టాటా మోటార్స్ ఇటీవలే మనదేశంలో కార్ల ధరలు పెంచిన సంగతి తెలిసిందే. ముడివస్తువుల ధరలు పెరగడంతో టాటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో టాటా పంచ్ ధర కూడా మనదేశంలో రూ.16,000 వరకు పెరిగింది. ఇంతకు ముందుకు టాటా పంచ్ ధర రూ.5.49 లక్షల నుంచి ప్రారంభం కానుండగా.. ఇప్పుడు రూ.5.65 లక్షల నుంచి ప్రారంభం కానుంది.
అయితే ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ ధరను కంపెనీ తగ్గించింది. దీని ధర రూ.8.49 లక్షల నుంచి రూ.8.4 లక్షలకు తగ్గింది. టాటా పంచ్ క్రియేటివ్ ఆటోమేటిక్ ధర కూడా రూ.9.09 లక్షల నుంచి రూ.8.99 లక్షలకు తగ్గింది. టాటా పంచ్ క్రియేటివ్ ఐఆర్ఏ వేరియంట్ ధర కూడా రూ.8.79 లక్షల నుంచి రూ.8.7 లక్షలకు తగ్గింది.
ఇక పంచ్ క్రియేటివ్ ఐఆర్ఏ ఏఎంటీ వేరియంట్ ధర రూ.9.39 లక్షల నుంచి రూ.9.29 లక్షలకు తగ్గింది. ఇవన్నీ ఎక్స్-షోరూం ధరలే. దీన్ని బట్టి టాటా పంచ్ టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.10 వేల వరకు తగ్గాయని చెప్పవచ్చు.
టాటా పంచ్ క్రియేటివ్ వేరియంట్లో ఏడు అంగుళాల టచ్ స్క్రీన్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టం, ఐఆర్ఏ కనెక్టివిటీ సూట్, ఆటోమేటిక్ ఏసీ, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటోమేటిక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి.
టాటా పంచ్‌లో 1.2 లీటర్, త్రీ సిలిండర్ ఇంజిన్‌ను అందించారు. దీని బీహెచ్‌పీ 85 కాగా, పీక్ టార్క్ 113 ఎన్ఎంగా ఉంది. ఈ ఇంజిన్‌లో డైనా ప్రో టెక్నాలజీని అందించారు. ఇది మెరుగైన కంబస్చన్‌ను అందించనుంది. ఈ ఎస్‌యూవీలో ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, ఏఎంటీ వేరియంట్లు ఇందులో ఉన్నాయి.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?