IND vs NZ, T20 LIVE: 14.3 ఓవర్లలో ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 111-2, ఎనిమిది వికెట్లతో న్యూజిలాండ్ విజయం

T20 WC 2021, Match 28, IND vs NZ: ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్‌లో ఇండియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి.

ABP Desam Last Updated: 31 Oct 2021 10:28 PM
14.3 ఓవర్లలో ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 111-2, ఎనిమిది వికెట్లతో న్యూజిలాండ్ విజయం

శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో మొదటి మూడు బంతుల్లోనే న్యూజిలాండ్ మ్యాచ్ ముగించింది. దీంతో వారి సెమీస్ అవకాశాలు మెరుగయ్యాయి.
డెవాన్ కాన్వే 2(4)
కేన్ విలియమ్సన్ 33(31)
శార్దూల్ ఠాకూర్ 1.3-0-17-0

14 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 108-2, లక్ష్యం 111 పరుగులు

హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ విజయానికి 36 బంతుల్లో మూడు పరుగులు కావాలి.
డెవాన్ కాన్వే 1(3)
కేన్ విలియమ్సన్ 31(29)
హార్దిక్ పాండ్యా 2-0-17-0

13 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 96-2, లక్ష్యం 111 పరుగులు

బుమ్రా వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. డేరిల్ మిషెల్ అవుటయ్యాడు. న్యూజిలాండ్ విజయానికి 42 బంతుల్లో 15 పరుగులు కావాలి.
డెవాన్ కాన్వే 0(2)
కేన్ విలియమ్సన్ 21(24)
బుమ్రా 4-0-19-2
డేరిల్ మిచెల్ (సి) రాహుల్ (బి) బుమ్రా (49: 35 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు)

12 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 94-1, లక్ష్యం 111 పరుగులు

హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ విజయానికి 48 బంతుల్లో 17 పరుగులు కావాలి.
డేరిల్ మిచెల్ 49(33)
కేన్ విలియమ్సన్ 20(22)
హార్దిక్ పాండ్యా 1-0-5-0

11 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 89-1, లక్ష్యం 111 పరుగులు

బుమ్రా వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ విజయానికి 54 బంతుల్లో 22 పరుగులు కావాలి.
డేరిల్ మిచెల్ 47(31)
కేన్ విలియమ్సన్ 17(18)
బుమ్రా 3-0-17-1

10 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 83-1, లక్ష్యం 111 పరుగులు

శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ విజయానికి 60 బంతుల్లో 28 పరుగులు కావాలి.
డేరిల్ మిచెల్ 46(30)
కేన్ విలియమ్సన్ 13(13)
వరుణ్ చక్రవర్తి 1-0-14-0

9 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 69-1, లక్ష్యం 111 పరుగులు

వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ విజయానికి 66 బంతుల్లో 42 పరుగులు కావాలి.
డేరిల్ మిచెల్ 32(24)
కేన్ విలియమ్సన్ 13(13)
వరుణ్ చక్రవర్తి 4-0-23-0

8 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 64-1, లక్ష్యం 111 పరుగులు

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ విజయానికి 72 బంతుల్లో 47 పరుగులు కావాలి.
డేరిల్ మిచెల్ 29(20)
కేన్ విలియమ్సన్ 11(11)
రవీంద్ర జడేజా 2-0-23-0

ఏడు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 55-1, లక్ష్యం 111 పరుగులు

మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ విజయానికి 78 బంతుల్లో 56 పరుగులు కావాలి.
డేరిల్ మిచెల్ 27(18)
కేన్ విలియమ్సన్ 4(7)
మహ్మద్ షమీ 1-0-11-0

పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 44-1, లక్ష్యం 111 పరుగులు

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ విజయానికి 84 బంతుల్లో 67 పరుగులు కావాలి.
డేరిల్ మిచెల్ 19(14)
కేన్ విలియమ్సన్ 2(5)
రవీంద్ర జడేజా 1-0-14-0

ఐదు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 30-1, లక్ష్యం 111 పరుగులు

వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ విజయానికి 90 బంతుల్లో 81 పరుగులు కావాలి.
డేరిల్ మిచెల్ 5(8)
కేన్ విలియమ్సన్ 2(5)
వరుణ్ చక్రవర్తి 3-0-18-0

నాలుగు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 28-1, లక్ష్యం 111 పరుగులు

బుమ్రా వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. మార్టిన్ గుప్టిల్ అవుటయ్యాడు. న్యూజిలాండ్ విజయానికి 96 బంతుల్లో 83 పరుగులు కావాలి.
డేరిల్ మిచెల్ 4(6)
కేన్ విలియమ్సన్ 1(1)
బుమ్రా 2-0-11-1
మార్టిన్ గుప్టిల్ (సి) ఠాకూర్ (బి) బుమ్రా (20: 17 బంతుల్లో, మూడు ఫోర్లు)

మూడు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 18-0, లక్ష్యం 111 పరుగులు

వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ విజయానికి 102 బంతుల్లో 93 పరుగులు కావాలి.
డేరిల్ మిచెల్ 1(5)
మార్టిన్ గుప్టిల్ 16(13)
వరుణ్ చక్రవర్తి 2-0-16-0

రెండు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 6-0, లక్ష్యం 111 పరుగులు

బుమ్రా వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. న్యూజిలాండ్ విజయానికి 108 బంతుల్లో 105 పరుగులు కావాలి.
డేరిల్ మిచెల్ 0(4)
మార్టిన్ గుప్టిల్ 5(8)
బుమ్రా 1-0-1-0

మొదటి ఓవర్ ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 5-0, లక్ష్యం 111 పరుగులు

వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ విజయానికి 114 బంతుల్లో 106 పరుగులు కావాలి.
డేరిల్ మిచెల్ 0(2)
మార్టిన్ గుప్టిల్ 4(4)
వరుణ్ చక్రవర్తి 1-0-4-0

20 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 110-7, న్యూజిలాండ్ లక్ష్యం 111 పరుగులు

టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. రెండో బంతికి జడేజా సిక్సర్ కొట్టాడు. న్యూజిలాండ్ విజయానికి 120 బంతుల్లో 111 పరుగులు కావాలి.
రవీంద్ర జడేజా 26(19)
షమీ 0(0)
టిమ్ సౌతీ 4-0-26-1

19 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 99-7

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. మొదటి బంతికి హార్దిక్ పాండ్యా నాలుగో బంతికి శార్దూల్ ఠాకూర్ అవుటయ్యాడు. ఐదో బంతికి జడేజా బౌండరీ సాధించాడు.
రవీంద్ర జడేజా 15(13)
షమీ 0(0)
ట్రెంట్ బౌల్ట్ 4-0-20-3
హార్దిక్ పాండ్యా (సి) గుప్తిల్ (బి) బౌల్ట్ (23: 24 బంతుల్లో, ఒక ఫోర్)
శార్దూల్ ఠాకూర్ (సి) గుప్తిల్ (బి) బౌల్ట్ (0: 3 బంతుల్లో)

18 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 94-5

ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. చివరి బంతికి జడేజా బౌండరీ సాధించాడు.
హార్దిక్ పాండ్యా 23(23)
రవీంద్ర జడేజా 10(11)
ఆడం మిల్నే 4-0-30-1

17 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 86-5

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. చివరి బంతికి హార్దిక్ బౌండరీ సాధించాడు.
హార్దిక్ పాండ్యా 21(20)
రవీంద్ర జడేజా 4(8)
ట్రెంట్ బౌల్ట్ 3-0-15-1

16 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 78-5

ఇష్ సోధి వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి.
హార్దిక్ పాండ్యా 15(17)
రవీంద్ర జడేజా 2(5)
ఇష్ సోధి 4-0-17-2

పంత్ అవుట్.. 15 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 73-5

ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. మూడో బంతికి పంత్ క్లీన్ బౌల్డయ్యాడు.
హార్దిక్ పాండ్యా 13(15)
రవీంద్ర జడేజా 0(1)
ఆడం మిల్నే 3-0-22-2
రిషబ్ పంత్ (బి) ఆడం మిల్నే (12: 19 బంతుల్లో)

