IND vs PAK Asia Cup 2022 LIVE: పాక్‌పై థ్రిల్లింగ్ మ్యాచ్‌లో టీమిండియా సూపర్ విక్టరీ - చివర్లో పాండ్య, జడేజా షో!

IND vs PAK Asia Cup 2022 LIVE Score: దుబాయ్‌లో ఆసియాకప్‌లో భాగంగా జరుగుతున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ABP Desam Last Updated: 28 Aug 2022 11:44 PM
19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా - ఐదు వికెట్లతో ఘనవిజయం

మహ్మద్ నవాజ్ వేసిన 20వ ఓవర్లో నాలుగు బంతుల్లోనే మ్యాచ్ ముగిసిపోయింది. నాలుగో బంతికి సిక్సర్‌తో హార్దిక్ మ్యాచ్‌ను ముగించాడు.


హార్దిక్ పాండ్యా 33(17)
దినేష్ కార్తీక్ 1(1)
మహ్మద్ నవాజ్ 3.4-0-33-3
రవీంద్ర జడేజా (బి) మహ్మద్ నవాజ్ (35: 29 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు)

19 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 141-4

హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 141-4గా ఉంది.


రవీంద్ర జడేజా 35(28)
హార్దిక్ పాండ్యా 27(15)
హరీస్ రౌఫ్ 4-0-35-0

18 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 127-4

నసీం షా వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 127-4గా ఉంది.


రవీంద్ర జడేజా 34(27)
హార్దిక్ పాండ్యా 14(10)
నసీం షా 4-0-27-2

17 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 116-4

హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 17వ ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 116-4గా ఉంది.


రవీంద్ర జడేజా 24(21)
హార్దిక్ పాండ్యా 14(10)
హరీస్ రౌఫ్ 3-0-21-0

16 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 107-4

షానవాజ్ దహానీ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 107-4గా ఉంది.


రవీంద్ర జడేజా 22(19)
హార్దిక్ పాండ్యా 11(6)
షానవాజ్ దహానీ 4-0-29-0

15 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 97-4

నసీం షా వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యాడు. 15వ ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 97-4గా ఉంది.


రవీంద్ర జడేజా 19(16)
హార్దిక్ పాండ్యా 7(3)
నసీం షా 3-0-16-2
సూర్యకుమార్ యాదవ్ (బి) నసీం షా (18: 18 బంతుల్లో, ఒక ఫోర్)

14 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 89-3

షాహనాజ్ దహానీ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. 12వ ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 89-3గా ఉంది.


రవీంద్ర జడేజా 18(15)
సూర్యకుమార్ యాదవ్ 18(16)
షాహనాజ్ దహానీ 3-0-19-0

13 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 83-3

షాదబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. 12వ ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 83-3గా ఉంది.


రవీంద్ర జడేజా 16(12)
సూర్యకుమార్ యాదవ్ 15(13)
షాదబ్ ఖాన్ 4-0-19-0

12 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 77-3

మహ్మద్ నవాజ్ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. 12వ ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 77-3గా ఉంది.


రవీంద్ర జడేజా 15(9)
సూర్యకుమార్ యాదవ్ 10(10)
మహ్మద్ నవాజ్ 3-0-26-2

11 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 69-3

షాదబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. 11వ ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 69-3గా ఉంది.


రవీంద్ర జడేజా 9(6)
సూర్యకుమార్ యాదవ్ 8(7)
షాదబ్ ఖాన్ 3-0-13-0

10 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 62-3

మహ్మద్ నవాజ్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. విరాట్ కోహ్లీ అవుటయ్యాడు. 10వ ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 62-3గా ఉంది.


రవీంద్ర జడేజా 8(5)
సూర్యకుమార్ యాదవ్ 2(2)
మహ్మద్ నవాజ్ 2-0-18-2
విరాట్ కోహ్లీ (సి) ఇఫ్తికార్ అహ్మద్ (బి) మహ్మద్ నవాజ్ (35: 34 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్)

తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 53-2

షాదబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. తొమ్మిదో ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 53-2గా ఉంది.


విరాట్ కోహ్లీ 35(33)
రవీంద్ర జడేజా 1(2)
షాదబ్ ఖాన్ 2-0-6-0

ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 50-2

మహ్మద్ నవాజ్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. రోహిత్ శర్మ అవుటయ్యాడు. ఎనిమిదో ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 50-2గా ఉంది.


విరాట్ కోహ్లీ 33(29)
రవీంద్ర జడేజా 0(0)
మహ్మద్ నవాజ్ 1-0-9-1
రోహిత్ శర్మ (సి) ఇఫ్తికార్ అహ్మద్ (బి) మహ్మద్ నవాజ్ (12: 18 బంతుల్లో, ఒక సిక్సర్)

ఏడు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 41-1

షాదబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. ఏడో ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 41-1గా ఉంది.


