భారత క్రికెటర్ మహమద్ షమి పుట్టిన రోజు నిన్న(03-09-2021). 31వ పుట్టిన రోజును జరుపుకున్నాడు. ఆ సందర్భంగా BCCI, ICC,పలువురు మాజీ, సహచర క్రికెటర్లు షమికి సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Ind vs Eng: జార్వో మళ్లీ వచ్చాడు... ఈ సారి బౌలర్‌గా... ఎవర్ని ఔట్ చేసేందుకు అంటూ అభిమానుల కామెంట్స్
ప్రస్తుతం షమి... ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఓవల్ వేదికగా నాలుగో టెస్టు జరుగుతోంది. నాలుగో టెస్టు రెండో రోజు (శుక్రవారం) మైదానంలో ఫ్యాన్స్ కోరిక మేరకు షమి కేక్ కట్ చేశాడు.
నాలుగో టెస్టు కోసం కోహ్లీ ప్రకటించిన తుది జట్టులో షమికి చోటు దక్కలేదు. మధ్యలో సబ్‌స్టిట్యూట్‌గా షమి మైదానంలోకి రావడంతో బౌండరీ లైన్ వద్ద అభిమానులు కేక్ తీసుకువచ్చి కట్ చేయమని కోరారు. అభిమానుల కోరిక మేరకు షమి కేక్ కట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ అభిమాని Happy Birthday Shami అని తన చొక్కాపై రాసుకున్నాడు.
మహమ్మద్ షమి టీమిండియాలో కీలక బౌలర్. ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటనలో తొలి మూడు టెస్టులు ఆడిన 11 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. షమి మొత్తం టెస్టు కెరీర్లో ఇప్పటి వరకు 54 టెస్టుల్లో 195 వికెట్లను పడగొట్టాడు.
Also Read: Virat Kohli Instagram: సోషల్ మీడియాలో కోహ్లీ సూపర్ ఫామ్.. ఆ ఘనత సాధించిన తొలి ఆసియన్ సెలబ్రిటీ