14 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 67-4

ఇష్ సోధి వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి.
హార్దిక్ పాండ్యా 10(12)
రిషబ్ పంత్ 11(17)
ఇష్ సోధి 3-0-12-2

13 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 62-4

టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి.
హార్దిక్ పాండ్యా 8(10)
రిషబ్ పంత్ 9(13)
టిమ్ సౌతీ 3-0-15-1

12 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 58-4

మిషెల్ శాంట్నర్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి.
హార్దిక్ పాండ్యా 6(6)
రిషబ్ పంత్ 7(11)
మిషెల్ శాంట్నర్ 4-0-15-0

విరాట్ కోహ్లీ అవుట్.. 11 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 52-4

ఇష్ సోధి వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. మొదటి బంతికే కెప్టెన్ విరాట్ కోహ్లీ అవుటయ్యాడు.
హార్దిక్ పాండ్యా 2(2)
రిషబ్ పంత్ 5(9)
ఇష్ సోధి 2-0-8-2
విరాట్ కోహ్లీ (సి) ట్రెంట్ బౌల్ట్ (బి) ఇష్ సోధి (9: 17 బంతుల్లో)

10 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 48-3

మిషెల్ శాంట్నర్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి.
విరాట్ కోహ్లీ 9(16)
రిషబ్ పంత్ 3(6)
మిషెల్ శాంట్నర్ 3-0-9-0

తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 43-3

ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి.
విరాట్ కోహ్లీ 5(11)
రిషబ్ పంత్ 2(5)
ఆడం మిల్నే 2-0-17-0

రోహిత్ శర్మ అవుట్.. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 41-3

ఇష్ సోధి వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి రోహిత్ శర్మ అవుటయ్యాడు.
విరాట్ కోహ్లీ 4(8)
రిషబ్ పంత్ 1(2)
ఇష్ సోధి 1-0-4-1
రోహిత్ శర్మ (సి) గుప్తిల్ (బి) ఇష్ సోధి (14: 14 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)

ఏడు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 37-2

మిషెల్ శాంట్నర్ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి.
విరాట్ కోహ్లీ 1(6)
రోహిత్ శర్మ 14(12)
మిషెల్ శాంట్నర్ 2-0-4-0

పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 35-2

టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. మొదటి బంతిని ఫోర్ కొట్టిన రాహుల్ ఐదో బంతికి అవుటయ్యాడు.
విరాట్ కోహ్లీ 0(1)
రోహిత్ శర్మ 12(10)
టిమ్ సౌతీ 2-0-11-1
కేఎల్ రాహుల్ (సి) డేరిల్ మిషెల్ (బి) సౌతీ (18: 16 బంతుల్లో, మూడు ఫోర్లు)

ఐదు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 29-1

ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. మొదటి బంతిని రాహుల్ ఫోర్ కొట్టగా.. రోహిత్ ఐదో బంతిని ఫోర్, చివరి బంతిని సిక్సర్ కొట్టాడు.
కేఎల్ రాహుల్ 13(12)
రోహిత్ శర్మ 12(10)
ఆడం మిల్నే 1-0-15-0

నాలుగు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 14-1

మిషెల్ శాంట్నర్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. 
కేఎల్ రాహుల్ 8(10)
రోహిత్ శర్మ 2(6)
మిషెల్ శాంట్నర్ 1-0-2-0

ఇషాన్ కిషన్ అవుట్.. మూడు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 12-1

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. రెండో బంతికి బౌండరీ కొట్టిన ఇషాన్, ఐదో బంతికి అవుటయ్యాడు. రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చాడు. 
కేఎల్ రాహుల్ 7(9)
రోహిత్ శర్మ 1(1)
ట్రెంట్ బౌల్ట్ 2-0-7-1
ఇషాన్ కిషన్ (సి) డేరిల్ మిచెల్ (బి) బౌల్ట్ (4: 8 బంతుల్లో, ఒక ఫోర్)

రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 6-0

టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి.
ఇషాన్ కిషన్ 0(4)
కేఎల్ రాహుల్ 6(8)
టిమ్ సౌతీ 1-0-5-0

మొదటి ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 1-0

ఆశ్చర్యకరంగా రోహిత్ శర్మను పక్కనపెట్టి ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌కు వచ్చారు. బౌల్డ్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది.
ఇషాన్ కిషన్ 0(4)
కేఎల్ రాహుల్ 1(2)
ట్రెంట్ బౌల్డ్ 1-0-1-0

ఇండియా తుదిజట్టు

ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్ తుదిజట్టు

మార్టిన్ గుప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), జేమ్స్ నీషం, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్(వికెట్ కీపర్), మిషెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, ఆడం మిల్నే, ట్రెంట్ బౌల్ట్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్

అత్యంత కీలకమైన టాస్‌ను న్యూజిలాండ్ గెలుచుకుంది. టాస్ గెలిచిన కేన్ విలియమ్సన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.

మేం వచ్చేశాం

హలో దుబాయ్

Background

టీ20 వరల్డ్‌కప్‌లో నేడు జరగనున్న మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌తో తలపడనుంది. భారత్ సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. అయితే భారత్.. వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి 18 సంవత్సరాలు అయిపోతుంది. టీ20 వరల్డ్ ‌కప్‌లో అయితే ఇంతవరకు ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. 2007, 2016 సంవత్సరాల్లో టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో భారత్‌కు పరాజయమే ఎదురైంది.


విధ్వంసకరమైన బ్యాటర్లు, పటిష్టమైన బౌలర్లు, ప్రపంచస్థాయి ఫీల్డర్లు టీమిండియా సొంతం. అయితే అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్నట్లు అవసరం అయినప్పుడు వరుసగా వైఫల్యాలే వెక్కిరిస్తున్నాయి. పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లీ, పంత్ మినహా.. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. ఇక బౌలింగ్ యూనిట్ మాత్రం పూర్తిగా విఫలం అయింది. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్, రాహుల్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, జడేజా, హార్దిక్ అందరూ రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో బుమ్రా, షమీ, వరుణ్ చక్రవర్తి కీలకం కానున్నారు. హార్దిక్ పాండ్యా, భువీల్లో ఎవరినైనా పక్కన పెట్టి శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.


న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్టిన్ గుప్టిల్, కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే కీలకం కానున్నారు. బౌలింగ్‌లో కూడా టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, మిషెల్ శాంట్నర్ వంటి అత్యుత్తమ బౌలర్లు ఉన్నారు. కానీ పాకిస్తాన్ మీద వీరు కూడా విఫలం అయ్యారు. ట్రెంట్ బౌల్డ్ ఇదే పిచ్‌లపై ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. కేన్ విలియమ్సన్ ప్రస్తుతం ఫాంలో లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ రెండు జట్ల మధ్య ఇంతవరకు 22 మ్యాచ్‌లు జరగ్గా.. 11 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఏడు మ్యాచ్‌ల్లో ఇండియా విజయం సాధించగా.. నాలుగు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.


శుక్రవారం జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో పాక్.. నాటకీయ పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం సాధించింది. పాక్ విజయానికి చివరి 12 బంతుల్లో 24 పరుగులు సాధించాల్సి ఉండగా.. క్రీజులో ఇద్దరూ కొత్త బ్యాట్స్‌మెనే ఉన్నారు. దీంతో మొగ్గు ఆఫ్ఘనిస్తాన్ వైపే ఉంది. అయితే ఆసిఫ్ అలీ.. ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లతో మ్యాచ్‌ను గెలిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ విజయం సాధించి ఉంటే.. వాళ్లు కూడా సెమీస్ రేసులోకి వచ్చేవారు. పెద్ద జట్లయిన భారత్, న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌ల్లో ఒక్క దాంట్లో విజయం సాధించినా సెమీస్‌కు చేరేందుకు వారికే మంచి చాన్స్ ఉండేది. ఈ మ్యాచ్‌లో పాక్ విజయం సాధించడం కూడా ఒకరకంగా భారత్‌కు మంచి చేసినట్లే. పాకిస్తాన్ తర్వాతి మ్యాచ్‌లు నమీబియా, స్కాట్లాండ్‌లతో కాబట్టి.. పాక్ అజేయంగా సెమీస్‌కు చేరడం దాదాపు ఖాయమే.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.