Glenn Maxwell T20 Stats & Record: ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ టీ20 రికార్డు అద్భుతంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ మ్యాక్స్‌వెల్ తన సత్తా చాటాడు. అలాగే గ్లెన్ మాక్స్‌వెల్ ప్రపంచవ్యాప్తంగా అనేక టీ20 లీగ్‌లలో ఆడుతున్నాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆస్ట్రేలియా తరఫున 98 టీ20 మ్యాచ్‌లు ఆడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ 98 మ్యాచ్‌ల్లో గ్లెన్ మాక్స్‌వెల్ 2159 పరుగులు సాధించాడు.
టీ20ల్లో గ్లెన్ మాక్స్‌వెల్ గణాంకాలు ఇలా ఉన్నాయి?
అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఆటగాడు 150.98 స్ట్రైక్ రేట్, 28.41 సగటుతో పరుగులు చేశాడు. గ్లెన్ మాక్స్‌వెల్ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో మూడు సార్లు సెంచరీ మార్కును దాటాడు. అంతే కాకుండా 10 హాఫ్ సెంచరీలు సాధించాడు. గ్లెన్ మాక్స్‌వెల్ బౌలింగ్‌లో 39 మంది వికెట్లను దక్కించుకున్నాడు. గ్లెన్ మాక్స్‌వెల్ ఎకానమీ 7.46గానూ, స్ట్రైక్ రేట్ 22.18గానూ ఉంది.
ఐపీఎల్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ ప్రదర్శన ఎలా ఉంది?
గ్లెన్ మాక్స్‌వెల్ ఐపీఎల్ కెరీర్‌ను పరిశీలిస్తే ఇప్పటివరకు 124 మ్యాచ్‌లు ఆడాడు. ఈ 124 మ్యాచ్‌ల్లో గ్లెన్ మాక్స్‌వెల్ 2,719 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ అత్యుత్తమ స్కోరు 95 పరుగులు. అతని స్ట్రైక్ రేట్ 147.62గా ఉంది. అయితే ఇప్పటి వరకు గ్లెన్ మాక్స్‌వెల్ ఐపీఎల్‌లో సెంచరీ మార్క్‌ను టచ్ చేయలేకపోయాడు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 18 హాఫ్ సెంచరీలను సాధించాడు. ఐపీఎల్‌లో బౌలర్‌గా 31 వికెట్లు పడగొట్టాడు. గ్లెన్ మాక్స్‌వెల్ ఎకానమీ 8.31గానూ, స్ట్రైక్ రేట్ 37.87గానూ ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు గ్లెన్ మాక్స్‌వెల్ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ వంటి జట్లకు ఆడాడు.
మరోవైపు వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20లో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఈ టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 18 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో వెస్టిండీస్ సిరీస్‌ను కూడా 3-2తో కైవసం చేసుకుంది.
వెస్టిండీస్ బ్యాటర్లలో ఓపెనర్ బ్రాండన్ కింగ్ (85: 55 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును విజయపథంలో నడిపించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ (47: 35 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) నుంచి తనకు చక్కటి సహకారం లభించింది. ఇక భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (61: 45 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సూర్యకు తిలక్ వర్మ (27: 18 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) చక్కటి సహకారం అందించాడు. వెస్టిండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
Also Read: నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడే ఓడిపోయాం: హార్దిక్ పాండ్య
Also Read: సిరీస్ వెస్టిండీస్‌దే - చివరి టీ20లో టీమిండియా ఘోర పరాజయం!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial