ఏసీసీ అండర్-19 ఆసియాకప్‌లో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. అదిరిపోయే రీతిలో బోణీ కొట్టింది. రౌండ్ వన్‌లో పసికూన యూఏఈని చిత్తుగా ఓడించింది. ఆరంభ పోరులో 154 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. యువ ఓపెనర్ హనూర్ సింగ్ (120; 130 బంతుల్లో 11x4) శతకంతో దుమ్మురేపాడు. కెప్టెన్ యశ్ ధుల్ (63; 68 బంతుల్లో 4x4) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా దుమ్మురేపింది. 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 282 పరుగులు చేసింది. ఓపెనర్ అంగ్‌క్రిష్ (2) త్వరగా ఔటైనా మరో ఓపెనర్ హనూర్ సింగ్ మాత్రం దంచికొట్టాడు. యూఏఈ బౌలర్లను ఆటాడుకున్నాడు. అతడికి షేక్ రషీద్ (35), కెప్టెన్ యశ్ అండగా నిలిచారు. జట్టు స్కోరు 215 వద్ద హనూర్, 216 వద్ద నిషాంత్ (0) ఔటైన తర్వాత రాజ్‌వర్ధన్ (48*; 23 బంతుల్లో 6x4, 2x6) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. భారత్‌ను కట్టడి చేసేందుకు యూఏఈ తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించింది.
ఆ తర్వాత ఛేదనకు దిగిన యూఏఈని భారత బౌలర్లు సమష్టిగా అడ్డుకున్నారు. వేగంగా వికెట్లు తీశారు. రాజ్‌వర్ధన్ (3), గార్వ్ సంగ్వాన్ (2), విక్కీ ఓత్సవల్ (2), కుశాల్ తంబె (2) ప్రత్యర్థి నడ్డి విరిచారు. కేవలం 34.3 ఓవర్లకే 128కే ఆలౌట్ చేశారు. కాయ్ స్మిత్ (45), సూర్య సతీశ్ (21) మాత్రమే ఫర్వాలేదనిపించారు.
Also Read: IND vs SA: తొలిటెస్టుకు టీమ్‌ఇండియా జట్టు ఇలాగే ఉండొచ్చు..! విశ్లేషకుల అంచనా ఇదే
Also Read: India vs South Africa: హైదరాబాదీ సిరాజ్‌పై సచిన్ ప్రశంసలు.. ఎందుకంటే?
Also Read: IPL Auction 2022: ఐపీఎల్ వేలం తేదీలు వచ్చేశాయి..! ఫిబ్రవరిలోనే.. బెంగళూరులో
Also Read: Asian Champions Trophy Hockey 2021: పాకిస్థాన్ పై భారత్ గెలుపు.. ఖాతాలోకి కాంస్య పతాకం
Also Read: Virat Kohli Record: సఫారీ సిరీసులో కోహ్లీ బద్దలు కొట్టబోయే రికార్డులివే..! వందో టెస్టు..!