క్రికెట్‌ అభిమానులకు శుభవార్త! టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వచ్చేస్తున్నాడని తెలిసింది. ఈ వారం చివర్లో అతడికి ఫిట్‌నెస్‌ పరీక్ష ఉంది. అందులో ఉత్తీర్ణత సాధిస్తే పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం ఖాయం.


దక్షిణాఫ్రికా పర్యటనలో రోహిత్‌ శర్మ లోటు స్పష్టంగా కనిపించింది. పూర్తి స్థాయి కెప్టెన్‌ లేకపోవంతో మైదానంలో టీమ్‌ఇండియా దిశానిర్దేశం లేకుండా సాగింది. కేఎల్‌ రాహుల్‌ నాయకత్వం వహించినప్పటికీ చురుగ్గా నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. సఫారీలతో మూడు వన్డేల్లో ఒక్కదాంట్లోనూ గెలిపించలేకపోయాడు. దాంతో ఆతిథ్య జట్టుపై మనల్ని 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసేసింది. జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌ సేవలను సరిగ్గా వినియోగించుకోలేక పోయాడు. బీసీసీఐ కూడా ఈ ఓటమిపై నిరాశగా కనిపిస్తోంది.


Also Read: Gambhir Corona Positive: గౌతమ్ గంభీర్‌కు కరోనా పాజిటివ్.. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని ట్వీట్ 


Also Read: IPL Lucknow Team: ఆ జట్టు పాత పేరునే కొత్త జట్టుకు.. లక్నో టీం పేరు ఫిక్స్!


Also Read: Virat Kohli: కోహ్లీపై మండిపడుతున్న నెటిజన్లు... ఇదేం పని అంటూ ఆగ్రహం...!


'రాహుల్‌ ద్రవిడ్‌ ఇప్పుడే వచ్చారు. ఈ వారంలోనే సెలక్షన్‌ కమిటీ సమావేశం నిర్వహిస్తాం. వెస్టిండీస్‌ పర్యటనకు జట్టును ప్రకటిస్తాం' అని సెలక్షన్‌ కమిటీ వర్గాలు మీడియాకు తెలిపాయి. రోహిత్‌ రాక కోసం తాము కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తామని వారు అంటున్నారు. 'ఇప్పుడు రోహిత్‌ శర్మ అత్యంత కీలకమైన ఆటగాడు. అతడి గాయం గురించి ఎక్కువగా ఆందోళన చెందడం లేదు. అతడు కోలుకున్నాడు. అతడి పునరాగమనం కోసం ఎదురు చూస్తున్నాం. అతడి ఫిట్‌నెస్‌ నివేదిక రావాల్సి ఉంది. ఏదేమైనా అతడొచ్చి జట్టును నడిపించాలని కోరుకుంటున్నాం' అని ఆ వర్గాలు తెలిపాయి.


'దక్షిణాఫ్రికాతో పరాభవం అరుదైనది. ప్రస్తుత జట్టు కలిసి ఎక్కువగా వన్డేలు ఆడలేదు. మనం ఎక్కడున్నామో వెస్టిండీస్‌ సిరీసే చెబుతుంది. దానిని అనుసరించి ఓ నిర్ణయం తీసుకుంటాం. రాహుల్‌తో సహా ఆటగాళ్లంతా ఎక్కడ విఫలమయ్యారో తెలుసుకుంటాం. వన్డే ప్రపంచకప్‌నకు ఇదే మొదటి సన్నాహకం. రోహిత్‌ మిస్సవ్వడమే ఇక్కడ బిగ్‌ ఫ్యాక్టర్‌. వెస్టిండీస్‌ సిరీసు తర్వాత చూడాలి మరి' అని సెలక్షన్‌ వర్గాలు అంటున్నాయని తెలిసింది.