ముంబై బ్యూటీ ప్రగ్యాజైస్వాల్ టాలీవుడ్ లో హీరోయిన్ గా చెలామణి అవుతోంది. 'ఆచారి అమెరికా యాత్ర' సినిమా తరువాత ఈమెకి అవకాశాలు రాలేదు. దీంతో చాలా కాలం ఖాళీగానే ఉంది. సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేసుకుంటూ కాలం గడిపింది. అయితే బాలయ్య నటించిన 'అఖండ' సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. 


ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ బిగ్ బాస్ షోకి వెళ్లబోతుందని తెలుస్తోంది. రీసెంట్ గా ఈమె సల్మాన్ తో కలిసి ఓ పాటలో నటించింది. 'మే చలా..' అంటూ సాగే ఈ పాటను గురు రంధవా, లులియా వంతూర్ పాడారు. ఇటీవల విడుదలైన ఈ పాటకు శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మూడు నిమిషాల నిడివి గల ఈ పాటలో సల్మాన్, ప్రగ్యాల కెమిస్ట్రీ బాగా పండింది. 


ఇప్పుడు ఈ పాటను మరింతగా ప్రమోట్ చేయడానికి రెడీ అయ్యారు. సల్మాన్ హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ సీజన్ 15 స్టేజ్ పై కనిపించనుంది ప్రగ్యా. ఈ షోలో తన కోస్టార్ తో కలిసి 'మే చలా' సాంగ్ ను ప్రమోట్ చేయబోతుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెబుతూ.. కొన్ని ఫొటోలను షేర్ చేసింది ప్రగ్యా.  







Also Read: మహేష్ మరదలిగా మలయాళ బ్యూటీ.. త్రివిక్రమ్ తెగ ప్రమోట్ చేస్తున్నారుగా..


Also Read: నన్ను సినిమా నుంచి తప్పించాలని ఇరిటేట్ చేశారు.. రాజశేఖర్, జీవితలపై దర్శకుడి వ్యాఖ్యలు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి