Zealand vs England 3rd Test | ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ లోన్యూజిలాండ్ కు ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటికే సిరీస్ ను 0-2తో కోల్పోయిన కివీస్.. మూడోటెస్టులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తుండగా, ఆ జట్టును బ్యాడ్ లక్ వెంటాడుతోంది. తాజాగా జట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అనుకోని రీతిలో ఔటయ్యాడు. డిఫెన్స్ ఆడిన బంతిని అనవసరంగా టచ్ చేసి బౌల్డయ్యాడు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్ ను అభిమానులు షేర్ చేస్తూ, పాపం కేన్ మామ అనుకుంటున్నారు. ఈ క్లిప్పింగ్ కు ఆదరణ దక్కడంతో వైరల్ గా మారింది.
బంతిని ఆపాలని చూసి..
ఇన్నింగ్స్ 59వ ఓవర్లో ఈ సంఘటన జరిగింది. అప్పటివరకు 44 పరుగులతో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు కేన్ మామ. ఇంతలో ఆ ఓవర్ చివరి బంతిని ఇంగ్లాండ్ పేసర్ మథ్యూ పాట్స్ వేయగా, ఢిఫెన్స్ కు విలియమ్సన్ ట్రై చేశాడు. అయితే బ్యాట్ ను తాకాని బంతి.. బౌన్స్ అవుతూ, వికెట్ల మీదికి వెళ్లింది. అయితే బంతి గమనాన్ని తప్పుగా అంచనా వేసిన కేన్.. బంతిని ముందుకు తోయడంతో అది నేరుగా వికెట్లను తాకింది. దీంతో బెయిల్స్ కింద పడటంతో కేన్ మామ నిరాశగా పెవిలియన్ కు చేరాడు. బంతిని తాకకుంటే అది వికెట్లపై నుంచి వెళ్లిపోయేదని క్లిప్పింగ్ చూసిన అభిమానులు చర్చించుకుంటున్నారు.
Also Read: Jasprit Bumrah: బ్రిస్బేన్ పిచ్‌పై బుమ్రా అసహనం - అవి లేవంటు కంప్లైంట్ ఇచ్చిన స్టార్ పేసర్
డబ్ల్యూటీసీ నుంచి ఔట్..
మరోవైపు ఈ టెస్టు ఫలితంతో సంబంధం లేకుండా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) నుంచి నిష్క్రమించాయి. ఇంగ్లాండ్ ఎప్పుడో ఔట్ కాగా, సొంతగడ్డపై భారత్ ను ఓడించి రేసులో న్యూజిలాండ్ నిలిచింది. అయితే ఇంగ్లాండ్.. న్యూజిలాండ్ ఆశలపై చావు దెబ్బ కొట్టింది. తొలి రెండు టెస్టుల్లో ఉక్కిరి బిక్కిరి చేసి కివీస్ ను మట్టి కరిపించింది. ఇది చాలదన్నట్లు స్లో ఓవర్ రేట్ కారణంగా కొన్ని పాయింట్ల కోత విధించడంతో డబ్ల్యూటీసీ పై కివీస్ కు ఉన్న ఆశలు ఆవిరయ్యాయి. దీంతో ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా రేసు నుంచి నిష్క్రమించాయి. ఇక శనివారం ప్రారంభమైన మూడో టెస్టు తొలిరోజు ఆటముసిసేసిరికి తొమ్మిది వికెట్లకు 315 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (63) కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించాడు. మిషెల్ సాంట్నర్ చివర్లో మెరుఫు ఫిఫ్టీతోసత్తా చాటాడు. విల్ యంగ్ కూడా 42 పరుగులతో రాణించాడు.
మరోవైపు ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసిన గస్ అట్కిన్సన్.. అరంగేట్ర ఏడాదిలో 50 టెస్టు వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. బ్రైడన్ కర్స్ కు రెండు వికెట్లు దక్కాయి.