Rinku Singh selected for T20 World Cup Reserve Player: న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ (BCCI) సెలక్షన్ కమిటీ ఆటగాళ్లను ఎంపిక చేసింది. 15 మంది ఆటగాళ్లతో పాటు నలుగురు రిజర్వ్ ప్లేయర్లను సైతం ప్రకటించింది. ఐపీఎల్ లో రాణించి ఆటగాడిగా పేరు తెచ్చుకున్న యంగ్ టాలెండ్ రింకూ సింగ్ తుది జట్టులో లేకపోవడంపై ఆయన తండ్రి ఖాన్ చంద్ర సింగ్ స్పందించారు. తుది జట్టులో తన కొడుకు రింకూ ఉన్నాడని భావించి సెలబ్రేషన్ కోసం పటాసులు, తీపి చేయడానికి స్వీట్లు కూడా తెచ్చామని తెలిపారు. 


జట్టులో లేనని తల్లికి చెప్పి బాధపడ్డ రింకూ సింగ్ 
టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు ప్లేయింగ్ 11లో ఉన్నాడని తాము సెలబ్రేషన్ చేసుకుంటుండగా రింకూ తన తల్లికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పాడని ఖాన్ చంద్ర సింగ్ అన్నారు. తుది జట్టులో తన పేరు లేదని చెప్పి బాధ పడ్డాడు. తుది 11 మందిలో తాను లేకపోవడంతో రింకూ సింగ్ గుండె ముక్కలైందంటూ కుమారుడి బాధను వెల్లడించారు. తాను జట్టులో లేనని తల్లికి చెప్పి రింకూ భావోద్వేగానికి లోనయ్యాడట. కానీ టీమిండియాతో తాను కూడా వెళ్లాల్సి ఉంటుందని చెప్పినట్లు గుర్తుచేశారు. అయితే ఇప్పుడే అంతా ముగిసిపోలేదని, ఎంతో బాధ ఉన్నప్పటికీ ఆశలు సజీవంగా ఉన్నాయన్నారు. భారత్ 24తో మాట్లాడుతూ రింకూ సింగ్ తండ్రి పలు విషయాలు షేర్ చేసుకోగా, సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఫైనల్ టీమ్ లో రింకూను సెలక్ట్ చేశారని భావించి తాము సెలబ్రేషన్ కోసం మిఠాయిలతో పాటు క్రాకర్స్ తెచ్చామని బాధగా చెప్పారు.



బీసీసీఐ సెలక్షన్ ప్యానల్ పై శ్రీకాంత్ మండిపాటు
టీ20 ప్రపంచ కప్ కోసం జరిగిన ఆటగాళ్ల ఎంపికపై పలువురు మాజీ దిగ్గజాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో రింకూకు చోటు లేకపోవడంపై 1983 వరల్డ్ కప్ విజేత కృష్ణమాచారి శ్రీకాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రింకూ సింగ్ దక్షిణాఫ్రికాలో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడని గుర్తుచేశారు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ 4 వికెట్లు కోల్పోయి 22 పరుగులకు పరిమితం కాగా, రోహిత్ శర్మ చేసిన గుర్తుందా? రింకూ సింగ్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో టీమ్ 212 పరుగులు చేసిందన్నారు. కింకూ సింగ్ టాలెంటెడ్ ప్లేయర్, ఇది చాలా చెత్త సెలక్షన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


టీమిండియా టీ20 వరల్డ్ కప్ ఆటగాళ్లు: రోహిత్ శర్మ (కెప్టెన్ ), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్) యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్ ), రిషబ్ పంత్ (వికెట్ కీపర్ ), శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్


రిజర్వ్ ఆటగాళ్లుగా బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, రింకు సింగ్ లతో పాటు బౌలర్లు ఖలీల్ అహ్మద్‌, అవేశ్‌ ఖాన్‌ లను బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు.


Also Read: ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌ను దెబ్బతీసింది ఐపీఎల్‌యేనా? అందుకే వరల్డ్‌కప్‌ టీంలో సెలెక్ట్ కాలేదా?