Shreyas Iyer And Ishan Kishan : ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌ను దెబ్బతీసింది ఐపీఎల్‌యేనా? అందుకే వరల్డ్‌కప్‌ టీంలో సెలెక్ట్ కాలేదా?

T 20 World Cup: బీసీసీఐ ప్రకటించిన టీ20 వరల్డ్ కప్ జట్టులో కొందరు క్రికెటర్లు ఎందుకు సెలెక్ట్ కాలేదు అన్నదే ఇంట్రెస్టింగ్ గా మారింది. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్

Continues below advertisement

Team India For T20 World cup 2024: టీ20 వరల్డ్ కప్ కోసం నిన్న బీసీసీఐ ప్రకటించిన  టీం ఇండియా జట్టును చూస్తే... ఎవరు సెలెక్ట్ అయ్యారు అన్నదానికంటే.. ఎవరు ఎందుకు సెలెక్ట్ కాలేదు అన్నదే ఇంట్రెస్టింగ్ గా మారింది. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లు. వీరిద్దరు ఐపీఎల్ లో సూపర్ ఫామ్ లో ఉన్నారా లేదా అన్నది పక్కన పెడితే.. వీళ్లను వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేయకపోవడానికి కారణం వాళ్లు చూపించిన బలుపే అంటున్నారు ఫ్యాన్స్. 

Continues below advertisement

బీసీసీఐ కాంట్రాక్టుల్లో ఉన్న ప్లేయర్స్ ఇంటర్నేషనల్ మ్యాచులు లేనప్పుడు డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి. ఇది రూల్. ఐతే.. గ‌తేడాది డిసెంబ‌ర్‌లో టీంఇండియా ద‌క్షిణాఫ్రికా టూర్‌లో ఉన్నప్పుడు వ్య‌క్తిగ‌త కార‌ణాలతో టూర్ మ‌ధ్య‌లో నుంచి ఇషాన్ తిరిగొచ్చేసాడు. ఈ టైంలో బీసీసీఐ రంజీ ట్రోపీలో ఆడమని చెప్పింది. కానీ మనోడు పట్టించుకోకుండా ఐపీఎల్ కోసం ముంబయి ఇండియ్స్ టీమ్ తరపున ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.

శ్రేయస్ అయ్యర్ కూడా అంతే. వెన్ను నొప్పి అనే రీజన్ చెప్పి..రంజీల్లో ఆడకుండా కేకేఆర్ జట్టుతో మింగిల్ అయ్యాడు. దీంతో.. ఆగ్రహించిన బీసీసీఐ వీళ్లను కాంట్రాక్ట్ లిస్ట్ లో నుంచి తీసేశారు. అలా..కాంట్రాక్ట్ లిస్టులో లేని ప్లేయర్స్ టీంఇండియాకు ఎంపిక అవ్వాలంటే... ఎక్స్రార్డినరీ ఫర్మామెన్స్ ఇవ్వాల్సిందే. ఐనా గ్యారెంటీ ఉండదు. బీసీసీఐ కాంట్రాక్ట్ ల్లో ఉన్న ప్లేయర్స్ ఏదైనా కారణాలతో ఇంటర్ నేషనల్ మ్యాచ్ లకు దూరంగా ఉంటే వాళ్ళను తిరిగి జట్టులోకి తీసుకోవటానికి వాళ్ళు దేశవాళిల్లో ఆడి మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకోవాలి.

వీళ్లిద్దరి విషయంలో అదే జరిగింది. కాబట్టి..ఐపీఎల్ డబ్బులు , నేమ్ అండ్ ఫేమ్ క్యాష్ చేసుకోవాలి. అంతేకానీ, ఐపీఎల్ ఫర్మామెన్స్ లతోనే టీంఇండియాలో చెలరేగిపోతామనుకుంటే నడవదు. ఎందుకంటే..ఐపీఎల్ ను యంగ్ టాలెంట్ అన్వేషణ కోసమే బీసీసీఐ పరిగణిస్తుంది. అంతేకానీ...మొత్తం ఐపీఎల్ మీదనే ఆధారపడి టీంఇండియాను ఎంపిక చేయట్లేదు. 

Continues below advertisement
Sponsored Links by Taboola