India Open Badminton 7 Players test positive: ఇండియా ఓపెన్‌కు కరోనా సెగ తగిలింది. కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో దాదాపుగా ఏడుగురు క్రీడాకారులు టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఈ మేరకు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (BWF) అధికారిక ప్రకటన విడుదల చేసింది. నిబంధనల ప్రకారం ఆ క్రీడాకారులు పేర్లను వెల్లడించలేదు. బయో బుడగలు ఏర్పాటు చేశారు కాబట్టి మ్యాచులు యథాతథంగానే జరగనున్నాయి.







'మంగళవారం నిర్వహించిన తప్పనిసరి పరీక్షల్లో కొందరు క్రీడాకారులకు పాజిటివ్‌ వచ్చింది. కొవిడ్‌ సోకిన ఏడుగురితో సన్నిహితంగా మెలగిన డబుల్స్‌ షట్లర్లు సైతం టోర్నీ నుంచి తప్పుకున్నారు. ప్రధాన డ్రాలో వారి స్థానంలో వేరే వాళ్లను తీసుకోలేదు. వారితో ఆడాల్సిన ప్రత్యర్థులకు వాకోవర్‌ ఇస్తున్నాం' అని టోర్నీ నిర్వాహకులు తెలిపారు.


ఇండియా ఓపెన్‌లో గురువారం కీలక మ్యాచులు ఉన్నాయి. టాప్‌ సీడ్స్‌తో పాటు మరో 12 మంది భారతీయులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. దిల్లీలోని కేడీ జాదవ్‌ ఇండోర్‌ హాల్‌లో మ్యాచులు జరుగుతున్నాయి. పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, సమీర్‌ వర్మ, కిదాంబి శ్రీకాంత్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, లక్ష్యసేన్‌కు మ్యాచులు ఉన్నాయి.






Also Read: IPL New Sponsor: వివో ఔట్‌! ఇకపై 'టాటా ఐపీఎల్‌'! చైనా కంపెనీకి గుడ్‌బై!!


Also Read: IPL Auction 2022 Date: క్రికెటర్లూ కాచుకోండి! ఇక డబ్బుల పండగే!! ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్‌ మెగా వేలం


Also Read: Tata Group IPL Sponsor: మైదానంలో సిక్సర్ల వర్షం.. బీసీసీఐకి కాసుల వర్షం..! టాటా రావడంతో బోర్డుకు ఎంత డబ్బు వస్తోందంటే?


పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో డెన్మార్‌కు చెందిన కిమ్‌ బ్రూన్‌తో కిదాంబి శ్రీకాంత్‌ తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 12కు మొదలవుతుంది. మూడో సీడ్‌ లక్ష్యసేన్‌ స్వీడన్‌ షట్లర్‌ ఫెలిక్స్‌ బురెస్ట్‌డ్‌తో పోటీపడతాడు. ఆరో సీడ్‌ సమీర్‌ వర్మ కెనడా ఆటగాడు బ్రియాన్‌ యంగ్‌తో పోరుకు సై అంటున్నాడు. అన్‌సీడెడ్‌ సహచరుడు మిథున్‌ మంజునాథన్‌తో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తలపడతాడు.


ఇక మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో ఇరా శర్మతో పీవీ సింధు, మాళవిక బన్సోడ్‌తో సైనా నెహ్వాల్‌, యెల్‌ హోయాక్స్‌తో అష్మిత చాలిహ ఆడనున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి, మహిళల డబుల్స్‌లో అశ్విన్‌ పొన్నప్ప, సిక్కిరెడ్డి జోడీలు తమ ప్రత్యర్థులతో తలపడతాయి.