రోహిత్ శర్మ 5(14)
విరాట్ కోహ్లీ 30(26)
షాదబ్ ఖాన్ 1-0-3-0

పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 38-1

హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. ఆరో ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 38-1గా ఉంది.


రోహిత్ శర్మ 4(11)
విరాట్ కోహ్లీ 29(24)
హరీస్ రౌఫ్ 2-0-13-0

ఐదు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 29-1

షానవాజ్ దహానీ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. ఐదో ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 29-1గా ఉంది.


రోహిత్ శర్మ 4(8)
విరాట్ కోహ్లీ 24(21)
షానవాజ్ దహానీ 2-0-13-0

నాలుగు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 23-1

హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. నాలుగో ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 23-1గా ఉంది.


రోహిత్ శర్మ 3(5)
విరాట్ కోహ్లీ 19(18)
హరీస్ రౌఫ్ 1-0-8-0

మూడు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 15-1

నసీం షా వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. మూడో ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 15-1గా ఉంది.


రోహిత్ శర్మ 2(3)
విరాట్ కోహ్లీ 12(14)
నసీం షా 2-0-8-1

రెండో ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 10-1

షానవాజ్ దహానీ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 10-1గా ఉంది.


రోహిత్ శర్మ 1(2)
విరాట్ కోహ్లీ 8(9)
షానవాజ్ దహానీ 1-0-7-0

మొదటి ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 3-1

నసీం షా వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. కేఎల్ రాహుల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మొదటి ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 3-1గా ఉంది.


రోహిత్ శర్మ 1(2)
విరాట్ కోహ్లీ 1(2)
నసీం షా 1-0-3-1
కేఎల్ రాహుల్ (బి) నసీం షా (0: 1 బంతి)

19.5 ఓవర్లలో పాకిస్తాన్ 147 ఆలౌట్, భారత్ లక్ష్యం 148

అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 19.5 ఓవర్లలో పాకిస్తాన్ 147 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ విజయానికి 120 బంతుల్లో 148 పరుగులు కావాలి.


హరీస్ రౌఫ్ 13(7)
అర్ష్‌దీప్ సింగ్ 3.5-0-33-2
షాహనాజ్ దహానీ (బి) అర్ష్‌దీప్ సింగ్ (16:6 బంతుల్లో, రెండు సిక్సర్లు)

19 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 136-9

భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. షాదబ్ ఖాన్, నసీం షా అవుటయ్యారు. 19వ ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 136-9గా ఉంది.


షానవాజ్ దహానీ 8(3)
హరీస్ రౌఫ్ 10(5)
భువనేశ్వర్ కుమార్ 3-0-22-1
షాదబ్ ఖాన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) భువనేశ్వర్ కుమార్ (10: 9 బంతుల్లో, ఒక ఫోర్)
నసీం షా (ఎల్బీడబ్ల్యూ) (బి) భువనేశ్వర్ కుమార్ (0: 1 బంతి)

18 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 124-7

అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. మహ్మద్ నవాజ్ అవుటయ్యాడు. 18వ ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 124-7గా ఉంది.


షాదబ్ ఖాన్ 6(7)
హరీస్ రౌఫ్ 10(5)
అర్ష్‌దీప్ సింగ్ 3-0-22-1
మహ్మద్ నవాజ్ (సి) దినేష్ కార్తీక్ (బి) అర్ష్‌దీప్ సింగ్ (1: 3 బంతుల్లో)

17 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 114-6

భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. ఆసిఫ్ అలీ అవుటయ్యాడు. 17వ ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 114-6గా ఉంది.


షాదబ్ ఖాన్ 6(7)
మహ్మద్ నవాజ్ 1(2)
భువనేశ్వర్ కుమార్ 3-0-14-2
ఆసిఫ్ అలీ (సి) సూర్యకుమార్ యాదవ్ (బి) భువనేశ్వర్ కుమార్ (9: 7 బంతుల్లో)

16 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 111-5

యుజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. 16వ ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 111-5గా ఉంది.


షాదబ్ ఖాన్ 4(4)
ఆసిఫ్ అలీ 9(6)
యుజ్వేంద్ర చాహల్ 4-0-32-0

15 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 103-5

హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. మహ్మద్ రిజ్వాన్, ఖుష్‌దిల్ షా అవుటయ్యారు. 15వ ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 103-5గా ఉంది.


షాదబ్ ఖాన్ 2(2)
ఆసిఫ్ అలీ 3(2)
హార్దిక్ పాండ్యా 4-0-25-3
మహ్మద్ రిజ్వాన్ (సి) అవేష్ ఖాన్ (బి) హార్దిక్ పాండ్యా (43: 42 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్)
ఖుష్‌దిల్ షా (సి) రవీంద్ర జడేజా (బి) హార్దిక్ పాండ్యా (2: 7 బంతుల్లో)

14 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 96-3

అవేష్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. 14వ ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 96-3గా ఉంది.


