మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఈ సంవత్సరం ఐపీఎల్ ప్రదర్శన తనను పూర్తిగా ఆశ్చర్యపరిచిందని మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. ఇదే ఆటతీరును కొనసాగిస్తే.. ఈసారి కప్ చెన్నైకి వెళ్లడం ఖాయం అన్నాడు. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో 10 పాయింట్లు సాధించి చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.


ఈ ఐపీఎల్ ప్రారంభానికి ముందు అందరూ చెన్నై సూపర్ కింగ్స్‌ను ‘ఓల్డ్ బాయ్స్ ఆర్మీ’ అని ఎగతాళి చేశారని, కానీ వారి ప్రదర్శన ఆశ్చర్యాన్ని కలిగించిందని పీటర్సన్ తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్ ఓవర్సీస్ ఆటగాళ్లు అయిన ఫాఫ్ డుఫ్లెసిస్, మొయిన్ అలీ, శామ్ కరన్ కూడా అద్భుతమైన ప్రదర్శనను కనబరిచారని, ఈ నాలుగు నెలల గ్యాప్‌ను వారు ఎలా ఉపయోగించుకున్నారో తెలియరాలేదని పేర్కొన్నారు.


వారిలో ఎక్కువమందికి వయసు కాస్త ఎక్కువ కాబట్టి.. టచ్‌లోకి రావడానికి కాస్త సమయం పట్టవచ్చన్నారు. ఒకవేళ వాళ్లు సిద్ధంగా ఉంటే ఫ్రాంచైజీ చరిత్రలోనే కొన్ని చారిత్రాత్మక వారాలు వారి కోసం వేచి చూస్తున్నాయని అభిప్రాయపడ్డాడు. ఈసారి ఐపీఎల్ గెలిచే అవకాశం వారికే ఎక్కువగా ఉందని జోస్యం చెప్పాడు.


రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్న ముంబై ఇండియన్స్‌ను పీటర్సన్ హెచ్చరించాడు. యూఏఈలో ఐపీఎల్ ప్రారంభం అయ్యాక ముంబై ఇండియన్స్ ప్రారంభం కాస్త నిదానంగా ఉండే అవకాశం ఉందన్నారు. అయితే ప్రస్తుతం ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉందని, కొన్ని మ్యాచ్‌లు ఓడిపోతే ముంబై ప్లేఆఫ్స్‌కు దూరం అవుతుందని పేర్కొన్నాడు.


డిఫెండింగ్ చాంపియన్స్ కాబట్టి వారికి టోర్నీలో మంచి అవకాశం ఉంటుందని, కానీ వారికి ప్రారంభంలో మంచి రికార్డు లేదన్నాడు. టోర్నీ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లు ఓడిపోయి.. తర్వాత గెలవడం ముంబై ఇండియన్స్‌కు అలవాటుగా మారిందన్నాడు. అయితే టోర్నీ ముగింపు దూరంలో లేదు కాబట్టి ఇప్పుడు ఓడిపోతే పుంజుకోవడం కష్టమని అభిప్రాయపడ్డారు.


టోర్నమెంట్ ప్రస్తుత పరిస్థితిలో ముంబై ఇండియన్స్ మూడు లేదా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోతే వారి ప్లేఆఫ్ అవకాశాలు కష్టం అవుతాయని తెలిపారు. వారు ట్రోఫీని నిలుపుకోవాలనుకుంటు మొదటి బంతి నుంచే పోరాడాల్సి ఉంటుందన్నారు. ముంబై ఇండియన్స్‌లో ఉన్న ఆటగాళ్లను చూస్తే.. అది సాధ్యం కావడం పెద్ద కష్టం కాదన్నారు.


మూడుసార్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ఐదు సార్లు విజేతలు అయిన ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో రెండో దశ ఐపీఎల్ మొదలుకానుంది. సెప్టెంబర్ 19వ తేదీన దుబాయ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది.


Also Read: Rohit Sharma: డ్రెస్సింగ్‌ రూమ్‌లో భగ్గుమన్న విభేదాలు.. రోహిత్‌ను వైస్‌ కెప్టెన్సీ నుంచి తప్పించాలన్న కోహ్లీ!


Also Read: RCB, IPL 2021: ఈ సారైనా గెలిచేద్దాం..! యూఏఈలో ఆర్‌సీబీ వ్యూహాలు


Also Read: Virat Kohli Step Down: కోహ్లీ సారథ్యంపై ఆర్నెల్లుగా చర్చ.. అందుకే ఇలా చేశాడన్న సన్నీ