే ముందు అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్ ఉన్నారు. సచిన్ 34,357 పరుగులు చేస్తే రాహుల్ ద్రవిడ్ 24,208 పరుగులు సాధించాడు. వీరిద్దరూ కాకుండా శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర, మహేల జయవర్దనే, రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), జాక్వీస్ కలిస్ (దక్షిణాఫ్రికా) కోహ్లీ కంటే ఎక్కువ పరుగులు సాధించిన క్రికెటర్లు. 

 Also Read: FIH Awards 2021: 'ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు గుర్జిత్ కౌర్, హర్మన్ ప్రీత్

ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. నాటింగ్ హామ్ వేదికగా జరిగిన తొలి టెస్టు వర్షం కారణంగా డ్రా అవ్వగా, ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

 Also Read: India vs England 2021: మూడో టెస్టు ముందు ఇంగ్లాండ్‌కు భారీ షాక్... గాయంతో మార్క్‌వుడ్ ఔట్

సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు బుధవారం (ఆగస్టు 25న) ప్రారంభంకానుంది. లీడ్స్‌లోని హెడింగ్లి మైదానంలో ఈ టెస్టు జరగనుంది. మరి, కోహ్లీ 63 పరుగులు సాధించి వ్యక్తిగత రికార్డును సాధిస్తాడా? లేక తొలి రెండు టెస్టుల్లోలాగా పరుగులు చేయడంలో ఇబ్బంది పడతాడా అన్నది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.      

Continues below advertisement
Sponsored Links by Taboola