మహ్మద్ రిజ్వాన్ 43(41)
ఖుష్‌దిల్ షా 2(6)
అవేష్ ఖాన్ 2-0-19-1

13 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 90-3

హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. ఇఫ్తికర్ అహ్మద్ అవుటయ్యాడు. 13వ ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 90-3గా ఉంది.


మహ్మద్ రిజ్వాన్ 38(38)
ఖుష్‌దిల్ షా 1(3)
హార్దిక్ పాండ్యా 3-0-18-1తత
ఇఫ్తికార్ అహ్మద్ (సి) దినేష్ కార్తీక్ (బి) హార్దిక్ పాండ్యా (28: 22 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్)

12 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 87-2

యుజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 12వ ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 87-2గా ఉంది.


మహ్మద్ రిజ్వాన్ 36(36)
ఇఫ్తికార్ అహ్మద్ 28(21)
యుజ్వేంద్ర చాహల్ 3-0-24-0

11 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 76-2

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. 11వ ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 76-2గా ఉంది.


మహ్మద్ రిజ్వాన్ 35(35)
ఇఫ్తికార్ అహ్మద్ 18(16)
రవీంద్ర జడేజా 2-0-11-0

10 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 68-2

యుజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. పదో ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 68-2గా ఉంది.


మహ్మద్ రిజ్వాన్ 29(31)
ఇఫ్తికార్ అహ్మద్ 16(14)
యుజ్వేంద్ర చాహల్ 2-0-13-0

తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 63-2

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. తొమ్మిదో ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 63-2గా ఉంది.


మహ్మద్ రిజ్వాన్ 26(28)
ఇఫ్తికార్ అహ్మద్ 14(11)
రవీంద్ర జడేజా 1-0-3-0

ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 59-2

యుజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ఎనిమిదో ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 59-2గా ఉంది.


మహ్మద్ రిజ్వాన్ 24(25)
ఇఫ్తికార్ అహ్మద్ 13(8)
యుజ్వేంద్ర చాహల్ 1-0-8-0

ఏడు ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 51-2

హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ఏడో ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 51-2గా ఉంది.


మహ్మద్ రిజ్వాన్ 22(22)
ఇఫ్తికార్ అహ్మద్ 7(5)
హార్దిక్ పాండ్యా 2-0-15-0

పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 43-2

అవేష్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. ఫకార్ జమాన్ అవుటయ్యాడు. ఆరో ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 43-2గా ఉంది.


మహ్మద్ రిజ్వాన్ 9(17)
ఇఫ్తికార్ అహ్మద్ 1(1)
అవేష్ ఖాన్ 1-0-13-1
ఫకార్ జమాన్ (సి) దినేష్ కార్తీక్ (బి) అవేష్ ఖాన్ (10: 6 బంతుల్లో, రెండు ఫోర్లు)

ఐదు ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 30-1

హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. ఐదో ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 30-1గా ఉంది.


మహ్మద్ రిజ్వాన్ 9(17)
ఫకార్ జమాన్ 9(4)
హార్దిక్ పాండ్యా 1-0-7-0

నాలుగు ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 23-1

అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. నాలుగో ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 23-1గా ఉంది.


మహ్మద్ రిజ్వాన్ 7(13)
ఫకార్ జమాన్ 4(2)
అర్ష్‌దీప్ సింగ్ 1-0-8-0

మూడు ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 19-1

భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. కీలకమైన బాబర్ ఆజం వికెట్‌ను భువీ పడగొట్టాడు. మూడో ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 19-1గా ఉంది.


మహ్మద్ రిజ్వాన్ 3(7)
ఫకార్ జమాన్ 4(2)
భువనేశ్వర్ కుమార్ 1-0-8-0
బాబర్ ఆజం (సి) అర్ష్‌దీప్ సింగ్ (బి) భువనేశ్వర్ (10: 9 బంతుల్లో, రెండు ఫోర్లు)

రెండు ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 14-0

అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. రెండో ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 14-0గా ఉంది.


మహ్మద్ రిజ్వాన్ 2(5)
బాబర్ ఆజం 10(7)
అర్ష్‌దీప్ సింగ్ 1-0-8-0

మొదటి ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 6-0

భువనేశ్వర్ వేసిన మొదటి ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 6-0గా ఉంది.


