భారత్‌తో మూడో టెస్టుకు ముందు ఆతిథ్య ఇంగ్లాండ్‌కు భారీ షాక్ తగిలింది. గాయంతో ఆ జట్టు పేస్ బౌలర్ మార్క్‌వుడ్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో భారత్ X ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో ఫీల్డింగ్ చేసే సమయంలో మార్క్‌వుడ్ కిందపడ్డాడు. ఆ సమయంలో అతడి కుడి భుజానికి గాయమైంది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న మార్క్‌వుడ్ కోలుకోలేదు. దీంతో అతడు మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఇప్పటికే ఆ జట్టుకు స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్ లాంటి ప్రధాన బౌలర్లు లేరు. అలాగే మానసిక సమస్యల కారణంగా బెన్ స్టోక్స్ మొత్తం సిరీస్‌కే దూరమయ్యాడు.
Also Read: Arshi Khan Engagement: క్రికెటర్‌తో నిశ్చితార్థం రద్దు చేసుకున్న నటి... కాబోయేవాడు భారతీయడై ఉంటాడు
ఇప్పుడు ఈ టెస్టుకు మార్క్‌వుడ్ కూడా దూరం కావడం ఆ జట్టుకు గడ్డుకాలమే. మూడో టెస్టు అనంతరం మరోసారి మార్క్‌వుడ్‌కి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అప్పటికి పూర్తిగా కోలుకుంటే నాలుగో టెస్టులో ఆడే అవకాశం ఉంటుంది. మూడో టెస్టు కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు ప్రకటించింది. మరి ఇప్పుడు మార్క్‌వుడ్ స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారో చూడాలి.
క్రిస్ వోగ్స్ కూడా గాయం కారణంగా దూరమయ్యాడు. అతడు కోలుకుని ఎప్పుడు జట్టులోకి వస్తాడో తెలియదు. ఇప్పటికే ప్రకటించిన జట్టులో మహ్మూద్, ఓవర్టన్ ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో మహ్మూద్ మంచి ప్రదర్శన చేశాడు. దీంతో అతడికే తుది జట్టులో చోటు దక్కే అవకాశం దక్కే అవకాశం ఉందని అనుకుంటున్నారు.