భారతీయ జనతా పార్టీ గుర్తును చూసి ఫ్లవర్ అనుకుంటే కష్టమని..బీజేపీ అంటే ఫైర్ అని ఆ పార్టీ నేతలు ఏపీ సీఎం జగన్‌కు  హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలు  బహిరంగసభలో బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి అరుణ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ లో 1న జీతం, పించన్లు ఇవ్వడం లేదని.. ప్రభుత్వం దివాలా తీసిందని ఆయన ప్రకటించారు. చివరికి ఉద్యోగుల జీతాలు కూడా తగ్గించాలని..  ఇప్పటికైనా అధికారం ఇచ్చిన ప్రజలకు న్యాయం చేయాలన్నారు. బీజేపీ కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగితే సహించబోమని హెచ్చరించారు.


Also Read: ఇవిగో గుడివాడ కేసీనో ఆధారాలు... రిలీజ్ చేసిన టీడీపీ !


బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై  అన్యాయంగా రౌడీషీట్ ఓపెన్ చేయించారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దేశ ద్రోహి అని తీవ్రంగా విమర్శించారు.  కేసినో ఆడిస్తున్న మంత్రిని సస్పెండ్ చేయాలని.. కేసినో ఆడించడంపై ప్రభుత్వానికి బాగా మమకారం ఉందని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థ పనితీరు దారుణంగా ఉందని మరో నేత సీఎం రమేష్ విమర్శించారు. గుడివాడలో కేసినో నడిపినా పోలీస్ వ్యవస్థ ఏమి చేయలేకపోయిందన్నారు. దేశంలో ఎక్కడా ప్రభుత్వ వేతనాలు తగ్గించిన సందర్భాలు లేవని..ఏపీలో ఏమి చేసినా చెల్లుతుందని ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు.


Also Read: కేసినో పెట్టామని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా.. కొడాలి నాని సవాల్ !


వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరవాత బీజేపీ నేతలపై కేసులు పెట్టడం ఎక్కువైందని మరో ఎంపీ టీజీ వెంకటేషన్ విమర్శించారు. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం నిలదొక్కుకొని ఉందంటే బీజేపీ ఆశీర్వాదం వల్లే అని గుర్తించాలన్నాలనిమూడేళ్లు ముగిసింది...బీజేపీ ప్రతి కార్యకర్త పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ.. ఏపీలో విచ్చలవిడిగా జరుగుతున్న నేరాలపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.


Also Read: ‘మెప్పు కోసం విప్పుకొని తిరుగుతావా రాజా, ఏ1 చేతిలో తన్నులు తినకుండా చూస్కో..’ ట్విటర్‌లో వైసీపీ ఎంపీల రచ్చ


కరోనా నిబంధనల కారణంగా బీజేపీ కర్నూలు సభను పరిమితమైన జనసమీకరణతో నిర్వహించింది. అయితే రాష్ట్రంలోని అన్ని బీజేపీ ఆఫీసుల్లోనూ కార్యకర్తలు సభకు వర్చువల్‌గా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ముఖ్య నేతలందరూ సభలో ప్రసంగించారు. 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి