రెడ్‌మీ యూజర్లకు కంపెనీ గుడ్ న్యూస్ అందించింది. రెడ్‌మీ 10 సిరీస్‌లో త్వరలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ భారత మార్కెట్లోకి అడుగెట్టబోతున్నట్లు వెల్లడించింది. రెడ్‌మీ 10 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ విడుదల తేదీపై కంపెనీ టీజర్ ద్వారా రివీల్ చేసింది. సెప్టెంబర్ 3న మధ్యాహ్నం 12 గంటలకు వీటిని లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లను కూడా కంపెనీ వెల్లడించింది. షియోమీ నుంచి గత వారం విడుదలైన రెడ్‌మీ 10కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా రెడ్‌మీ 10 ప్రైమ్ ఎంట్రీ ఇవ్వనుందని లీకుల ద్వారా తెలుస్తోంది.
రెడ్‌మీ 10 ప్రైమ్ ధర.. (అంచనా)
రెడ్‌మీ 10 ధర రేంజ్‌లోనే రెడ్‌మీ 10 ప్రైమ్ ధర ఉండే అవకాశం ఉంది. రెడ్‌మీ 10లో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 649 మలేషియన్ రింగెట్లుగా (సుమారు రూ.11,400).. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 749 రింగెట్లుగా (సుమారు రూ.13,100) ఉంది. మనదేశంలో రూ.10000 లోపు నుంచే ఈ ఫోన్ ధర ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.
రెడ్‌మీ 10 ప్రైమ్ ఫీచర్లు.. (అంచనా)
రెడ్‌మీ 10 ప్రైమ్ స్పెసిఫికేషన్లపై ఇప్పటివరకు అందిన లీకుల ప్రకారం.. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌ను అందించినట్లు తెలుస్తోంది. ఇందులో 6.5 అంగుళాల అడాప్టివ్ సింక్ డిస్‌ప్లే అందించనున్నారు. దీని రిఫ్రెష్ రేట్ 90 HZగా ఉండనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లతో ఈ ఫోన్ రానున్నట్లు సమాచారం. దీనిలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఉండనుంది. అలాగే 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు కూడా అందించారు. దీని బరువు 181 గ్రాములుగా ఉండనుంది.
Also Read: Motorola Edge 20: నేటి నుంచి మోటొరోలా ఎడ్జ్ 20 ప్రీ-ఆర్డర్లు.. ఎడ్జ్ ఫ్యూజన్ సేల్ ఎప్పుడంటే?
Also Read: Covid 19 Vaccine: వాట్సాప్‌లో కోవిడ్ వ్యాక్సిన్ ‘స్లాట్ బుకింగ్’.. ఇలా బుక్ చేసుకోండి..