మహ్మద్ రిజ్వాన్ 1(4)
బాబర్ ఆజం 5(2)
భువనేశ్వర్ కుమార్ 1-0-6-0

పాకిస్తాన్ తుదిజట్టు

బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫకార్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్‌దిల్ షా, ఆసిఫ్ అలీ, షాదబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, నసీం షా, హరీస్ రవూఫ్, షానవాజ్ దహానీ





టీమిండియా తుదిజట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్





టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ

పాకిస్తాన్‌తో జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. రిషబ్ పంత్ స్థానంలో దినేష్ కార్తీక్ వైపు రోహిత్ మొగ్గు చూపాడు.

Background

క్రికెట్ ప్రేమికులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. ఆసియా కప్ 2022లో దాయాదుల సమరానికి ఇంకా కొన్ని నిమిషాల సమయం మాత్రమే ఉంది. ఈ టోర్నీలో భాగంగా నేడు జరిగే రెండో మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం ఆగిపోయింది. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్, పాక్ తలపడుతున్నాయి. 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ రెండు జట్లూ తలపడడం ఇదే తొలిసారి. ఆ మ్యాచ్ లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.


టీమిండియా కూర్పు కుదిరింది!   
టీమిండియా పటిష్టంగానే కనిపిస్తోంది. రోహిత్, రాహుల్ ఓపెనర్లుగా బరిలో దిగే అవకాశం ఉంది. వారిద్దరూ ఎలాంటి భాగస్వామ్యం అందిస్తారో చూడాలి. వారి తర్వాత కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. సూపర్ ఫాంలో ఉన్న సూర్య నుంచి భారత్ మంచి ఇన్నింగ్స్ ఆశిస్తోంది. మిడిలార్డర్ లో పంత్, పాండ్య ఎలా ఆడతారో చూడాలి. సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కు జట్టులో చోటు దక్కకపోవచ్చు. యుజువేంద్ర చాహల్ తో పాటు ఆల్ రౌండర్ జడేజా స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు. పేస్ విభాగాన్ని భువనేశ్వర్ కుమార్ ముందుండి నడిపించనున్నాడు. అతనితో పాటు అర్ష్ దీప్ సింగ్, అవేశ్ ఖాన్ ఉంటారు. మరో స్పెషలిస్ట్ స్పిన్నర్ కావాలనుకుంటే వీరిద్దరిలో ఒకరికి బదులుగా రవి బిష్ణోయ్, అశ్విన్ లలో ఒకరిని తీసుకునే అవకాశముంది. 


ఈ మ్యాచ్ కోహ్లీకి చాలా కీలకం. గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న విరాట్.. నెల రోజుల విరామం తర్వాత మైదానంలో దిగుతున్నాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ లో తిరిగి గాడిన పడాలని చూస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌నకు 2 నెలలు కూడా లేని సమయంలో కోహ్లీ తిరిగి ఫాంలోకి రావడం చాలా ముఖ్యం.


దాయాదిని తక్కువ చేయలేం
ఇక మరోవైపు పాకిస్థాన్ కూడా బలంగానే కనిపిస్తోంది. కెప్టెన్ బాబర్ అజాం ఆ జట్టుకు పెద్ద బలం. ఇటీవల అతడు సూపర్ ఫాంలో ఉన్నాడు. అతడితో పాటు మహ్మద్ రిజ్వాన్, ఫకార్ జమాన్, షాదాబ్ ఖాన్ లతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. అయితే బౌలింగ్ లో షహీన్ దూరం కావడం ఆ జట్టుకు ఆందోళన కలిగించేదే. అతనితోపాటు మహ్మద్ వసీం కూడా దూరమయ్యాడు. అయినప్పటికీ నసీమ్ షా, హస్నైన్, దహానీ వంటి ప్రతిభావంతులు వారికి అందుబాటులో ఉన్నారు. స్పిన్ భారాన్ని ఖాదిర్, షాదాబ్, నవాజ్ మోయనున్నారు. 


పాకిస్థాన్ ను తేలిగ్గా తీసుకుంటే భారత్ కు తీరని నష్టం కలుగుతుంది. ఇది గత టీ20 ప్రపంచకప్ లోనే అర్థమైంది. గత ఏడాది 10 వికెట్ల ఘోర పరాజయాన్ని టీమిండియా మూటగట్టుకుంది. మళ్లీ ఓటమి దరిచేరకూడదనుకుంటే పాక్ పై మ్యాచ్ లో అలసత్వాన్ని ప్రదర్శించకూడదు. 


చరిత్ర మనవైపే
ఆసియాకప్ లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 14 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 8 మ్యాచ్ ల్లో నెగ్గింది. పాకిస్తాన్ 5 సార్లు గెలిచింది. మరో మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఇక టీ20ల్లో ఈ రెండు జట్లు 8 సార్లు తలపడగా భారత్ 6 సార్లు, పాక్ 2 సార్లు నెగ్గాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.