పాయల్ రాజ్‌పుత్‌ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఈ ఏడాది ఆమె తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. 2022 మొదలై 25 రోజులు అయ్యింది. ఇప్పటి వరకూ బ్రేక్ తీసుకున్న పాయల్ రాజ్‌పుత్‌... ఈ రోజు కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. అది తెలుగు సినిమా షూటింగ్!


"లెట్స్ రోల్! చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. 2022లో నా ఫస్ట్ షూట్ ఇది. తెలుగులో కొత్త సినిమా స్టార్ట్ చేశాను. మీ అందరి ప్రేమ ప్రశంసలు, మద్దతు కావాలి" అని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే...  ఆ సినిమా ఏ సినిమా అనేది చెప్పలేదు. ఆది సాయి కుమార్ సరసన 'కిరాతక' అనే సినిమాలో ఆమె నటిస్తున్నారు. మరో రెండు మూడు సినిమాలు కూడా చేస్తున్నారు.


ఇటీవల ఆమె ఎల్లో సూట్ ఫొటోషూట్ వీడియో ఒకటి లీక్ అవ్వడంతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరిగింది. ఇతర మహిళలకు లేనిది ఏదో తనకు ఉన్నట్టు హడావిడి చేశారని, అది చూసి సినిమాలు మానేసి ఇంటికి వచ్చేయమని తన తల్లి చెప్పారని, అయితే అటువంటి విమర్శలను పట్టించుకోకుండా తాను ముందుకు వెళతానని పాయల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. 






Also Read: 'ఊ అంటావా మావ ఊఊ అంటావా' పాటకు మాధురీ దీక్షిత్ రీల్ చేస్తే... కన్ను కొట్టి రొమాన్స్ పండిస్తే?
Also Read: అల్లు అరవింద్‌కు రూ. 40 కోట్లు నష్టం... అల్లు అర్జున్ సినిమా హిందీ డబ్బింగ్ ఆపేయడానికి కారణం అదే!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.