Telangana TET 2024 Halltickets: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET)-2024 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుద‌ల‌య్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు జ‌ర్నల్ నంబ‌ర్, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 2 నుంచి 20 మధ్య టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేప‌ర్-1 ప‌రీక్షల‌ను నిర్వహించనున్నారు. పేప‌ర్ -2 ప‌రీక్షల‌ను జ‌న‌వ‌రి 2, 5, 11, 12, 19, 20వ తేదీల్లో నిర్వహించ‌నున్నారు. ఆయాతేదీల్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. టెట్‌(2)-2024 ఫలితాలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ప్రకటిస్తారు. 


టెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


విద్యాాశాఖ టెట్ హాల్‌టికెట్లను విడుదల చేసినప్పటికీ.. జ‌న‌వ‌రి 11న ఉదయం సెషన్, జ‌న‌వ‌రి 20న నిర్వహించే ఉద‌యం, మ‌ధ్యాహ్నం సెష‌న్లకు సంబంధించిన హాల్టికెట్లను అధికారులు విడుద‌ల చేయలేద‌ు. సాంకేతిక కార‌ణాల వ‌ల్ల ఆ మూడు సెష‌న్ల హాల్ టికెట్లను విడుద‌ల చేయ‌లేక‌పోతున్నామ‌ని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెష‌న్లకు సంబంధించిన హాల్‌టికెట్లను డిసెంబ‌ర్ 28 నుంచి అందుబాటులో ఉంటాయ‌ని అధికారులు స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబరు 26న టెట్ పరీక్ష హాల్‌టికెట్లు విడుద‌ల చేయాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఒకరోజు ఆలస్యంగా అంటే.. డిసెంబరు 27న సాయంత్రం హాల్‌టికెట్లను విడుద‌ల చేశారు. 


రాష్ట్రంలో టెట్ రెండో విడత నోటిఫికేషన్‌ను విద్యాశాఖ నవంబరు 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. నవంబరు 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు. టెట్-2 2024 పరీక్ష కోసం మొత్తం 2,48,172 దరఖాస్తులు దాఖలయ్యాయి. పేపర్‌-1కు 71,655, పేపర్‌-2కు 1,55,971, రెండు పేపర్లకు 20,546 దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 8 భాషల్లో టెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగుతోపాటు ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళ్, గుజరాతీ భాషల్లో పరీక్షలు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు టెట్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో అర్హత మార్కులను జనరల్ కేటగిరీకి 60%, బీసీ కేటగిరీకి 50%, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీకి 40%గా విద్యాశాఖ నిర్ణయించింది.  


TET Notification


Website


ALSO READ:


యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నిర్వహించనున్న యూజీసీ నెట్ (డిసెంబరు)-2024 పరీక్ష తేదీలను సబ్జెక్టుల వారీగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డిసెంబరు 20న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో జనవరి 3 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో నెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్‌లో; మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 85 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...