Chinnaswamy Stadium Weather: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో వర్షాలు దంచి కొట్టాయి. జోరు వానకు చెన్నై, బెంగళూరు తడిసి ముద్దయ్యాయి. దీంతో బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో న్యూజిలాండ్, భారత్ మధ్య జరగాల్సిన మొదటి టెస్టు మ్యాచ్ మొదటి రోజు రద్దు అయింది. జోరు వాన కారణంగా కనీసం టాస్ కూడా వేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో మొదటి రోజు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.
ముందుగానే టాస్‌కు వేయాలని నిర్ణయం
బెంగళూరులో బుధవారం మధ్యాహ్నం నుంచి వర్షం కాస్త తగ్గడంతో మ్యాచ్ జరిపేందుకు యత్నించినట్టుప్పటికి అవుట్ ఫీల్డ్ బాగాలేదని ఆపేశారు. అందుకే రెండో రోజు మ్యాచ్‌ను త్వరగా స్టార్ట్ చేయాలని నిర్ణయించారు. లైట్ ఫెయిల్ అవుతుందని అందుకే 9.15కి మ్యాచ్ ప్రారంభించబోతున్నారు. అంటే 8.45కే టాస్ వేస్తారు.
చిన్న స్వామి స్టేడియ పరిసరాల్లో ఆకాశం మేఘావృతం
ప్రస్తుతానికి బెంగళూరులో వర్షం లేదు. ముఖ్యంగా చిన్న స్వామి స్టేడియం పరిసర ప్రాంతాల్లో వాతావరణం నార్మల్‌గానే ఉంది. అయితే మేఘావృతమై ఉన్నందున అప్పుడప్పుడూ మ్యాచ్‌కు చిరుజల్లులు అంతరాయం కల్పించే అవకాశం ఉందని అంటున్నారు. రెండో రోజు మ్యాచ్ జరగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
బెంగళూరులో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుంది?(bangalore weather today)
బెంగళూరులో వాతావరణం మేఘావృతమై ఉన్నందున వర్షం పడేందుకు 14% అవకాశం ఉంది. ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది. ఉదయం 10:00 గంటలకు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం 44% ఉంది. మధ్యాహ్నం 12:00 గంటలకు బెంగళూరులో వర్షం పడే అవకాశం 51% ఉంది. మధ్యాహ్నం 1గంటకు వర్షం పడే అవకాశం 38% ఉంది. సాయంత్రం అయ్యేసరికి వర్షం పడే అవకాశం 51% చేరుకుంటుంది.
కచ్చితంగా భారత్ గెలవాలని కోరుకుంటుంది ఎందుకు?
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా ఎనిమిది విజయాలతో భారత్ అగ్రస్థానంలో ఉంది. న్యూజిలాండ్ ఫామ్‌లో లేనందున ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే మరింత ముందుకు దూసుకెళ్లొచ్చు. ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా 8 మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి వాటిలో కచ్చితంగా మూడు విజయాలు సాధించాలి. WTC పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో భారత్ కంటే ఐదు టెస్టు విజయాలు వెనకుబడి ఉంది. ఇప్పుడు న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌ను భారత్ 3-0తో విజయం సాధిస్తే మాత్రం వచ్చే టెస్టుల్లో ఫలితాలు ఎలా ఉన్నా భారత్‌కు వచ్చే ప్రమాదం ఉండదు. WTC ఫైనల్‌లో ఆడే అవకాశాలకు డోకా ఉండదు. అందుకే కచ్చితంగా ఈ మూడు మ్యాచ్‌లు ఆడాలని భారత్ భావిస్తోంది.
బెంగళూరు టెస్టు డ్రా అయినట్లయితే ఈ సిరీస్‌లోని మిగిలిన రెండు టెస్టుల్లో న్యూజిలాండ్‌ను భారత్ ఓడించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఒకటి కచ్చితంగా గెలవాలి. అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఇది చాలా రిస్క్‌గానే చెప్పవచ్చు.
Also Read: నెల్లూరు జిల్లా తడ వద్ద తీరం దాటిన వాయుగుండం - బెంగళూరు, చెన్నైలో వాతావరణం ఎలా ఉంది?