కోవిడ్ థర్డ్ వేవ్ త్వరలో ముంచుకొస్తుందనే హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేసింది. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్ బుకింగ్ విధానంలో టెక్నాలజీని జోడించింది. ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఈ మేరకు ట్వీట్ చేశారు. కోవిడ్ టీకా కోసం ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలనే అంశాలను అందులో వివరించారు. ఇప్పటివరకు కోవిన్ పోర్టల్, ఆరోగ్య సేతు యాప్, ఉమాంగ్ మొబైల్ యాప్‌, పేటీఎం యాప్‌ల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ స్లాట్స్ బుక్ చేసుకునే సౌకర్యం ఉండేది. ఇప్పుడు వీటికి వాట్సాప్ జతచేరింది. 





స్లాట్ బుక్ చేసుకోండిలా.. 



  • MyGov కరోనా హెల్ప్ డెస్క్ నంబరు 9013151515ను మీ కాంటాక్ట్ లిస్టుకు యాడ్ చేసుకోండి. 

  • తర్వాత ఈ నంబరకు వాట్సాప్‌లో బుక్ స్లాట్ (Book Slot) అని మెసేజ్ పంపాలి.

  • మనం వాడే వాట్సాప్ నంబరుకు 6 అంకెలతో ఒక ఓటీపీ మెసేజ్ రూపంలో వస్తుంది. 

  • ఈ ఓటీపీని వాట్సాప్ చాట్ లో ఎంటర్‌ చేసి నంబరును ధ్రువీకరించుకోవాలి. 

  • మనకు కావాల్సిన విధంగా తేదీ, లొకేషన్, పిన్‌కోడ్‌, వ్యాక్సిన్‌ టైప్‌ తదితర వివరాలను చాట్ ద్వారా తెలపాలి.

  • అన్ని వివరాలు అందించాక కన్ఫామ్ చేస్తే మీకు వ్యాక్సిన్ స్లాట్ బుక్ అవుతుంది. 


దేశ ప్రజల సౌలభ్యం కోసం కొత్త శకానికి నాంది పలికామని మన్‌సుఖ్‌ మాండవీయ అన్నారు. ఫోన్ల ద్వారా నిమిషాల్లోనే కోవిడ్ వ్యాక్సిన్ స్లాట్స్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు.



ఇదే విషయానికి సంబంధించి వాట్సాప్ సంస్థ హెడ్ విల్ క్యాథ్‌కార్ట్ ట్వీట్ చేశారు.



Also Read: Coronavirus India Updates: దేశంలో తగ్గిన కరోనా వ్యాప్తి...కొత్తగా 25,467 కరోనా కేసులు, 354 మరణాలు


Also Read: TS Covid News: కరోనా థర్డ్ వేవ్ అలర్ట్.. ప్రతి జిల్లా ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ ప్లాంట్.. తెలంగాణ ఆరోగ్య శాఖ అప్రమత్తం..