టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ప్రస్థానం విజయంతో ముగించింది. మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 132 పరుగులు చేయగా.. భారత్ ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో భారత్ తొమ్మిది వికెట్లతో విజయం సాధించింది. రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా ఇన్నింగ్స్ నాలుగు ఓవర్ల వరకు సాఫీగానే నడిచింది. మొదటి వికెట్‌కు 4.4 ఓవర్లలోనే 33 పరుగులు జోడించిన అనంతరం మైకేల్ వాన్ లింగెన్‌ను అవుట్ చేసి బుమ్రా భారత్‌కు మంచి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత జడేజా, అశ్విన్ కలిసి నమీబియాను తిప్పేశారు. వీరిద్దరూ చెరో మూడు వికెట్లు తీశారు. వీరు పరుగులు కూడా ఎక్కువ ఇవ్వలేదు. అశ్విన్ నాలుగు ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇవ్వగా.. జడేజా కేవలం 16 పరుగులే ఇచ్చాడు.
ఇన్నింగ్స్‌లో మొదటి వికెట్, ఎనిమిదో వికెట్‌ను బుమ్రా తీయగా.. మధ్యలో ఆరు వికెట్లను వీరిద్దరే తీశారు. నమీబియా బ్యాటర్లలో ఎవరూ క్రీజులో నిలవలేకపోయారు. దీంతో నమీబియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది.
133 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ(56: 37 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు), కేఎల్ రాహుల్ (54 నాటౌట్: 36 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 9.5 ఓవర్లలోనే 86 పరుగులు జోడించారు. అర్థ సెంచరీ సాధించిన కాసేపటికి రోహిత్ శర్మ భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు.
ఆ తర్వాత రాహుల్, సూర్యకుమార్ యాదవ్ (25 నాటౌట్: 19 బంతుల్లో, నాలుగు ఫోర్లు) కలిసి మ్యాచ్‌ను ముగించారు. నమీబియా బౌలర్లలో జాన్ ఫ్రైలింక్‌కు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ భారత్ ఇంటిబాట పట్టింది. అయితే విరాట్ కెప్టెన్‌గా వ్యవహరించిన చివరి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం తనకు కాస్త ఊరటనిచ్చే అంశం.
Also Read: టీ20 కెప్టెన్‌గా కోహ్లీ రికార్డులు ఇవే.. ఆ విషయంలో ఇప్పటికీ నంబర్ వన్
Also Read: Net Run Rate: ఈ వరల్డ్‌కప్‌లో అత్యంత కీలకమైన నెట్‌రన్‌రేట్ అంటే ఏంటి? దాన్ని ఎలా లెక్కిస్తారు?
Also Read: T20 World Cup 2021: ఘోరవైఫల్యానికి ఐదు కారణాలు.. ఓటమి నేర్పిన పాఠాలు ఇవే!
Also Read: NZ vs AFG, Match Highlights: అయిపాయె..! అటు టీమ్‌ఇండియా ఇటు అఫ్గాన్ ఔట్.. సెమీస్‌కు కివీస్