వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్ మాన్ ఎడిషన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన ప్రత్యేకమైన టీజర్ పేజీని కూడా కంపెనీ పబ్లిష్ చేసింది. వన్‌ప్లస్ నార్డ్ 2లో కొత్త వేరియంట్ లాంచ్ కానుందని దీన్ని బట్టి తెలుస్తోంది. వన్‌ప్లస్ నార్డ్‌కు తర్వాతి వెర్షన్‌గా వన్‌ప్లస్ నార్డ్ 2 లాంచ్ అయింది. ఈ సంవత్సరం జులైలోనే ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. వన్‌ప్లస్ నార్డ్ 2 కంటే వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్‌మాన్ ఎడిషన్ ధర ఎక్కువగా ఉంది.


వన్‌ప్లస్ నార్డ్ 2 పాక్‌మాన్ ఎడిషన్ ధర
వన్‌ప్లస్ నార్డ్ 2 పాక్‌మాన్ ఎడిషన్ ధర మనదేశంలో రూ.37,999గా ఉండనుంది. వన్‌ప్లస్ నార్డ్ 2 ధర రూ.27,999గా ఉండగా, కంపెనీ ఒకేసారి రూ.10 వేలు పెంచిందని అనుకోవచ్చు. దీని ర్యామ్, స్టోరేజ్ వేరియంట్ల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇది 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ అయ్యే అవకాశం ఉంది.


ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ గురించి కానీ, ఫీచర్ల గురించి కానీ కంపెనీ ఏమీ రివీల్ చేయలేదు. త్వరలో దీని గురించిన వివరాలు రివీల్ అయ్యే అవకాశం ఉంది. దీని టీజర్ పేజీ ప్రకారం ఇందులో ఒకప్పుడు లెజెండరీ గేమ్ అయిన పాక్ మ్యాన్ గేమ్ ఉండనుంది. ఈ ఫోన్‌లో ప్యాక్‌మాన్ థీమ్ ఉన్న వాల్ పేపర్లు, థీమ్స్ ఉండే అవకాశం ఉంది.


అలాగే ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ కూడా గేమ్‌కు తగ్గట్లే ఉండే అవకాశం ఉంది. దీని రిటైల్ బాక్స్ డిజైన్ కూడా ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉంది. తాజాగా వస్తున్న లీకుల ప్రకారం.. వన్‌ప్లస్ నార్డ్ 2 పాక్‌మాన్ లిమిటెడ్ ఎడిషన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ను అందించే అవకాశం ఉంది.


గతంలో లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ 2లో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌ను అందించారు. ప్రస్తుతానికి వన్‌ప్లస్ నార్డ్ 2 పాక్‌మాన్ ఎడిషన్ గురించి ఎక్కువ వివరాలు తెలియరాలేదు.


Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!


Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!


Also Read: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!


Also Read: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ధర ఎంత ఉండనుందంటే?


Also Read: రూ.16 వేలలో మంచి ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇదే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి