Stock market Update: వరుస నష్టాలకు చెక్! భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం స్మార్ట్ రికవరీ అయ్యాయి. కీలక సూచీలన్నీ లాభాల్లోనే ముగిశాయి. వారం రోజులుగా పతనమైన సూచీలకు నేడు మద్దతు లభించింది. ఐటీని మినహాయిస్తే మిగతా రంగాల సూచీలన్నీ లాభపడ్డాయి.
క్రితం రోజు 57,491 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,158 వద్ద గ్యాప్‌డౌన్‌తోనే ఆరంభమైంది. ఇంట్రాడేలో 56,409 వద్ద కనిష్ఠానికి చేరుకుంది. ఐరోపా మార్కెట్లు లాభపడటంతో పుంజుకున్న సూచీ అక్కడి నుంచి పై స్థాయిలకు చేరుకుంది. 57,966 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరికి 366 పాయింట్ల లాభంతో 57,858 వద్ద ముగిసింది.
సోమవారం 17,149 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,001 వద్ద గ్యాప్‌డౌన్‌తో ఆరంభమైంది. 16,836 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. అక్కడి నుంచి పుంజుకున్న సూచీ 17,309 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 128 పాయింట్ల లాభంతో 17,277 వద్ద ముగిసింది.
బ్యాంకు నిఫ్టీ ఏకంగా 759 పాయింట్లు లాభపడింది. ఉదయం 36,598 వద్ద నష్టాల్లోనే మొదలైన సూచీ 36,415 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత పుంజుకొని 37,788 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 37,706 వద్ద ముగిసింది.
నిఫ్టీలో 36 కంపెనీలు లాభాల్లో 14 నష్టాల్లో ముగిశాయి. మారుతీ, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, యూపీఎల్ భారీగా లాభపడ్డాయి. విప్రో, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్, అల్ట్రాసెమ్‌కో, టెక్ మహీంద్రా నష్టపోయాయి. పవర్, పీఎస్‌యూ బ్యాంక్, ఆటో, బ్యాంకు రంగాల షేర్లు 2-4 శాతం పెరిగాయి.
Also Read: Nirmala Sitharaman Profile: పేరే.. 'నిర్మల'! ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో 'మదురై మీనాక్షి'!!
Also Read: Tata Punch Price Cut: గుడ్‌న్యూస్.. టాటా పంచ్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే?