2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..

ఇప్పుడంతా AI యుగం. ఏది కావాలన్నా చాట్ బోట్లు చెప్పేస్తున్నాయి. సొల్యూషన్స్ ఇచ్చేస్తున్నాయి. కొత్త ఏడాది వస్తోంది కదా.. వచ్చే ఏడాది జరగబోయే డవలప్మెంట్లు ఏంటని ChatGPTని  అడిగితే ఏం చెప్పిందో చూడండి.

Continues below advertisement

ఈ ఏడాదికి మరో నాలుగు రోజుల్లో గుడ్ బై చెబుతున్నాం. 2025 న్యూ ఇయర్‌కు  స్వాగతం పలకబోతున్నాం. మీడియా సంస్థలు ఈ ఏడాది జరిగిన మేజర్ సంఘటనలపై Lookback 2024 పేరుతో కథనాలు కూడా ఇచ్చేశాయి. కొత్త సంవత్సరంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయన్న అంచనాలు కూడా మనం చేస్తుంటాం. అయితే ఇప్పుడు ఏది కావాలన్నా AI టూల్స్, చాట్ బోట్లు చిటికెలో చేస్తున్నాయి కదా... వచ్చే ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సంఘటనలు, మార్పులు జరిగే అవకాశం ఉందని బాగా ఫేమస్ అయిన చాట్ బోట్,  ChatGPT ని అడిగాం. వచ్చే ఏడాది రాజకీయంగా, సామాజికంగా, సాంస్క్కృతికంగా జరగబోయే పది సంఘటనలను అంచనా వేయమని అడిగితే చాలా వరకూ వాస్తవానికి దగ్గరగా ఉండే అంచనాలే వచ్చాయి. కొన్ని సర్ ప్రైజింగ్ రిజల్ట్స్ కూడా కనిపించాయి. ఇవన్నీ కూడా చాట్ జీపీటీ ప్రిడిక్షన్స్ మాత్రమే.

Continues below advertisement

 

జై అమరావతి- రేవంత్ ట్రబుల్స్

1.అమరావతిని ఏపీ కేపిటల్‌గా మళ్లీ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు పెరుగుతాయి. అమరావతి పనులు వచ్చే ఏడాది మొదలు కాబోతున్నాయి. ఎన్నికల సమయానికి అమరావతిని ఫ్లాషింగ్ పాయింట్ గా ప్రొజెక్ట్ చేసే విధంగా పనులు చేస్తారు. ప్రాంతాల మధ్య ఇబ్బందులు రాకుండా ఉండటానికి వైజాగ్ ను ఐటీ హబ్‌గా చేసే ప్రయత్నం చేస్తారు.  జగన్‌కు రాజధానిపై మాట్లాడటం సెన్సిటివ్ అవుతుంది.

2.తెలంగాణ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం రేవంత్ రెడ్డికి కష్టం అవుతుంది. నిరుద్యోగులకు బెనిఫిట్స్ అందలేదని ఆందోళనలు మొదలవుతాయి. OUలో విద్యార్థులు ఆందోళన చేస్తారు.

3.బీఆర్ఎస్ ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తమను పట్టించుకోవడం లేదని కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్, బీజేపీల్లోకి వెళ్లే అవకాశం ఉంది.

4. తీవ్రంగా దెబ్బతిన్న పార్టీని నిలబెట్టేందుకు జగన్ మోహనరెడ్డి ప్రయత్నాలు చేస్తారు. 2025 మధ్యలో ఆయన భారీ ర్యాలీలు చేపట్టే అవకాశం ఉంది.

5. కూటమి అలయెన్స్ బంధం మరింత ధృఢం అవుతుంది. సొంతంగా ఎదగాలా.. కూటమిగా వెళ్లాలా అన్న డైలమా జనసేనలో ఉంటుంది. అయితే బీజేపీతో కలిసి కాపు- బ్రాహ్మిన్ బేస్ ను టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తాయి.

6.హైదరాబాద్ లో ఐటీ IT Expansion ర్యాపిడ్‌గా జరుగుతుంది. AI స్టార్టప్స్ వస్తాయి. టైర్-2 నగరాలైన వరంగల్, నిజామాబాద్‌లలో టెక్ పార్కులు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతాయి.

7.కృష్ణా జల వివాదానికి పరిష్కారం రాదు. నాగార్జునసాగర్, శ్రీశైలం నీళ్ల కేటాయింపులపై గొడవ మామూలే. కేంద్రం జోక్యం చేసుకోవలసిన పరిస్థితి వస్తుంది.

 

రాయలసీమకు ప్యాకేజి

 

8. రాయలసీమకు అన్యాయం జరుగుతోందన్న వాయిస్ పెరుగుతుంది. సీమకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలన్న డిమాండ్ మొదలవుతుంది. రాయలసీమలో జగన్ ప్రాబల్యం తగ్గించేందుకు కాంగ్రెస్ నాయకులు సీమకు ప్రత్యేక ప్యాకేజ్ డిమాండ్‌ను తీసుకురావొచ్చు.

 

చంద్రబాబు బయోపిక్

9 .తెలుగులో చంద్రబాబు బయోపిక్ కోసం ప్రయత్నాలు జరుగుతాయి. తెలుగు యాక్టర్లు చేసే సినిమాల్లో ముందు ముందు పొలిటికల్ కంటెంట్ పెరుగుతుంది

10. తెలుగు ఓటీటీల హవా పెరుగుతుంది. లోకల్ గా మరింత బోల్డ్ కంటెంట్‌తో సిరీస్‌లు వస్తాయి. Aha OTTలో  పొలిటికల్ డ్రామాతో వెబ్ సిరీస్ మొదలవుతుంది.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                             
 ChatGPT అనేది AI బేస్డ్ చాట్ బోట్. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది దైనందిక అవసరాలకు వాడుతున్న చాట్ బోట్. ఇది మనం ఇచ్చే ఇన్‌పుట్‌ అనుసరించి అప్పటి వరకూ తన మెమరీలో ఉన్న డేటాను విశ్లేషించి రిజల్ట్స్ ఇస్తుంది. ఇక్కడ ఇచ్చినవన్నీ పూర్తిగా కచ్చితంగా జరుగుతాయని కాదు. కాకపోతే.. ఇప్పుడు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వారిలో ఎక్కువ మంది చాటా జీపీటీని వాడుతున్నందున ఒక వేళ అది ఒక ప్రిడిక్షన్ ఇస్తే ఎలా ఉంటుందన్న ఊహతోనే చాట్ జీపీటీకి కమాండ్ ఇచ్చి ఈ సమాచారాన్ని రాబట్టడం జరిగింది. 

Continues below advertisement