CSK vs PBKS  IPL 2024 Head to head Records : ఐపిఎల్  2024 49వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK), పంజాబ్ కింగ్స్(PBKS) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ రెండు జట్లూ భిన్నమైన ప్రయాణాన్ని సాగించాయి. చెన్నై తొమ్మిది మ్యాచుల్లో 5 విజయాలు సాధించగా... పంజాబ్‌ తొమ్మిది మ్యాచుల్లో కేవలం 3 విజయాలే సాధించింది. పాయింట్ల పట్టికలో చెన్నై మూడో స్థానంలో ఉండగా... పంజాబ్‌ ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లూ తమ గత మ్యాచ్‌ల్లో భారీ విజయం సాధించాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై చెన్నై 78 పరుగుల తేడాతో విజయం సాధించగా... గత మ్యాచ్‌లో పంజాబ్‌ కూడా ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. సొంత మైదానంలో కోల్‌కత్తాను ఓడించడమే కాకుండా లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరును చేధించారు. జానీ బెయిర్‌స్టో, ప్రబ్‌సిమ్రన్‌ సింగ్, శశాంక్ సింగ్‌లు మంచి ఫామ్‌లో ఉండడం పంజాబ్‌కు కలిసి వస్తోంది. ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ రెండు జట్లు సూపర్‌ ఓవర్‌లో కూడా తలపడ్డాయి. చెన్నై జట్టు MS ధోనీ, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఉన్నారు. పంజాబ్‌లో జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు. వీరులో ఇద్దరు నిలబడితే మ్యాచ్‌ ఏకపక్షంగా మారే అవకాశం ఉంది.


హెడ్‌ టు హెడ్‌ రికార్డ్స్‌
ఐపీఎల్‌లో పంజాబ్‌-చెన్నై 28 మ్యాచుల్లో తలపడ్డాయి. అయిదుసార్లు ఛాంపియన్‌ అయిన చెన్నై 15 విజయాలు సాధించింది. పంజాబ్‌ 13 విజయాలు సాధించింది. ఫలితం లేకుండా ఒక్క మ్యాచ్‌ కూడా ముగియలేదు. ఐపీఎల్‌లో పంజాబ్‌ తరఫున చెన్నైపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కేఎల్ రాహుల్. రాహుల్‌ 8 ఇన్నింగ్స్‌లలో 52.14 బ్యాటింగ్ సగటు, 149.59 స్ట్రైక్ రేట్‌తో 365 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. శిఖర్ ధావన్  చెన్నైపై అత్యధిక పరుగులు చేశాడు. 3 ఇన్నింగ్స్‌లలో 74.50 సగటు, 152.04 స్ట్రైక్ రేట్‌తో 149 పరుగులు చేశాడు. పంజాబ్‌ తరఫున పీయూష్ చావ్లా సీఎస్‌కేపై అత్యధిక వికెట్లు పడగొట్టాడు. 12 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీశాడు. ప్రస్తుత జట్టులో ఆర్ష్‌దీప్ సింగ్ చెన్నైపై అత్యధిక వికెట్లు సాధించాడు. 6 వికెట్లు తీశాడు. 


జట్లు 
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), MS ధోని, అరవెల్లి అవనీష్, అజింక్యా రహానే, షేక్ రషీద్, మొయిన్ అలీ, శివమ్ దూబే, RS హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ జాదవ్ మండల్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, మిచెల్ సాంట్నర్ , దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా, సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, శార్దూల్ ఠాకూర్, మహేశ్ తీక్షణ, సమీర్ రిజ్వీ.


పంజాబ్‌: శిఖర్ ధావన్ (కెప్టెన్‌), మాథ్యూ షార్ట్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడ్, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కావరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌ.