వెన్నునొప్పి వల్ల టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వాండరర్స్‌ టెస్టుకు దూరమయ్యాడు. ఫలితంగా అభిమానులు తీవ్రంగా నిరాశకు గురయ్యారు. ఇది అతడి కెరీర్లో 99వ టెస్టు కావడమే ఇందుకు కారణం. ఈ టెస్టు ఆడుంటే త్వరగా అతడి వంద టెస్టుల ఘనతను అభిమానులు ఆస్వాదించేవారు. కానీ ఇప్పుడు అతడి వందో టెస్టు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు!

భారత క్రికెట్‌ చరిత్రలో తక్కువ వయసులోనే వంద టెస్టులకు చేరువైన క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీ ముందుంటాడు. సెంచూరియన్‌లో జరిగిన టెస్టు అతడి కెరీర్లో 98వది. ఇదే సిరీసులో జరిగే మూడో టెస్టు కెరీర్లో వందోది అవుతుంది. ఈ నేపథ్యంలో వాండరర్స్‌లో జరిగే 99వ టెస్టు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ మ్యాచులో ఫామ్‌లోకి వచ్చి సెంచరీ చేయాలని ఆశించారు. కానీ వారికి నిరాశే ఎదురైంది.

మ్యాచ్‌ తొలి రోజు కేఎల్‌ రాహుల్‌ టాస్‌కు వచ్చాడు. తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. తొలుత విరాట్‌ స్థానంలో రాహుల్‌ ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. అయితే విరాట్‌ వెన్నునొప్పితో బాధపడుతున్నాడని, ఫిజియోలు పర్యవేక్షిస్తున్నారని చెప్పడంతో విషయం తెలిసింది. ఐదు రోజుల్లో అతడు కోలుకుంటే దక్షిణాఫ్రికాతో మూడో టెస్టుకు సిద్ధమవుతాడు. దాంతో 99వ టెస్టు ముగుస్తుంది.

టీమ్‌ఇండియా 2022 షెడ్యూలు ప్రకారం దక్షిణాఫ్రికా సిరీసు తర్వాత కోహ్లీసేన భారత్‌కు తిరిగొస్తుంది. వెస్టిండీస్‌తో ఫిబ్రవరిలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత బెంగళూరులో శ్రీలంకతో తొలి టెస్టు ఆడుతుంది. ఇది కోహ్లీ వందో మ్యాచ్‌ అవుతుంది. మార్చి 5న, మొహాలిలో జరిగే టెస్టు 101వది అవుతుంది. అప్పటి వరకు అభిమానులు ఎదురు చూడక తప్పదు.

భారత్‌లో శ్రీలంక పర్యటన షెడ్యూలు25 February-1 March: 1st Test, BengaluruMarch 5-9: 2nd Test, MohaliMarch 13: 1st T20, MohaliMarch 15: Second T20, DharamsalaMarch 18: Third T20, Lucknow

Also Read: WATCH: 'మమ్మా..' అంటున్న వామిక! తపించి పోతున్న కోహ్లీ, అనుష్క

Also Read: Kohli on 100th Test: వందో టెస్టుకు మీడియా ముందుకు కోహ్లీ..! షాకింగ్‌ విషయాలు చెబుతాడా??

Also Read: Lionel Messi Covid Positive: మెస్సీకి కరోనా.. మరో ఇద్దరికి కూడా!

Also Read: IND vs SA 2nd Test: వాండరర్స్‌లో 'వండర్‌'కు సిద్ధమైన కోహ్లీ.. 7 పరుగులు చేస్తే ఆ రికార్డు బద్దలే!

Also Read: Team India Schedule 2022: ఏడాదంతా క్రికెట్‌ పండగే! టీమ్‌ఇండియాకు వరుసగా కీలక సిరీసులు.. ప్రపంచకప్‌

Also Read: Jasprit Bumrah: పేస్ బౌలర్లకు బాధ్యతలు ఎందుకు అప్పగించకూడదు.. అవసరమైతే బుమ్రాకు కెప్టెన్సీ