కాన్పూర్‌ టెస్టుపై అజింక్య సేన పట్టు బిగించింది. ప్రత్యర్థి న్యూజిలాండ్‌ ముందు 284 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. ఓవర్‌ నైట్‌ స్కోరు 14/1తో ఆదివారం బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌ 51/5తో కష్టాల్లో పడింది. శ్రేయస్‌ అయ్యర్ (65; 125 బంతుల్లో 8x4, 1x6), వృద్ధిమాన్‌ సాహా (61*; 126 బంతుల్లో 4x4, 1x6) అర్ధశతకాలతో ఆదుకున్నారు. డిక్లేర్‌ చేయగానే ఛేదనకు దిగిన కివీస్‌ 4 ఓవర్లు ఆడి 4/1తో నిలిచింది. టామ్‌ లేథమ్‌ (2 బ్యాటింగ్‌), నైట్ వాచ్‌మన్‌ సోమర్‌విలే (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఆ జట్టు విజయానికి ఇంకా 280 పరుగులు అవసరం.


ముందు విలవిల


ఓవర్‌ నైట్‌ స్కోరు 14/1తో టీమ్‌ఇండియా ఆదివారం ఆట మొదలు పెట్టింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (17; 53 బంతుల్లో 3x4), నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా (22; 33 బంతుల్లో 3x4) సానుకూల దృక్పథంతో ఆడారు. తొలి అర్ధగంట వరకు వీరిద్దరూ నిలకడగా ఆడుతూ రెండో వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యం అందించారు. కుదురుకున్న ఈ జోడీని పుజారాను ఔట్‌ చేయడం ద్వారా జేమీసన్‌ విడదీశాడు. అప్పటికి స్కోరు 32. మరికాసేపటికే అజాజ్‌ పటేల్‌ వేసిన బంతిని క్రీజులోంచి ఆడి అజింక్య రహానె (4; 15 బంతుల్లో 1x4) వెనుదిరిగాడు. ఇక జట్టు స్కోరు 51 వద్ద ఓకే ఓవర్లో మయాంక్‌ అగర్వాల్‌, రవీంద్ర జడేజా (0)ను టిమ్ సౌథీ పెవిలియన్‌ పంపించాడు. దాంతో టీమ్‌ఇండియా 51/5తో కష్టాల్లో పడింది.


సాహో.. శ్రేయస్‌!


ఈ క్రమంలో ముంబయి కుర్రాడు శ్రేయస్‌ అయ్యర్‌ అరుదైన రికార్డు అందుకున్నాడు. అరంగేట్రంలోనే శతకం, అర్ధశతకం చేసిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (32; 62 బంతుల్లో 5x4)తో కలిసి ఆరో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం అందించాడు. కష్టతరమైన బంతులను డిఫెండ్‌ చూస్తూ చక్కని బౌండరీలు బాదేశాడు. జట్టు స్కోరు 103 వద్ద యాష్‌ను జేమీసన్‌ బౌల్డ్‌ చేసినా శ్రేయస్‌ అర్ధశతకం బాదేశాడు. అతడికి వృద్ధిమాన్‌ సాహా జత కలిశాడు. గాయంతో నొప్పి వేధిస్తున్నా మొక్కవోని ధైర్యంతో బ్యాటింగ్‌ చేశాడు. ఏడో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 167 వద్ద శ్రేయస్‌ను సౌథీ ఔట్‌ చేశాక అక్షర్‌ పటేల్‌ (28*; 67 బంతుల్లో 2x4, 1x6) సాహాకు అండగా ఉన్నాడు. వీరిద్దరూ 67 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించడంతో టీమ్‌ఇండియా 234/7 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.






Also Read: IND vs NZ Kanpur Test: యాష్‌ నువ్వే భేష్‌..! బ్యాటర్ల బుర్రల్లో చిక్కుముళ్లు వేశావన్న వెటోరీ


Also Read: Kapil Dev: ముందు పాండ్యను బౌలింగ్‌ చేయనివ్వండి..! నా వరకైతే అశ్వినే మెరుగైన ఆల్‌రౌండర్‌


Also Read: Shreyas Iyer: నాలుగేళ్లుగా డీపీ మార్చని శ్రేయస్‌ తండ్రి..! కొడుకు సెంచరీకీ దానికీ లింకేంటి?


Also Read: IPL 2022 Auction: ముంబయి ఇండియన్స్‌ తీసుకుంటానన్నా.. నో.. నో అంటున్న స్టార్‌ ప్లేయర్‌


Also Read: Ind-Pak 2021 WC: రికార్డు బద్దలు కొట్టిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి