టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో కీలకమైన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. ఈ టోర్నీలో భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. మరి భారత్ పాయింట్ల పట్టికలో ఏ స్థానంలో ఉంది? టీమిండియా సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగా ఉన్నాయా? సమీకరణాలు ఎలా ఉన్నాయి?


పాయింట్ల పట్టికలో భారత్ ఏ స్థానంలో ఉంది?
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన పాకిస్తాన్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఆఫ్ఘనిస్తాన్ రెండో స్థానంలో ఉంది. ఈ విజయంతో న్యూజిలాండ్ మూడో స్థానానికి చేరుకుంది. నాలుగో స్థానంలో నమీబియా, ఐదో స్థానంలో టీమిండియా ఉండగా.. ఆరో స్థానంలో స్కాట్లాండ్ ఉంది.


టీమిండియా సెమీస్ అవకాశాలు సజీవంగా ఉన్నాయా?
ప్రస్తుతానికి టీమిండియా సెమీస్‌కు చేరే దారి పూర్తిగా ముగిసిపోయిందని చెప్పలేం. ఎందుకంటే భారత్ ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో గెలవడంతో పాటు.. మిగతా జట్లు ఆడాల్సిన ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. అవి కూడా టీమిండియాకు అనుకూలంగా వస్తే.. సెమీస్‌కు వెళ్లే అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి.


సమీకరణాలు ఎలా ఉన్నాయి?
అయితే సమీకరణాలే టీమిండియాకు చాలా ప్రతికూలంగా ఉన్నాయి. ఎందుకంటే భారత్ సెమీస్‌కు వెళ్లాలంటే ఆఫ్ఘన్, స్కాట్లాండ్, నమీబియాల్లో ఒక జట్టు న్యూజిలాండ్‌పై కచ్చితంగా గెలవాలి. దీంతోపాటు భారత్ తన మిగతా మూడు మ్యాచ్‌లను భారీ తేడాతో గెలిచి నెట్ రన్‌రేట్‌ను కూడా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది చూడటానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే న్యూజిలాండ్ ప్రస్తుతం ఉన్న ఫాంకి ఈ మూడు మ్యాచ్‌ల్లో గెలవడం చాలా సులభంగానే కనిపిస్తుంది. అయితే ఇది సాధ్యం అయి టీమిండియా ముందుకు వెళ్లాలని కోరుకుందాం!






Also Read: వరల్డ్‌క్లాస్ టీం.. వరస్ట్ పెర్ఫార్మెన్స్.. ఎనిమిది వికెట్లతో టీమిండియా చిత్తు


Also Read: Puneeth Rajkumar Death: నువ్విక లేవని తెలిసి.. త్వరగా వెళ్లావని తలచి..! కన్నీటి సముద్రంలో మునిగిన క్రికెటర్లు!


Also Read: IPL 2022 Retention Rules: కొత్త రూల్స్‌ ఇవే! ఐపీఎల్‌ జట్లు ఎంతమందిని అట్టిపెట్టుకోవచ్చంటే..?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి